Telugu govt jobs   »   Telugu Current Affairs   »   నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం ప్రారంభం

నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం ప్రారంభం

మీడియా అద్దం లాంటిదని, అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్‌ఎం స్టేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడు తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హో దాలో నెల్లూరు ఎఫ్‌ఎంకు శంకుస్థాపన చేశామని, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకో వడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సంచలనాలకోసం కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలన్నారు. చానళ్లలోని చర్చల్లో సభ్యత, సంస్కారంతో గౌరవప్రదమైన పదాలు వాడాలన్నారు. ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని వారికి అనువుగా ఉండేలా సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు పత్రికలు, మీడియా మాధ్యమాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్‌ వెంపటి, ఆకాశవాణి డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌. వేణుధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

*******************************************************************************************Opening of a radio station in Nellore

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Opening of a radio station in Nellore

Download Adda247 App

 

 

Sharing is caring!