AP State GK MCQs Questions and Answers in Telugu,9th June 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

Q1. ఆంధ్రప్రదేశ్ లో అనార్ధ్ర ఆకురాల్చు అడవులులో ముఖ్యంగా కనిపించే వృక్షజాతులను కనుగొనండి?

  1. టేకు, ఏగిస, బండారు, చిరమను,
  2. ఎర్ర చందనం, మంచిగంధం, నల్లమద్ది
  3. a మరియు b రెండూ
  4. a మరియు b రెండూ కాదు.

Q2. ఈ క్రింది వాటిలో రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నెలలు ఏవి?

  1. ఎర్ర నేలలు
  2. నల్లరేగడి నేలలు
  3. తీరప్రాంత ఇసుక నేలలు
  4. లాటరైట్ నేలలు

Q3. ఆంధ్రప్రదేశ్ లో రెల్లుగడ్డి అదికంగా కనిపించే అరణ్యాలు ఏవి?

  1. అనార్ధ ఆకురాల్చు అడవులు
  2. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు
  3. చిట్టడవులు
  4. తీర ప్రాంత అడవులు

Q4. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిట్టడవులలో కనిపించే ముఖ్యమైన వృక్షజాతుల పేర్లను తెలపండి?

  1. తుమ్మ, కలబంద,బ్రహ్మజెముడు ,నాగజెముడు
  2. వేగు, చండ్ర,రేగు, బలుసు
  3. a మరియు b రెండూ
  4. a మరియు b రెండూ కాదు.

Q5. ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంత అడవులుకు గల మరొక పేరుని ఈ క్రింది వాటిలో తెల్పండి?

  1. క్షార జలారణ్యాలు
  2. టైడల్ అడవులు
  3. a మరియు b రెండూ
  4. a మరియు b రెండూ కాదు.

Q6. ఆంధ్ర రాష్ట్రములో ఈ క్రింది వాటిలో ఏ నేలలు గ్రానైట్ రాళ్ల నుండి రూపాంతరం చెంది ఏర్పడ్డాయి?

  1. నల్లరేగడి నేలలు
  2. ఎర్ర నేలలు
  3. తీరప్రాంత ఇసుక నేలలు
  4. లాటరైట్ నేలలు

Q7. తమని తామే దున్నుకునే నేలలు అని ఈ క్రింది వాటిలో ఏ నెలల్ని అంటారు కనుగొనండి?

  1. నల్లరేగడి నేలలు
  2. ఎర్ర నేలలు
  3. తీరప్రాంత ఇసుక నేలలు
  4. లాటరైట్ నేలలు

Q8. ఆంధ్ర రాష్ట్రములో ఈ క్రింది వాటిలో ఎర్ర నేలలు తేలికైనవి అయితే ఆ నేలలు నీటిలో కరిగే లవణాల శాతం ఎంతకు మించి ఉండవు?

  1. 27%
  2. 37%
  3. 25%
  4. 35%

Q9. ఈ క్రింది నేలలలో ఏ నేలకి వేరుశనగ , ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ది?

  1. నల్లరేగడి నేలలు
  2. ఎర్ర నేలలు
  3. తీరప్రాంత ఇసుక నేలలు
  4. లాటరైట్ నేలలు

Q10. ఎర్ర నేలలలో తరచూ వర్షాలు పడితే లేదా నీటి వనరులు ఉన్న చోట పండే వివిధ రకాల పంటల పేర్లను కనుగొనండి?

  1. వివిధరకాల ఫల జాతులు, పొగాకు, ప్రత్తి
  2. జొన్న సజ్జ వరి చెరకు
  3. పైవన్నీ
  4. పైవేవికాదు

Solutions:

Q1.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లో అనార్ధ్ర ఆకురాల్చు అడవులులో ముఖ్యంగా కనిపించే వృక్షజాతులు టేకు, ఏగిస, బండారు, చిరమను, ఎర్ర చందనం, మంచిగంధం, నల్లమద్ది

Q2.ANS.(A)

ఆంద్ర రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు. ఇవి చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా మరియు తూర్పుగోదావరి, కడప, కర్నూలు, శ్రీకాకుళం , కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి తక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇవి గ్రానైట్ రాళ్ళ నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి.

Q3.ANS.(C)

75 సెంటీ మీటర్ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు , అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ముళ్ళ పొదలు మరియు రెల్లుగడ్డి ఎక్కువగా కనిపిస్తాయి.

Q4.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిట్టడవులలో కనిపించే ముఖ్యమైన వృక్షజాతులు తుమ్మ, కలబంద,బ్రహ్మజెముడు, నాగజెముడు, వేగు, చండ్ర,రేగు, బలుసు.

Q5.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంత అడవులుకు గల క్షార జలారణ్యాలు , టైడల్ అడవులు

Q6.ANS.(B) ఎర్ర నేలలు అనేవి గ్రానైట్ రాళ్ళ నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేలికైన నేలలు.తక్కువ బంకమన్ను తో ఉండి నీటిని గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి.నీటిలో కరిగే లవణాలు ౦.25% మించవు. వృక్ష జంతు సంబంధిత పదార్దాలు లోపించి ఉంటాయి(హ్యుమస్).

Q7.ANS.(A)

వేసవిలో పెద్ద నెర్రలు పది గట్టిగ ఉండే ఈ నేలలు వర్షం పడగానే మెత్తగా జిగటగా మారతాయి. దీని వల్ల దున్నడం కష్టమవుతుంది .అందుకే వీటిని తమని తామే దున్నుకునే నేలలు (SELF-PLOUGHING) అని అంటారు.

Q8.ANS.(C)

ఎర్ర నేలలు అనేవి గ్రానైట్ రాళ్ళ నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి. ఇవి తేలికైన నేలలు.తక్కువ బంకమన్ను తో ఉండి నీటిని గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి.నీటిలో కరిగే లవణాలు 0.25% మించవు. వృక్ష జంతు సంబంధిత పదార్దాలు లోపించి ఉంటాయి(హ్యుమస్).

Q9.ANS.(B)

ఎర్ర నేలలు ముఖ్యంగా  వేరుశనగ, ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ది. తరచుగా వర్షాలు, నీటి వనరులు ఉన్న చోట్ల ప్రత్తి , పొగాకు , వివిధ ఫల జాతులకు కూడా ఈ నేలలు అనువైనవి. ఎర్ర నేలల్లో జొన్న, సజ్జ , వరి, చెరకు కూడా పండుతాయి.

Q10.ANS.(C)

ఎర్ర నేలలు ముఖ్యంగా  వేరుశనగ, ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ది. తరచుగా వర్షాలు, నీటి వనరులు ఉన్న చోట్ల ప్రత్తి , పొగాకు , వివిధ ఫల జాతులకు కూడా ఈ నేలలు అనువైనవి. ఎర్ర నేలల్లో జొన్న, సజ్జ , వరి, చెరకు కూడా పండుతాయి

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website

sailakshmi

IBPS RRB క్లర్క్ రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపు జాబితా డౌన్లోడ్ లింక్

IBPS RRB క్లర్క్ రిజర్వ్ జాబితా 2023-24ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన వెబ్‌సైట్ @ibps.inలో…

7 mins ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడగింపు, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

60 mins ago

TS TET పరీక్షకు ఉత్తమ రివిజన్ పద్ధతి తెలుసుకోండి

నేర్చుకోవడానికి విధ్యార్ధి దశలో చాలా ప్రాధాన్యత ఉంది ఏ విషయంకైనా పూర్తి అవగాహన, పరిజ్ఞానం మనం ఏ విధంగా నేర్చుకున్నాము…

2 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 30 ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

17 hours ago

భారతదేశంలోని గిరిజన పండుగల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…

18 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

19 hours ago