Telugu govt jobs   »   World Asthma Day 2021: 04 May...

World Asthma Day 2021: 04 May | ప్రపంచ శ్వాస కొస వ్యాధి దినోత్సవం

ప్రపంచ శ్వాస కొస వ్యాధి దినోత్సవం

World Asthma Day 2021: 04 May | ప్రపంచ శ్వాస కొస వ్యాధి దినోత్సవం_2.1

ప్రతి సంవత్సరం మే 1 వ మంగళవారం ప్రపంచ శ్వాస కొస వ్యాధి(ఉబ్బసం) దినోత్సవం జరుపుకుంటారు.  ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉబ్బస వ్యాధి మరియు సంరక్షణ గురించి అవగాహన పెంపొందిస్తారు. ప్రాధమికంగా ఉబ్బసం ఉన్న వ్యక్తికి వారి కుటుంబాలకు మరియు  వారి స్నేహితులు మరియు సంరక్షకులకు కూడా మద్దతు తెలపడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 2021 ప్రపంచ శ్వాస కొస వ్యాధి  దినోత్సవం యొక్క నేపధ్యం “ఆస్తమా దురభిప్రాయాలను వెలికి తీయడం”.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం చరిత్ర:

ప్రపంచ శ్వాసకోస వ్యాధి దినోత్సవాన్ని ఏటా గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా (GINA) నిర్వహిస్తుంది. 1998 లో, స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన మొదటి ప్రపంచ ఆస్తమా సమావేశంతో కలిసి 35 కి పైగా దేశాలలో మొదటి ప్రపంచ ఉబ్బసం దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఉబ్బసం అంటే ఏమిటి?

ఉబ్బసం అనేది ఊపిరితిత్తుల యొక్క దీర్ఘకాలిక వ్యాధి, ఇది శ్వాస సమస్యలను కలిగిస్తుంది. ఉబ్బసం యొక్క లక్షణాలు శ్వాస తీసుకోకపోవడం, దగ్గు, శ్వాసలోపం మరియు ఛాతీలో బిగుతుగా అనిపించడం. ఈ లక్షణాలు కనిపించే సమయం మరియు తీవ్రత పెరిగే కొద్ది మారుతూ ఉంటాయి. లక్షణాలు అదుపులో లేనప్పుడు, శ్వాసనాలాలూ ఎర్రబడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఉబ్బసం నయం చేయలేనప్పటికి, ఆస్తమా ఉన్నవారు పూర్తి జీవితం  గడిపే విధంగా లక్షణాలను నియంత్రించవచ్చు.

Sharing is caring!

World Asthma Day 2021: 04 May | ప్రపంచ శ్వాస కొస వ్యాధి దినోత్సవం_3.1