Telugu govt jobs   »   TREIRB TS Gurukulam Notification 2023   »   TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB), గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలోఎంపికలు/ ఐచ్ఛికాలు ఇవ్వాలని తెలిపింది. అన్నీ అన్ని సొసైటీలకు మరియు జోనల్స్ కు ఐచ్ఛికాలు ఇస్తేనే పోస్టుల పోటీ బలంగా ఉంటుందని గురుకుల నియామక  బోర్డు వెల్లడించింది.  ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు అన్ని ఐచ్ఛికాలు ఇస్తేనే దరఖాస్తు ముందుకు సాగుతుందని, లేకుంటే నిలిచిపోతుందని స్పష్టం చేసింది. TGT పోస్టులకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికల సమయం 30 సెప్టెంబర్ 2023 వరకు ఉంటుంది. మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 వరకు ఎంపికలు /ఐచ్ఛికాలు నమోదు చేయాలి.  ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు జరిగిన తరువాత నిర్వహిస్తారు.

SA, PET, SGT మరియు భాషా పండితులు సిలబస్ ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి?_70.1APPSC/TSPSC Sure shot Selection Group

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు వివరాలు

డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీలు, కళాశాలల్లో లైబ్రేరియన్లు, పీడీలకు దరఖాస్తు సమయంలోనే కొన్ని పోస్టులకు గురుకుల నియామక బోర్డు ఐచ్ఛికాలు తీసుకుంది. ఈ పోస్టులు అన్నీ మల్టీజోనల్‌ పోస్టులు కావడంతో ఐచ్ఛికాల సంఖ్య తక్కువగా ఉంది. ఒక్కో పురుష అభ్యర్థి 10 ఆప్షన్లు, మహిళా అభ్యర్థులు మహిళా కళాశాలలతో కలిపి 20 ఐచ్ఛికాలు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జోన్లు ఉన్నాయి. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, పాఠశాలల లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులన్నీ జోనల్‌ పోస్టులుకి సంబంధించినవి. ఒక్కో పురుష అభ్యర్థి 35 ఐచ్ఛికాలు, మహిళా అభ్యర్థి 70 ఐచ్ఛికాలు /ఎంపికలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు సమయంలో ఎంపికలు తీసుకుంటే ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురు అవుతాయని తీసుకోలేదు. ప్రస్తుతం పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి సొసైటీలు, జోన్లవారీగా ఐచ్ఛికాలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. అంతకు ముందు చేసిన నియామకాల్లో అభ్యర్థులు కొన్ని సొసైటీలను ఐచ్ఛికాలుగా పెట్టుకున్నందున పోస్టులు సాధించలేకపోయారు. ఇప్పుడు, అన్ని సొసైటీలు, అన్ని జోన్లకు ఐచ్ఛికాలు తప్పనిసరి చేయడం ద్వారా అభ్యర్థులు పోస్టులు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బోర్డు తెలిపింది.

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు షెడ్యూల్

ప్రస్తుతం పరీక్షలు రాసిన అభ్యర్థుల నుంచి సొసైటీలు, జోన్లవారీగా తమ ఎంపికలను దరఖాస్తు చేసుకోవాలి. TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు దరఖాస్తు షెడ్యూల్ దిగువన అందించాము.

పోస్ట్  తేదీ 
TGT – ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ 21 సెప్టెంబర్ 2023 – 30 సెప్టెంబర్ 2023
పాఠశాలల లైబ్రేరియన్లు 03 అక్టోబర్ 2023 – 09 అక్టోబర్ 2023
ఫిజికల్‌ డైరెక్టర్లు
ఆర్ట్‌ టీచర్‌
క్రాఫ్ట్‌ టీచర్‌
మ్యూజిక్‌ టీచర్‌

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు వెబ్ నోట్

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB), గురుకుల ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సొసైటీలు, జోన్ల వారీగా ప్రాధాన్యక్రమంలో ఎంపికలు/ ఐచ్ఛికాలు ఇవ్వాలని తెలుపుతూ వెబ్ నోట్ విడుదల చేసింది. TGT పోస్టులకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికల సమయం 30 సెప్టెంబర్ 2023 వరకు ఉంటుంది. మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 వరకు ఎంపికలు /ఐచ్ఛికాలు నమోదు చేయాలి. TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు వెబ్ నోట్ దిగువన అందించాము.

TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికలు వెబ్ నోట్ 

మెరిట్ జాబితా

ఈనెలాఖరు నాటికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు వెల్లడించేందుకు గురుకుల నియామక బోర్డు ప్రయత్నిస్తుంది. గురుకులాల్లో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్లు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు డెమో తరగతులు ఉన్నాయి. డెమో తరగతులున్న పోస్టులకు మెరిట్ జాబితా వెల్లడి చేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తోంది.

TREIRB TS గురుకుల ఫలితాలు 

SA, PET, SGT మరియు భాషా పండితులు సిలబస్ ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి?_80.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TGT పోస్టులకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపిక సమయం ఏమిటి?

TGT పోస్టులకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపికల సమయం 30 సెప్టెంబర్ 2023 వరకు ఉంటుంది

మిగతా పోస్టులకు TREIRB సొసైటీ మరియు జోనల్ ప్రాధాన్యత ఎంపిక సమయం ఏమిటి?

మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9 వరకు గడువులోగా ఎంపికలు /ఐచ్ఛికాలు నమోదు చేయాలి