AP and Telangana States November Weekly Current Affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నవంబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of  November 3rd and 4th Week.

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current Affairs

1. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు

Telangana Diagnostics

నాణ్యమైన వైద్యమే కాకుండా బాధితులు/రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌కు మెడికల్‌ టెస్టింగ్‌ విభాగంలో నేషనల్‌ అక్రిడేషన్ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కొలాబొరేషన్‌ లేబొ రేటరీస్‌(ఎన్ ఏబీఎల్‌) సర్టిఫికేషన్ లభించింది.

2. బొర్లామ్‌లో బ్రహ్మీలిపి రాతిపాత్ర లభ్యం

Brahmi Script

పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ సంస్థ(ప్రిహా)కు చెందిన బృందం ఓ మట్టి దిబ్బపై లఘు శాసనంతో కూడిన రాతిపాత్రను గుర్తించింది. దీనిపై ఉన్న అక్షరాలు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ‘హిమాబుహియ’ లేక ‘హిమాబుధియ’ అనే ఐదు అక్షరాలు..బ్రహ్మీ లఘు శాసనంలో ‘హిమ’ అనే పదం బౌద్ధ భిక్షుని(స్త్రీ)ది కావచ్చని.. ఈ శాసనాన్ని పరిష్కరించిన ఎపిగ్రఫిస్ట్‌ డాక్టర్‌ మునిరత్నంరెడ్డి అభిప్రాయపడుతున్నారు.

3. Solar power: సౌర వెలుగుల ‘ముఖర’

Solar power

ఆదిలాబాద్‌ జిల్లా ముఖర(కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్‌ సౌకర్యం కల్పించుకుని రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. పంచాయతీల్లో విద్యుద్దీపాలు, ఇతర సౌకర్యాల బిల్లులు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందికర  పరిస్థితులున్నాయి.  దీంతో సమస్య పరిష్కారానికి సర్పంచ్‌ వినూత్నంగా ఆలోచించారు.

4. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం

Inauguration of Ramagundam Fertilizer Factory

రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేస్తున్నట్లు సభా వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. డిజిటల్‌ విధానంలో రిమోట్ ద్వారా కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. భద్రాచలం రోడ్‌ నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే ట్రాక్‌ను ప్రారంభించారు. రామగుండం ఎరువుల పరిశ్రమ ప్రయోజనాలు – తెలంగాణ రైతాంగానికి ఎలా ఉపయుక్తమనే అంశాన్ని వీడియో రూపంలో వేదికపై ప్రదర్శించారు. వివిధ జిల్లాలకు అనుసంధానంగా విస్తరిస్తున్న 3 జాతీయ రహదారుల పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. రూ.2,268 కోట్ల వ్యయంతో ఈ మార్గాల్ని విస్తరించనున్నారు. బోధన్‌ – బాసర – భైంసా (ఎన్‌హెచ్‌-161) మార్గంలో 56 కి.మీ.లను రూ.644 కోట్లతో, సిరొంచా – మహదేవ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-353) రోడ్డును 17 కి.మీ.ల మేర రూ.163 కోట్లతో, మెదక్‌ – సిద్దిపేట – ఎల్కతుర్తి (ఎన్‌హెచ్‌-765) మార్గాన్ని 134 కి.మీ. మేర రూ.1461 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు. వీటి వీడియో దృశ్యాలను వేదికపై ప్రదర్శించారు.

5. ఆగ్రోస్‌కు ‘స్కోచ్‌ సిల్వర్‌’ అవార్డు 

‘Scotch Silver’ Award for Agros

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్‌కు జాతీయ స్థాయి ‘స్కోచ్‌ సిల్వర్‌’ అవార్డు లభించింది. వ్యవసాయ విభాగంలో జాతీయ స్థాయిలో రెండోస్థానం పొందిన ఆగ్రోస్‌కు ఆన్‌లైన్‌ ద్వారా అవార్డును అందజేశారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆగ్రోస్‌ ఎండీ రాములును వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు సత్కరించారు.

నిరుద్యోగ గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రైతుసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాములు వివరించారు. వాటి ద్వారా రైతులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, విత్తనాలను నేరుగా అందిస్తున్నారని వెల్లడించారు. అగ్రికల్చర్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు ప్రోత్సాహంతో ఆగ్రోస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు.

Andhra Pradesh State Weekly Current Affairs

1. 26న పీఎస్‌ఎల్‌వీ సీ54 ప్రయోగం

PSLV C54 launch on 26

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 26న ఉదయం 11.56 గంటలకు తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ లో పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ సీ54) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 960 కేజీల బరువు కలిగిన ఓషన్‌శాట్‌–3 (ఈవోఎస్‌–06) ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపనున్నారు. భారత్‌కే చెందిన తైబోల్ట్‌–1, తైబోల్ట్‌–2, ఆనంద్, ఇండియా–భూటాన్‌ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా ఐఎన్‌ఎస్‌–2బీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ –2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు.

2. ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ నంబర్‌–1 

AP is number 1 in oil palm cultivation

ఆయిల్‌పామ్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే లీడర్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా నిలిచిందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ హెచ్‌పీ సింగ్‌ పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో మూడు రోజులపాటు జరగనున్న 3వ జాతీయ ఆయిల్‌పామ్‌ సదస్సు  ప్రారంభమైంది.

ఆయిల్‌పామ్‌ రంగంలో అత్యుత్తమ పురోగతి సాధిస్తున్న రాష్ట్రంగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ తరఫున రాష్ట్ర ఉద్యాన కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ స్టేట్‌ ఇన్‌ ఇండియా’ అవార్డును అందుకున్నారు. సదస్సులో హెచ్‌పీ సింగ్‌ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగవుతుంటే.. 1.90 లక్షల హెక్టార్లు ఏపీలోనే ఉందన్నారు.

ఏపీని స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాలు ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 29 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను విస్తరించేందుకు అనువైన ప్రాంతం ఉందన్నారు. విస్తరణ కోసం పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

3. ఏపీకి రెండు ‘స్కోచ్‌ గోల్డ్‌’ అవార్డులు

‘Scotch Gold’ Awards

పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్‌ గోల్డ్, మరో నాలుగు స్కోచ్‌ సిల్వర్‌ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్‌ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా  ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్‌ సంస్థ అవార్డులను ప్రకటించింది.

మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్థ గోల్డ్‌ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు.

4. ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు

AP Congress Chief

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత గిడుగు రుద్రరాజును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నియమించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్‌ వలీ, జంగా గౌతమ్, పద్మశ్రీ సుంకర, పి.రాకేశ్‌రెడ్డి నియామకాల ప్రతిపాదనను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నవంబర్‌ 23న ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా–సోషల్‌ మీడి యా కమిటీ చైర్మన్‌గా ఎన్‌.తులసిరెడ్డిలకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌ చాందీతో పాటు 18 మంది, కోఆర్డినేషన్‌ కమిటీలో 33 మంది నేతలతో పాటు పీసీసీ విభాగాల అధ్యక్షులు ఉంటారని ఏఐసీసీ వెల్లడించింది. పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు రాజకీయ వ్యవహారాలు, కో–ఆర్డినేషన్‌ కమిటీల్లో చోటు కల్పించారు.

5. ఏపీతో ’ఈఈఎస్‌ఎల్‌’ ఒప్పందం

‘EESL’ agreement with AP

గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు విద్యుత్‌ ఆదా చేయగల గృహోపకరణాలను తక్కువ ధరకు పంపిణీ చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారునికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను మార్కెట్‌ ధర కన్నా తక్కుకే అందచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా గృహ నిర్మాణ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈఈఎస్‌ఎల్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది.

గృహ నిర్మాణ శాఖ, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ఆదివారం జరిగిన టెలీకాన్ఫెరెన్స్‌లో ఈఈఎస్‌ఎల్‌ సీఈఓ విశాల్‌ కపూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంధన సామర్థ్య రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు సహకరించేందుకు ఈఈఎస్‌ఎల్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

6. పండ్ల ఉత్పత్తిలో  దేశంలోనే ఏపీ అగ్రగామి

AP is the leader in fruit production in the country

పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆ సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 10,72,41,510 టన్నుల పండ్లు ఉత్పత్తి అవగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా అత్యధికంగా 17.72 శాతమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ శాఖ 2021–22లో రాష్ట్రాలవారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై మూడో ముందస్తు అంచనాలను వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం.. బత్తాయి, అరటి, బొప్పాయి, మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏపీలో మొత్తం పండ్ల ఉత్పత్తి 1,89,99,020 టన్నులు. ఆ తరువాత  1,24,66,980 టన్నులతో మహారాష్ట్ర, 1,11,13,860 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

మొత్తం పండ్లు సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌కన్నా మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ,  ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో పండ్ల సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లుండగా మహారాష్ట్రలో 8,31,180 హెక్టార్లలో సాగు చేసినట్లు ఆ నివేదిక తెలిపింది.

7. పాతపట్నం జాతీయ రహదారి, ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రపంచం నలుమూలలా వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. విశాఖలో రూ.10,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని రిమోట్‌ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, చేపల రేవు నిర్మాణం, రాయపూర్‌ – విశాఖపట్నం మధ్య 6 వరుసల ఆర్థిక కారిడార్, విశాఖలోని కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు రహదారి విస్తరణ, శ్రీకాకుళం నుంచి అంగుల్‌ వరకు పైపులైను ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పాతపట్నం నుంచి నర్సన్నపేట వరకు నిర్మించిన జాతీయ రహదారి, తూర్పు తీరంలో ఓఎన్‌జీసీ ‘యు’ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

7 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

8 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

10 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

10 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

11 hours ago