APPSC గ్రూప్ 2 పరీక్ష విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ విధానం

APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి 2024

APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి 2024: APPSC గ్రూప్ 2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి మరియు సిలబస్ గురించి తెలుసుకోవాలి. APPSC గ్రూప్ 2 పరీక్షా సరళిపై అభ్యర్థులకు స్పష్టమైన ఆలోచన ఉంటే, ప్రిపరేషన్‌కు మరియు పరీక్షను క్లియర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి గురించి తెలుసుకోవడం APPSC గ్రూప్ 2 పరీక్షలో స్కోర్ పొందడానికి మీకు సహాయం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 20 డిసెంబర్ 2023 న  APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ PDFను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. APPSC గ్రూప్ 2  కోసం పరీక్షా సరళి మరియు సిలబస్‌ని నోటిఫికేషన్‌ తో పాటు విడుదల అయింది. ఈ కథనంలో, మీరు APPSC గ్రూప్ 2  పరీక్షా సరళి యొక్క వివరణాత్మక వివరణను పొందుతారు. ఈ ఆర్టికల్‌లో APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్షా సరళి 2024 గురించి మరిన్ని వివరాలను తెలుసుకోండి.

Adda’s Studymate APPSC Group 2 Prelims 2024

APPSC గ్రూప్ 2 పరీక్ష  సరళి

ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 పరిక్షలకు కొత్త పరీక్షా విధానం మరియు సిలబస్ ను విడుదల చేసింది. APPSC Group 2  పరీక్షలో రెండు దశలు ఉంటాయి. రెండు దశలు కలిపి మొత్తం 450 మార్కులకు గాను రాతపరీక్షలు నిర్వహించి  తద్వారా  అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షా (మొదటి దశ) 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్స్ ఉంటాయి. పేపర్ I  150 మార్కులకు, పేపర్ II  150 మార్కులకు చొప్పున 300 మార్కులకు  మెయిన్ పరీక్ష  నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి అవలోకనం

ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 నోటిఫికేషన్ 20 డిసెంబర్ 2023 న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2  పరీక్షా యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో తనిఖీ చేయవచ్చు.

APPSC గ్రూప్ 2 పరీక్ష సరళి అవలోకనం
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్షా పేరు గ్రూప్ 2
ఖాళీలు 899
వర్గం పరీక్షా విధానం
నోటిఫికేషన్ 20 డిసెంబర్ 2023
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ www.appsc.gov.in

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 

APPSC గ్రూప్  2 ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉన్నాయి.  మొదటి దశ ప్రిలిమ్స్, రెండవ దశ మెయిన్స్ మరియు మూడవ దశ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్.  మొత్తం రెండు దశలు కలిపి 450 మార్కులకు రాతపరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.  రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్  పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. పోస్టుకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఈ దశలన్నింటినీ మెరిటోరియస్ మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

  • స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)
  • మెయిన్స్ పరీక్ష
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)

APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం

APPSC గ్రూప్ 2 అనేది రెండు దశల పరీక్ష. అభ్యర్థి మొదట  ప్రిలిమ్స్‌కు హాజరు కావాలి, తర్వాత ప్రధాన పరీక్ష  ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు (మెయిన్స్) హాజరు కావాలి.

  • 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  • ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30).
  • ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  •  పరీక్షకు 150 నిమిషాలు కేటాయిస్తారు.
  • గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
సమయం 150 నిమిషాలు

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా విధానం

  • APPSC గ్రూప్ 2 రెండో దశలో 300 మార్కులకు  మెయిన్ పరీక్ష  నిర్వహిస్తారు.
  • మెయిన్ పరీక్షలో రెండు పేపర్స్ ఉంటాయి: పేపర్ I  150 మార్కులకు, పేపర్ II  150 మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు  మెయిన్ పరీక్ష  నిర్వహిస్తారు.
  • పేపర్ I లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర మరియు భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ అంశాలు ఉంటాయి.
  • పేపర్ II లో భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ , శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలకి సంబంధించిన అంశాలు ఉంటాయి.
సబ్జెక్టు ప్రశ్నలు సమయం   మార్కులు
పేపర్-1  
  1. ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర.
  2. భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ
   150 150నిమి    150
పేపర్-2 
  1. భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ
  2. శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు
  150   150నిమి     150
                                మొత్తం                      300

గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?

APPSC గ్రూప్ 2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్

పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి అభ్యర్థుల కంప్యూటర్ నైపుణ్యానికి సంబంధించిన నిర్దిష్ట అంశాలను అంచనా వేస్తుంది. ప్రాక్టికల్ పరీక్షగా రూపొందించబడిన పరీక్షను పూర్తి చేయడానికి పాల్గొనేవారికి 60 నిమిషాల వ్యవధి ఉంటుంది.

APPSC Group 2 Computer Proficiency Test
Test Component Test Duration (Minutes) Maximum Marks Minimum Qualifying Marks
Proficiency in Office Automation with usage of Computers and Associated Software 60 100 SC/ST/PH: 30, B.C’s: 35, O.C’s: 40

 

APPSC గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ

APPSC గ్రూప్ 2 పరీక్ష సిలబస్ చాలా విస్తృతమైనది మరియు అందువల్ల ఎక్కువ కృషి అవసరం. ప్రతి పరీక్షను కొన్ని వ్యూహాలు మరియు ఉత్తమమైన సాధన ద్వారా  ఛేదించవచ్చు. కాబట్టి, ఇక్కడ మేము APPSC గ్రూప్ 2 పరీక్షలో మంచి మార్కులు పొందేందుకు అభ్యర్థులకు సహాయపడే కొన్ని వ్యూహాలను అందిస్తున్నాము.

  • APPSC గ్రూప్ 2 సిలబస్ పై మంచి అవగాహన కలిగి ఉండాలి
  • సిలబస్ ను అవగాహన చేసుకుని మీ సమయానికి తగినట్టు ప్రణాళిక రూపొందించండి.
  • అభ్యర్థులు రోజువారీ అప్‌డేట్‌ల కోసం GK & కరెంట్ అఫైర్స్‌ని తనిఖీ చేయాలి, రోజు వార్త పత్రికలను చదవాలి.
  • అవసరమైన ప్రిపరేషన్ స్థాయిని మెరుగు పరచుకోవడం కోసం మాక్ టెస్ట్‌లను  పరిష్కరించండి.
  • APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను సాధన చేయండి. APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను సాధన చేయడం వలన పరీక్షా యొక్క ట్రెండ్ అర్దమవుతుంది.
  • చదివిన అంశాన్ని మరుసటి రోజు రివిజన్ చేయండి తద్వారా మీరు చదివినది బాగా గుర్తుంటుంది.

FAQs

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి?

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి

APPSC గ్రూప్ 2కి వయోపరిమితి ఎంత?

APPSC గ్రూప్ 2 జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు.

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ ఏమిటి?

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఉంటుంది

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

3 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

6 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

6 hours ago

IBPS అడ్మిట్ కార్డ్ 2024 వివిధ పోస్టుల కోసం విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ లింక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…

7 hours ago

TSPSC AE ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ జనరల్ మెరిట్ లిస్ట్ PDF

TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…

10 hours ago