వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్‌ , AP Tops in Agricultural Infrastructure Design

వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్‌: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పనకు 2021–22 బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం రూ.11,477 కోట్లు కేటాయించినట్లు నాబార్డు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో కేటాయింపులపై నాబార్డు వార్షిక నివేదిక విశ్లేషించింది.

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్‌ రాష్ట్రాల కేటాయింపులు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏపీలో వ్యవసాయ రంగంలో స్టోరేజి, వేర్‌హౌసింగ్, సాగునీరు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల మౌలిక వసతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగానే రైతులు పండించిన పంటల నిల్వ కోసం అవసరమైన గోదాములను సైతం నిర్మిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్న విషయం తెలిసిందే. రూ.2,269.30 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,948 భవనాలు తుది దశలో ఉన్నాయి. మొత్తం నిర్మాణాలను ఈ ఏడాది సెపె్టంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అలాగే, పాడి రైతుల కోసం రూ.399.01 కోట్ల వ్యయంతో తొలి దశలో 2,535 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే.

***************************************************************************************

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

6 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

8 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

9 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

10 hours ago