Telugu govt jobs   »   Article   »   SSC CHSL 2023 పరీక్ష తెలుగులో

SSC CHSL 2023 తెలుగులో నిర్వహించబడుతుంది

SSC CHSL 2023 తెలుగులో నిర్వహించబడుతుంది: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 9 మే 2023న 1600 (తాత్కాలిక) ఖాళీల కోసం SSC CHSL 2023 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను వారి అధికారిక వెబ్‌సైట్ అంటే SSC.nic.inలో ప్రచురించింది. దీనితో పాటు SSC CHSL 2023 స్థానిక భాషలో లో నిర్వహించనుంది. తెలుగులో SSC CHSL 2023 పరీక్షా రాయాలి అనుకునే అభ్యర్థులకు ఇది ఒక  గొప్ప అవకాశం. SSC CHSL పరీక్ష ఇప్పటివరకు ఇంగ్లీష్ మరియు హిందీలో రెండు భాషలలో నిర్వహించబడింది, అయితే SSC CHSL 2023 పరీక్ష తెలుగుతో సహా మొత్తం 15 భాషలలో నిర్వహించబడుతుంది.

SSC CHSL 2023 పరీక్షా భాష అవలోకనం

SSC CHSL 2023 పరీక్షా భాష అవలోకనం

సంస్థ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పరీక్ష పేరు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి (CHSL, 10+2) 2023
ఖాళీలు 1600
SSC CHSL 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ 09 మే 2023
SSC CHSL పరీక్ష 2023 భాష తెలుగుతో సహా మొత్తం 15 భాషలు
అధికారిక వెబ్‌సైట్ www.ssc.nic.in

SSC CHSL 2023 తెలుగు భాషలో కూడా నిర్వహించబడుతుంది

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో తెలుగు మాట్లాడే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. అభ్యర్థులు ఈసారి మాతృభాషలోనే పరీక్ష రాయగలరు. తెలుగు తో పాటు, అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, అస్సామీ, పంజాబీ, తమిళం, ఉర్దూ, మరాఠీ, మలయాళం భాషలలో కూడా హాజరు కావచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ భాషల అభ్యర్థులకు వారి మాతృభాషలో పరీక్ష రాయడానికి గొప్ప అవకాశాన్ని కల్పించింది. దిగువ అందించిన చిత్రం నుండి ఏ భాషలో అభ్యర్థులు పరీక్ష రాయగలరో తనిఖీ చేయండి.

SSC CHSL 2023 Will Be Conducted in Telugu
SSC CHSL 2023 Will Be Conducted in Telugu

SSC CHSL 2023 పరీక్షా

  • మొట్టమొదటిసారిగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2 ఆగస్టు నుంచి  22 ఆగస్టు 2023 వరకు నిర్వహించే SSC CHSL 2023 పరీక్షను హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించింది.
  • నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా SSC CHSL 2023 పరీక్షను హిందీ, ఇంగ్లీషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహించాలని ఈ ఏడాది సిబ్బంది, శిక్షణ విభాగం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
  • టైర్-1 పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీ మరియు దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా భాషలో సెట్ చేయబడతాయి,
  • సెక్షన్-IIIలోని మాడ్యూల్-II మినహా టైర్-IIలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఇంగ్లీష్, హిందీ మరియు ఏదైనా భాషలో ప్రశ్నలు సెట్ చేయబడతాయి.

SSC CHSL ఆన్‌లైన్‌ దరఖాస్తు 2023, SSC CHSL కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి_40.1APPSC/TSPSC Sure shot Selection Group

SSC CHSL ఆన్‌లైన్‌ దరఖాస్తు 2023, SSC CHSL కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి_50.1

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

గతంలో SSC CHSL పరీక్షను ఏ భాషలో నిర్వహించారు?

గతంలో SSC CHSL ఇంగ్లీష్ మరియు హిందీలో నిర్వహించబడింది.

SSC CHSL 2023 పరీక్ష ఈసారి స్థానిక భాషల్లో జరగనుందా?

అవును, SSC CHSL 2023 పరీక్ష తెలుగుతో సహా మొత్తం 15 భాషలలో నిర్వహించబడుతుంది.