AP and Telangana States December Weekly Current Affairs | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిసెంబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of  December 1st and 2nd Week.

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Weekly Current Affairs

1. అక్రమ మైనింగ్ కేసుల్లో AP మూడవ స్థానంలో నిలిచింది.

Mining

అక్రమ మైనింగ్ కేసుల్లో AP మూడవ స్థానంలో నిలిచింది. వరుసగా మూడేళ్ళ కాలం లో చాలా కేసులు నమోదయ్యాయి. 3,396 వాహనాలు సీజ్ చేయబడ్డాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం జరిమానా రూపంలో 420.91 కోట్లను వసూలు చేశారు.

2. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ గా సంపత్ కుమార్ నియమితులయ్యారు.

telugu script

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ గా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ నియమితులయ్యారు. ఇంతకు ముందు సంపత్‌కుమార్‌ మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మైసూరులోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నారాయణ చౌదరి  సంపత్ కుమార్ ని డైరెక్టర్ గా  నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు పనిచేసిన ఆచార్య మునిరత్నం నాయుడు పదవీకాలం నవంబరు 27తో ముగిసింది.

3. సులభతర జీవనంలో విశాఖ తొలి పది నగరాల్లో ఉంది

Vizag

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ నగరాలు, పట్టణాల్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న సులభతర జీవన సర్వే – 2022లో లభించిన మార్కులలో  విశాఖపట్నం మొదటి పది స్థానాల్లో ఉంది. 2022కి సంబంధించి నవంబరు 9న ప్రారంభమైన సర్వే డిసెంబరు 23తో ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో వివిధ విభాగాల్లో వంద మార్కులకు గానూ, విశాఖ 58 సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

సులభతర జీవన విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సర్వే నిర్వహిస్తోంది. రవాణా, విద్యుత్తు, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, గాలి నాణ్యత, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై ప్రజలు ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు తెలిపేలా సర్వే నిర్వహిస్తున్నారు.  లఖనవూ, ఝాన్సీ, రోహ్‌తక్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి విశాఖ నగరానికి ఇప్పటికి అత్యధికంగా 79,193, గుంటూరు 55,688 పాయింట్లు లభించాయి. విజయవాడ 41,464, కడప 33,311, చిత్తూరు నగరాలకు 14,593 పాయింట్లు వచ్చాయి.

4. ఈ-సంజీవనిలో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది

e-sajivani

ఈ-సంజీవనిని (ఉచిత టెలిమెడిసిన్‌ సర్వీస్‌) దేశంలో మొత్తం ఇప్పటి వరకు 8 కోట్ల మంది వినియోగించుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2.82 కోట్ల డాలర్లతో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో ఉందని వెల్లడించింది. తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌ (1 కోటి), కర్ణాటక (94.46 లక్షలు), తమిళనాడు (87.23 లక్షలు), మహారాష్ట్ర (40.70 లక్షలు), ఉత్తరప్రదేశ్‌ (37.63 లక్షలు), మధ్యప్రదేశ్‌ (32.83 లక్షలు), బిహార్‌ (26.24 లక్షలు), తెలంగాణ (24.52 లక్షలు), గుజరాత్‌ (16.73 లక్షలు) ఉన్నాయని పేర్కొంది.

5. ముగ్గురు తెలుగువారికి జాతీయ పురస్కారాలు

national awards

దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇందులో సర్వశ్రేష్ఠ్‌ దివ్యాంగ్‌జన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్‌ కోటాబత్తిని పద్మావతి, శ్రేష్ఠ్‌ దివ్యాంగ బాలికగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన చిన్నారి శ్రేయా మిశ్ర, దివ్యాంగులకు ఉత్తమ ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తున్నందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ తరఫున కె.సతీశ్‌రెడ్డి అవార్డులు అందుకున్నారు.

శ్రేయా మిశ్రకు బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ 2020 – 21లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో జరిగిన నృత్య ప్రదర్శనలో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు.  కోటాబత్తిని పద్మావతి ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి దివ్యాంగులకు గానం, అభినయం, నృత్యం, కంప్యూటర్, కుట్టుపని, కొవ్వొత్తులు, సాఫ్ట్‌ టాయ్స్‌ తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దివ్యాంగులకు ఉత్తమ ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తున్న ఏజెన్సీగా డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ను గుర్తించి సంస్థ ఛైర్మన్‌ కె.సతీశ్‌రెడ్డికి పురస్కారం అందించారు.

Telangana State Weekly Current Affairs

1. రూ.6,200 కోట్ల రూపాయలతో డేటా కేంద్రం ఏర్పాటు

Data Centre

సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్తి సంస్థ క్యాపిటల్యాండ్‌ తెలంగాణలో రూ.6,200 కోట్ల రూపాయల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్టు (క్లింట్‌) తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.  పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, క్యాపిటల్యాండ్‌ భారత విభాగం సీఈఓ సంజీవ్‌ దాస్‌గుప్తా ఒప్పందానికి సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా సంజీవ్‌ దాస్‌గుప్తా మాట్లాడుతూ  ‘‘సింగపూర్‌ కేంద్రంగా 22 ఏళ్ల క్రితం ఏర్పాటైన క్యాపిటల్యాండ్‌ సంస్థ ద్వారా 30 దేశాల్లోని 260 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నామనీ చెప్పారు.  కొన్నేళ్లుగా డేటా సెంటర్‌ డిజైన్, అభివృద్ధి, నిర్వహణలో ఆసియా, యూరప్‌లలో 25 డేటా కేంద్రాల ద్వారా మిగతావారి కంటే ముందున్నామన్నారు. ఇప్పటికే దేశంలో ఒక డేటా కేంద్రం నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్‌లోనే అతిపెద్ద డేటా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామనీ చెప్పారు.

2. రఘు అరికపూడికి బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు లభించింది

Social Worker Award

పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను రఘు అరికపూడికి బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌ అవార్డు ప్రకటించింది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆయన హైదరాబాద్‌ పటాన్‌చెరు ప్రాంతంలోని బీడీఎల్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూ దివ్యాంగులకు సేవను అందిస్తున్నారు.

3. దేశ రాజధానిలో భారత్‌ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభం

Bharat Rashtra samiti

దేశ రాజధాని దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయాన్ని రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ అధ్యక్షుడిగా లెటర్‌హెడ్‌పై తొలి సంతకం చేశారు.

4. దేశంలోనే మొదటి లిథియం బ్యాటరీల తయారీ కర్మాగారం

Lithium ion battery Factory

ప్రసిద్ది చెందిన బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొదటి ఆధునాతన విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని మరియు పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.  రూ.9,500 కోట్ల పెట్టుబడులతో మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో దీనిని స్థాపించనుంది.  అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున ఛైర్మన్,  గల్లా జయదేవ్, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండేళ్లలో మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ వెల్లడించారు.

5. ఐటీలో అగ్రస్థానం లో నిలవాలని ప్రణాళికా

Information Technology

సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో తెలంగాణ త్వరలోనే కర్ణాటకను అధిగమించి దేశంలో అగ్రస్థానంలో నిలవాలని  ప్రణాళిక పరంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రసిద్ధ సంస్థ బోష్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక కేంద్రాన్ని హైదరాబాద్‌ రాయదుర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ సమర్థ నాయకత్వం, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని  ప్రపంచ ప్రసిద్ధ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యంగా మారిందని,  సాంకేతికంగా దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా రూపుదిద్దుకుందన్నారు. రాష్ట్రంలో 2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించి, అత్యధిక వృద్ధి రేటు, ఉపాధి గల రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

6. మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి

Mata Sishu Award

మాతా శిశు సంరక్షణలో తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ అవార్డుల్ని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.పద్మజ దిల్లీలో అందుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్రం ప్రశంసించింది. ‘జాతీయ ప్రసూతి ఆరోగ్య సదస్సు’లో రాష్ట్రానికి 2 అవార్డులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్‌ వైఫరీ వ్యవస్థకు ప్రత్యేక అవార్డు లభించగా, హైరిస్క్‌ గర్భిణుల్ని గుర్తించి చికిత్స అందించడంలో రెండో స్థానం దక్కింది.

7. తెలంగాణ స్టార్టప్‌ ఖేతికి ప్రతిష్ఠాత్మక ‘ఎర్త్‌షాట్‌’ బహుమతి

earth shot prize

తెలంగాణకు చెందిన ఖేతి స్టార్టప్‌ ప్రతిష్ఠాత్మకమైన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ను గెలుచుకుంది. పర్యావరణహితంగా, చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయం పొందేలా ఈ సంస్థ రూపొందించిన ‘గ్రీన్‌హౌస్‌-ఇన్‌-ఏ-బాక్స్‌’ విధానానికి బహుమతి లభించింది. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన పురస్కారాల ఉత్సవంలో తుది అయిదుగురు విజేతల్లో ఖేతి స్టార్టప్‌ ఒకటిగా నిలిచింది. ఈ బహుమతి కింద ఖేతికి 1 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.పది కోట్లు) నగదు అందనుంది. ఈ పోటీకి మొత్తం వెయ్యి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోగా ప్రకృతి రక్షణ-పునరుద్ధరణ (ప్రొటెక్ట్‌ అండ్‌ రీస్టోర్‌ నేచర్‌) విభాగంలో తెలంగాణ స్టార్టప్‌ ఈ ప్రైజ్‌ను గెలుచుకుంది.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

sudarshanbabu

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

4 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

5 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

20 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

22 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

23 hours ago