Telugu govt jobs   »   Article   »   SSC GD 2024 will be conducted...

SSC GD 2023-2024 will be conducted in Telugu and other 13 Languages | SSC GD 2023-2024 తెలుగు మరియు ఇతర 13 భాషల్లో నిర్వహించనున్నారు

SSC GD 2023-24 తెలుగులో నిర్వహించనున్నారు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 24 నవంబర్ 2023న సాయుధ బాలగాల్లో (జనరల్ డ్యూటి) 26,146 ఖాళీలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC GD 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో విడుదల చేసింది. ఈ సంవత్సరం అధికారిక ప్రకటనలో SSC GD ని తెలుగు, హిందీ, ఇంగ్షీషు  వంటి 13 స్థానిక భాషలలొ నిర్వహించనున్నారు. తెలుగు మాధ్యమంలో SSC GD 2023 పరీక్ష కి సన్నద్దమవ్వడానికి మరియు రాయడానికి ఇది ఆంధ్ర మరియు తెలంగాణా అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం. SSC GD 2023 పరీక్ష ఇప్పటివరకు ఇంగ్లీష్ మరియు హిందీలో రెండు భాషలలోనే  నిర్వహించేవారు, అయితే SSC GD 2023 పరీక్ష తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించనున్నట్టు SSC తెలిపింది.

SSC GD 2023-24 పరీక్ష భాష అవలోకనం

SSC GD 2023 పరీక్షా భాష అవలోకనం

సంస్థ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పరీక్ష పేరు జనరల్ డ్యూటి (GD) కానిస్టేబుల్ 2023
ఖాళీలు 26146
SSC GD నోటిఫికేషన్ విడుదల తేదీ 24 నవంబర్ 2023
SSC GD పరీక్ష 2023 భాష తెలుగుతో సహా మొత్తం 13 భాషలు
అధికారిక వెబ్‌సైట్ www.ssc.nic.in

SSC GD 2024 తెలుగులో కూడా నిర్వహించనున్నారు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో ప్రాంత  అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.  అభ్యర్థులు ఈసారి తెలుగు లేదా వారి మాతృభాషలో పరీక్ష రాసేందుకు అవకాశం లభించింది. తెలుగు తో పాటు, అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, అస్సామీ, పంజాబీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, మలయాళం, కన్నడ, కొంకణి, మణిపూరీ.  భాషలలో కూడా నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ చర్య వలన స్థానిక భాషలలో తయారయ్యే అభ్యర్థులకు వారి మాతృభాషలో పరీక్ష రాయడానికి గొప్ప అవకాశాన్ని కల్పించింది. అధికారిక ప్రకటన 13వ పేజీలో ఈ భాషల వివరాలు అందించారు.

SSC GD 2024 will be conducted in Telugu and other 13 Languages_3.1

SSC GD 2024 పరీక్ష ముఖ్యాంశాలు

  • మొట్టమొదటిసారిగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి లేదా మార్చి 2023 న  నిర్వహించే SSC GD 2023 పరీక్షను హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించింది ఇందులో తెలుగు కూడా ఉంది.
  • నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా SSC GD 2023 పరీక్షను ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, అస్సామీ, పంజాబీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, మలయాళం, కన్నడ, కొంకణి, మణిపూరీ.  భాషలలో కూడా నిర్వహించనున్నారు.
  • ప్రిలిమినరీ పరీక్షలో నాలుగు విభాగాలలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీ మరియు దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా భాషలో అందిస్తారు. ఇది ఉత్తీర్ణత సాధించిన వారికి దేహ దారుఢ్య పరీక్ష (PST)మరియు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

SSC తీసుకున్న ఈ చర్య వలన ప్రాంతీయ భాషలలొ పరీక్ష రాయాలి అనుకున్న అభ్యర్ధులకు మరియు మాతృ భాషలో విధ్యని అభ్యసించిన అభ్యర్ధులకు మేలు జరుగుతుంది. SSC GD 2023 కేంద్ర సాయుధ బలగాలు (CAPF) తో పాటు NIA, SSF, అస్సాం రైఫిల్స్ (రైఫెల్ మెన్) విభాగాలలో ఈ పోస్టులని భర్తీ చేయనున్నారు.

SSC GD 2024 ఆంధ్ర మరియు తెలంగాణ లో పరీక్షా కేంద్రాలు

తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు కాకినాడ, కుర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, చీరాల, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, మరియు కరీంనగర్ లలో ఉన్నాయి. ఈ పరీక్షా కేంద్రాలలో కంప్యూటరు ఆధారిత పరీక్షని నిర్వహించనున్నారు.

SSC GD కానిస్టేబుల్ ఆర్టికల్స్ 
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024  SSC GD కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం 2023
SSC GD కానిస్టేబుల్ పరీక్షా తేదీ 2024 SSC GD కానిస్టేబుల్ జీతం 2023

SSC GD Live Batch 2023 | Online Live Classes by Adda 247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

SSC GD 2023 ఎన్ని భాషలలొ నిర్వహిస్తారు?

SSC GD 2023 నియామక పరీక్ష ని ఇంగ్షీషు, హిందీ తో పాటు తెలుగు మరియు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు.

SSC GD 2023 పరీక్ష పత్రం తెలుగు లో ఎలా రాయాలి?

అభ్యర్ధులు SSC GD 2023 నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేడప్పుడు తెలుగు లేదా వారి మాతృ భాష ని ఎంపిక చేసుకోవాలి, తద్వారా పరీక్ష రోజున వారు ఎంపిక చేసుకున్న భాష లో ప్రశ్న పత్రంని పొందుతారు.