Telugu govt jobs   »   Current Affairs   »   నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

The international cricket stadium at Navuluru in Guntur district is ready for matches | గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది

The international cricket stadium at Navuluru in Guntur district is ready for matches | గుంటూరు జిల్లా నవులూరులోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది
గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు సిద్ధమైంది. మూడేళ్ల కిందటే నిర్మాణం పూర్తయినా నిధుల కొరత కారణంగా చివరి దశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల అయ్యాయి. తొలి విడతగా రూ.15 కోట్లు విడుదల కావడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంటోంది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీలు నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో పాటు మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పురుషుల అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 12 నుంచి జరగనుంది. ఈ క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు పోటీపడనున్నాయి. అలాగే డిసెంబర్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీని నిర్వహించనున్నారు.

IBPS RRB PO Mains Score Card 2022_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

మూడు ట్రోఫీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహణకు ఏసీఏ సన్నాహాలు చేస్తోంది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్లు తలపడనున్నాయి. అలాగే, 2024 జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మహిళల అండర్-23 వన్డే ట్రోఫీ కోసం 21 మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. హైదరాబాద్, ఉత్తరాఖండ్, బరోడా, విదర్భ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల జట్లు పోటీపడతాయి.
అంతర్జాతీయ మ్యాచ్
త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 12 నుంచి వచ్చే ఆరు నెలల్లో మూడు ట్రోఫీలకు సంబంధించి 51 మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. బీసీసీఐ బృందం త్వరలో క్రికెట్ స్టేడియం ను పర్యటించి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.

Sharing is caring!

FAQs

ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ ఎక్కడ లభిస్తాయి?

పోటీ పరీక్షలకి ఉపయోగపడే ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ adda 247 తెలుగు వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లో చదవచ్చు.