Telugu govt jobs   »   APPSC   »   Andhra Pradesh Socio-Economic Survey

AP సామాజిక-ఆర్థిక సర్వే 2020-21 pdf తెలుగులో డౌన్‌లోడ్ చేయండి | AP Socio-Economic Survey pdf in Telugu Download

AP సామాజిక-ఆర్థిక సర్వే 2020-21 pdf తెలుగులో డౌన్‌లోడ్ చేయండి | AP Socio-Economic Survey pdf in Telugu Download: డౌన్‌లోడ్ లింక్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ పేజీ నుండి AP (ఆంధ్రప్రదేశ్) సామాజిక-ఆర్థిక సర్వే pdf ని ఇప్పుడే పొందండి. AP సోషియో-ఎకనామిక్ సర్వే పిడిఎఫ్ (AP Socio-Economic Survey pdf in Telugu Download) అత్యంత ఉపయోగకరమైన టూల్స్ పరీక్ష. సంవత్సరాలుగా AP సామాజిక-ఆర్థిక సర్వే pdf లో పోస్ట్ చేయబడిన విస్తృత ప్రశ్నల గురించి మీకు మంచి ఆలోచన వస్తుంది.

AP Socio-Economic Survey pdf overview (అవలోకనం)

Andhra Pradesh Socio-Economic Survey 2020-21 in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 కి సంబంధించి సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేయడం జరిగింది.జాతీయ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా రాష్ట్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ 2020 – 21 రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.58 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి – 3.8 శాతంతో తిరోగమనంలో ఉండటం గమనార్హం. రాష్ట్ర తలసరి ఆదాయంలో కూడా రూ.1,735 పెరుగుదల నమోదైంది.   2019 – 20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,68,480 ఉండగా 2020–21లో రూ.1,70,215గా నమోదైంది. 2019 –20లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,186గా ఉంది. కరోన మహమ్మారి కారణంగా తలెత్తిన లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ సమయాలలో  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.1,902.35 కోట్ల వ్యయంతో 5,33,670 మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించినట్లు సర్వే పేర్కొంది. నవరత్నాలతో అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు స్పష్టమైంది. Andhra Pradesh Socio-Economic Suryvey కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

కేంద్ర ఆర్ధిక సర్వే 2022 తెలుగులో PDF 

 

Andhra Pradesh Socio-Economic Survey 2020-21 in Telugu(Important Points) : ప్రధాన అంశాలు

ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, ప్రజా, సామాజిక ఆర్ధిక స్థితిగతులు:

  • ఆంధ్రప్రదేశ్ జనాభా సాంద్రత 2011 జనాభా లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు 304 మంది ఉన్నారు అఖిల భారత స్థాయిలో చదరపు కిలోమీటరుకు 382 మంది జనసాంద్రత కలిగి ఉన్నారు. రాష్ట్రంలో లింగ నిష్పత్తి 2001 లో 983 నుండి పెరిగి 2011 లో 997 కు చేరుకుంది, ఇది అఖిల భారత సంఖ్య 943 కన్నా ఎక్కువ.
  • 2001 లో 62.07 శాతంతో పోలిస్తే 2011 లో రాష్ట్ర అక్షరాస్యత 67.35 శాతం. రాష్ట్రం  అఖిల భారత అక్షరాస్యత రేటు 72.98 కన్నా  తక్కువ శాతం నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత 1981 లో 29.94 శాతం నుండి 2011 లో 67.35 కు  37 శాతం పైగా పెరిగింది. మహిళా అక్షరాస్యత రేటు  2001 లో 52.72 శాతం నుండి 2011 లో 59.96 శాతానికి పెరిగింది.
  • వృద్దిలో పట్టణీకరణ ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడింది. రాష్ట్ర జనాభాలో మొత్తం పట్టణ జనాభా 2001లో 24.13 శాతంతో పోలిస్తే 2011 లో 29.47 శాతానికి పెరిగింది.
  • భూ వినియోగ వర్గీకరణ ప్రకారం 37.11%(60.49 లక్షల హెక్టార్లు) భూమి సాగు కిందికి వస్తుంది. 22.63%(36.88 లక్షల హెక్టార్లు) అటవీ విస్తీర్ణం కిందకు, 12.73%(20.74 లక్షల హెక్టార్లు) వ్యవసాయేతర అవసరాలకు, 8.20%(13.32 లక్షల హెక్టార్లు) బీడు మరియు నిరుపయోగకర భూమి కిందకు వస్తుంది. రాష్ట్రంలో 13 వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి.
  • నైరుతి ఋతు పవన కాలం 2020-21లో  రాష్ట్రంలో 704.8 మి.మీ వర్షపాతం నమోదైంది ఇది  సాధారణ  వర్షపాతం 556.0 మిమీ కంటే  26.8%  ఎక్కువ సూచిస్తుందిశ్రీకాకుళం మరియు విజయనగరం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అయ్యింది మరియు రాయలసీమ ప్రాంతం 65% అధిక వర్షపాతం రికార్డు చేయబడినది. 2020-21 కాలంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో  (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు), అదనపు వర్షపాతం 25.1% నమోదైంది. ఈ సమయంలో కురిసిన వర్షపాతం సాధారణ వర్షపాతం  296.0 మి.మీ కంటే 370.3 మి.మీ ల అధిక వర్షపాతం నమోదయ్యింది.

1.వ్యవసాయం మరియు సంక్షేమం (Agriculture and welfare)

  •  ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం. ఈ పథకం ద్వారా 52.38 లక్షల మందిరైతు కుటుంబాలకు రూ.17,030 కోట్ల మేర ప్రయోజనం.
  •  పంటల బీమా ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉచిత పంటల బీమా పథకం ద్వారా 5.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్ల మేర లబ్ధి.
  • రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు.
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా.
  • రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందించేలా గ్రామ సచివాలయాల వద్ద 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
  • ఉద్యానవన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. ఆయిల్‌ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం.
  • భారతదేశంలో నూలు ఉత్పత్తిలో కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నది.
  • జాతీయ స్థాయిలో శూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ నిర్వహణలో రాష్ట్రం 3 వ స్థానంలో ఉన్నది.
  • జలయజ్ఞంలో భాగంగా 54 సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 ప్రాజెక్టులు పూర్తి. రెండు ప్రాజెక్టుల్లో తొలి దశ పనుల పూర్తి. పురోగతిలో పోలవరం, పూల సుబ్బయ్య ప్రాజెక్టులు.
  • వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం.
  • జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రం 29.7% ఉత్పత్తిని కలిగి ఉన్నది.
  • 2020 – 21లో 168.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. 2019–20లో 175.12 లక్షల టన్నుల ఉత్పత్తి.

 

2. గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు (Housing, social security, welfare measures)

  • పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన 27.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు 27.94 లక్షల ఇంటి పట్టాల పంపిణీ
  • వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో భాగంగా రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం.
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ.  61.73 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.1,487 కోట్లు పెన్షన్‌ రూపంలో పంపిణీ.
  • దివ్యాంగులకు నెలకు రూ.3,000, డయాలసిస్‌ రోగులకు రూ.10,000 చొప్పున పెన్షన్‌ వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్‌ పంపిణీ.
  • MGNREGA పధకం కింద 13 జిల్లాలలో 2604 లక్షల వ్యక్తుల పనిదినాలు కల్పించడం ద్వారా దేశంలోనే 6 వ స్థానంలో ఉన్నది.

డౌన్లోడ్ Free Study Material 

3. ఆరోగ్యం – మహిళా సంక్షేమం (Health – Women’s welfare)

  • కోవిడ్‌ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొంటోంది.
  • 1,80,49,054 మందికి పరీక్షలు నిర్వహించగా 14,54,052 మందికి పాజిటివ్‌గా నిర్థారణ. 
  • పది లక్షల జనాభాకు దేశంలో సగటున 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో సగటున 3.3 లక్షల మందికి పరీక్షలు జరిగాయి.
  • విదేశాల నుంచి క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొనుగోలు.
  • రాష్ట్రానికి రోజూ కేటాయిస్తున్న 590 టన్నుల ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో వినియోగం నమోదవుతున్న నేపథ్యంలో 900 టన్నులు కేటాయించాలని కేంద్రానికి వినతి.
  • వ్యాక్సినేషన్‌లో 45 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు ప్రాధాన్యం.
  • రాష్ట్రంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు 53.28 లక్షల మంది కాగా రెండు  డోసులూ తీసుకున్న వారి సంఖ్య 21.64 లక్షలు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా వెచ్చించి టీకాల కొనుగోలు.
  • 83.53 లక్షల మహిళలు 8.35 లక్షల SHG లలో నోమోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,185 గ్రామ సంస్థలు మరియు 662 మండల సమాఖ్యలు మరియు 13 జిల్లా సమాఖ్యలు ఉన్నాయి.
  • YSR సున్నా వడ్డీ పధకం కింద రూ.1400 కోట్ల రూపాయల నగదును 8.78 లక్షల SHG ఎకౌంట్ల లోనికి జమ చేయడం జరిగింది.

4. ఇతర సంక్షేమ పథకాలు (Other welfare schemes)

  • జగ్జీవన్‌ జ్యోతి పథకం ద్వారా 15.63 లక్షల మంది ఎస్సీలు, 5.23 లక్షల మంది ఎస్టీల నివాసాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌
  • కొత్తగా 53 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు
  • వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటో, కారు కలిగిన 2.74 లక్షల మందికి లబ్ధి
  • వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా పేద చేనేత కుటుంబాలకు ఏటా రూ.24,000 ఆర్థిక సాయం. 81,703 మంది లబ్ధిదారులకు రూ.383.79 కోట్ల పంపిణీ

Read More: APPSC జూనియర్ అసిస్టెంట్ పరీక్ష విధానం & సిలబస్

5. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీఎస్‌) Sustainable Development Goals

  • 2030 నాటికి 17 విభాగాల్లో ఎస్‌డీజీఎస్‌ సాధించడం కోసం ఐక్యరాజ్యసమితి తోడ్పాటు.
  • దేశీయ ఎస్‌డీజీఎస్‌ ర్యాంకుల్లో  2018లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా 2019లో మూడో స్థానానికి ఎగబాకింది
  • పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యానికి సంబంధించి నీతి ఆయోగ్‌ విధించిన 6 లక్ష్యాలు, శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి విధించిన 16 లక్ష్యాల్లో 2019లో మొదటిస్థానం సాధించిన రాష్ట్రం.
  • మరో నాలుగు ఎస్‌డీజీఎస్‌ల్లో రెండవ ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకును రాష్ట్రం సాధించింది. 

6. మహిళా సాధికారత (Women Empowerment)

  • వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు.
  • 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ఆర్థికసాయం.
  • అన్ని కాంట్రాక్టు పనులు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా 87,74,674 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రూ.6,792.21 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ.

APPSC జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు ఎలా సిద్దమవ్వాలి?

7. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ (YSSAR‌ Arogyasree)

  • వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల లోపు ఉన్న 1.44 కోట్లకుపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీతో ప్రయోజనం పొందుతున్నాయి.
  • పథకం ద్వారా 1,577 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 2,436 ప్రొసీజర్లకు వర్తింపు.
  • వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా 1,484 ఎంపానల్డ్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ద్వారా 1,059 ప్రొసీజర్లకు చికిత్స.
  • ఈ పథకం ద్వారా 5,33,670 మంది రోగులకు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం. 
  • శస్త్రచికిత్స తర్వాత రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 సాయం.
  • డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద మూడేళ్లలో ఆరు దశల్లో పూర్తి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహణ

8. నవరత్నాలు – విద్య (Navratnas – Education)

  • జాతీయ సగటుతో పాటే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు రేటు 72.98 శాతం కాగా రాష్ట్రంలో 67.35 శాతం ఉంది.
  • జగనన్న అమ్మ ఒడి కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న 44.5 లక్షల మంది తల్లులకు రూ.15,000 చొప్పున మొత్తం రూ.6,673 కోట్లు ఆర్థిక సాయం అందింది. 
  • ఒకటి నుంచి పదో తరగతి చదివే 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాల పంపిణీ.
  • జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పథకాన్ని సమూలంగా మార్చేసి బలవర్థకమైన పౌష్టికాహారాన్ని 36.88 లక్షల మందికి అందిస్తోంది.
  • పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లీష్‌ మీడియం విద్యకు ప్రోత్సాహం
  • మనబడి నాడు– నేడు’ కింద తొలిదశలో 15,715 పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధి
  • జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 13.26 లక్షల మంది విద్యార్థులకు రూ.4,879 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు.
  • జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 10.89 లక్షల మంది విద్యార్థులకు ఆహారం, హాస్టల్‌ ఫీజుల వ్యయాన్ని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

9. పరిశ్రమలు – మౌలిక వసతులు (Industries – Infrastructure)

  • రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పన
  • వైఎస్సార్‌ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు.
  • వైఎస్సార్‌ నవోదయం ద్వారా ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణ.
  • రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం
  • మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ సెజ్‌ల్లో నాలుగు నాన్‌ మేజర్‌ పోర్టుల నిర్మాణ పనులు 

[sso_enhancement_lead_form_manual title=”AP సామాజిక ఆర్ధిక సర్వే 2020-21″ button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/05/21111137/AP-SOCIO-ECONOMIC-SURVEY-IN-TELUGU-2020-21.pdf”]

Download : 

APPSC Group 2 2022 Vacancies Complete Details, APPSC గ్రూప్ 2 2022 ఖాళీల పూర్తి వివరాలు

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!