Telugu govt jobs   »   New Districts of Andhra Pradesh   »   New Districts of Andhra Pradesh

New Districts of Andhra Pradesh Complete list PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు

New Districts of Andhra Pradesh Complete list PDF: Andhrapradesh Proposed to Re-organize the current 13 districts to 26 new districts. The decision is taken in concern with the better administration and governance purposes. Here find the list of proposed New Andhra Pradesh Districts list PDF.

  • ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

 

New Districts of Andhra Pradesh Complete list PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు 

  • వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.
  • రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో… దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు.
  • కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు.
  • దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
  • కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

New Districts of Andhra Pradesh- Important Facts 

రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది.

విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా  ప్రకాశం ( 14,322 చ.కీ.మీ. )
విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా  విశాఖపట్నం (928 చ.కీ.మీ. )
జనాభా పరంగా  అతి పెద్ద జిల్లా కర్నూలు  (23.66 లక్షలు)
జనాభా పరంగా  అతి పెద్ద జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ( అరకు) (9.54 లక్షలు) 
  • కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

New Districts of Andhra Pradesh

జిల్లా పేరు జిల్లా కేంద్రం
శ్రీకాకుళం శ్రీకాకుళం
విజయనగరం విజయనగరం
మన్యం జిల్లా పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా  పాడేరు
 విశాఖపట్నం  విశాఖపట్నం
అనకాపల్లి అనకాపల్లి
తూర్పుగోదావరి కాకినాడ
 కోనసీమ   అమలాపురం
రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం
నరసాపురం  భీమవరం
పశ్చిమ గోదావరి   ఏలూరు
కృష్ణా  మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
గుంటూరు గుంటూరు
బాపట్ల బాపట్ల
పల్నాడు నరసరావుపేట
ప్రకాశం ఒంగోలు
ఎస్ పి ఎస్ నెల్లూరు నెల్లూరు
కర్నూలు కర్నూలు
నంద్యాల నంద్యాల
అనంతపురం అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా  పుట్టపర్తి
వై ఎస్ ఆర్ కడప కడప
అన్నమయ్య జిల్లా  రాయచోటి
చిత్తూరు  చిత్తూరు 
శ్రీ బాలాజీ జిల్లా  తిరుపతి

 

 Download :  ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking.

Sharing is caring!