Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ పీఏసీ ఛైర్మన్‌

Payyuvula Keshav has been Appointed as PAC Chairman | పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ మరోసారి నియమితులయ్యారు

ఆంధ్రప్రదేశ్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ (టీడీపీ ఎమ్మెల్యే )మరోసారి నియమితులయ్యారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు. పయ్యావుల కేశవ్‌ గారు  పీఏసీ చైర్మన్ పదవితోపాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను నియమించిన అసెంబ్లీలో ఆర్థిక కమిటీల వివరాలను వెల్లడించారు.అలాగే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, ఎస్టిమేట్‌ (అంచనాల) కమిటీ చైర్మన్‌గా విశ్వాసరాయి కళావతిలను నియమించారు.

ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులు 

పీఏసీలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, చింతల రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, కొఠారి అబ్బయ్య చౌదరి, అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, జక్కంపూడి రాజా, కె. భాగ్యలక్ష్మిలు ఉన్నారు. ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పర్చూరి అశోక్‌బాబు, కేఎస్‌ లక్ష్మణరావులు కూడా సభ్యులుగా ఉన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యులు 

ప్రభుత్వ రంగ స్థల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రవీంద్రనాథ్‌రెడ్డి, అన్నా రాంబాబు, ఆరణి శ్రీనివాసులు, కిలారి వెంకట రోశయ్య, నాగులాపల్లి ధనలక్ష్మి, అలజంగి జోగారావు, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు) నియమితులయ్యారు. ఇక ఎమ్మెల్సీలు చెన్నుబోయిన శ్రీనివాసరావు, లేళ్ల అప్పిరెడ్డి, బి.తిరుమలనాయుడు ఉన్నారు.

అంచనాల (ఎస్టిమేట్) కమిటీ సభ్యులు 

ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి నేతృత్వంలోని ఎస్టిమేట్ కమిటీ సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గొర్లె కిరణ్‌కుమార్‌, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎం తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్‌, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు.. ఎమ్మెల్సీలు దేవసాని చిన్న గోవింద రెడ్డి, కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌, దువ్వారపు రామారావులు ఉన్నారు.

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ఆంధ్రప్రదేశ్ పీఏసీ (ప్రజా పద్దుల కమిటీ) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

ఆంధ్రప్రదేశ్ పీఏసీ (ప్రజా పద్దుల కమిటీ) ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు.