What are the Neighbouring states of Telangana: The state of Telangana is spread over the Deccan, the plateau of India. It ranges from 15 ° 55 ‘to 19 ° 55’ north latitude and from 77 ° 22 ‘to 81 ° 2’ east longitude. Telangana is bordered by the state of Maharashtra and Chhattisgarh in the north, Karnataka in the west and Andhra Pradesh in the south and east.
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు: తెలంగాణ రాష్ట్రం భారతదేశ పీఠభూమి అయిన దక్కన్‌లో విస్తరించి ఉంది. ఇది 15° 55′ నుంచి 19° 55′ ఉత్తర అక్షాంశాల మధ్య, 77° 22’నుంచి 81° 2′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. తెలంగాణ చుట్టూ ఉత్తరాన మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్, పశ్చిమాన కర్ణాటక మరియు దక్షిణ మరియు తూర్పు దిశలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Neighbouring States తెలంగాణ సరిహద్దులు
తూర్పు | ఆంధ్ర ప్రదేశ్ |
పడమర | కర్ణాటక |
ఉత్తరం | మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ |
దక్షిణం | ఆంధ్ర ప్రదేశ్ |
Neighbouring States of Telangana (తెలంగాణ పొరుగు రాష్ట్రాలు)
భారతదేశం యొక్క అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి, ఇది భారత ఉపఖండం యొక్క మధ్య భాగంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు; దక్షిణం, తూర్పున ఆంధ్రప్రదేశ్, పడమరన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు లేదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం మరియు కరీంనగర్ ఉన్నాయి.
అక్షాంశాల మధ్య విస్తృతి దక్షిణాన గద్వాల జిల్లా నుంచి ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లాల మధ్య విస్తరించి ఉంది. రేఖాంశాల దృష్ట్యా విస్తృతి పడమర మహబూబ్ నగర్ జిల్లా నుంచి తూర్పున భద్రాది కొత్తగూడెం జిల్లాల మధ్య విస్తరించి ఉంది.
- తెలంగాణకు తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దులు లేవు. అందువల్ల దీన్ని భూ పరివేష్టిత రాష్ట్రం (Land Locked State) అని పిలుస్తారు.
- ఇది దేశంలో 5వ భూపరివేష్టిత రాష్ట్రం.
- తెలంగాణ రాష్ట్రపు వైశాల్యం 1,12,077 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17లోకసభ స్థానాలు, 120 శాసనసభ స్థానాలు ఉన్నాయి.
Telangana Border districts with other states (ఇతర రాష్ట్రాలతో తెలంగాణ సరిహద్దు జిల్లాలు)
కర్ణాటక సరిహద్దుగా 5 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 7 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 7 జిల్లాలు ఉన్నాయి.
కర్ణాటకతో సరిహద్దుగల జిల్లాలు (5):
- జోగుళాంబ గద్వాల
- మహబూబ్‌నగర్
- వికారాబాద్
- సంగారెడ్డి
- కామారెడ్డి
మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు (7):
- కామారెడ్డి,
- నిజామాబాద్
- నిర్మల్
- ఆదిలాబాద్
- కుమ్రం భీం ఆసిఫాబాద్
- మంచిర్యాల,
- జయశంకర్ భూపాలపల్లి
ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు గల జిల్లాలు (7):
- జోగుళాంబ గద్వాల
- వనపర్తి
- నాగర్‌కర్నూల్
- నల్లగొండ
- సూర్యాపేట
- ఖమ్మం
- భద్రాద్రి కొత్తగూడెం
ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు గల జిల్లాలు (2):
- జయశంకర్ భూపాలపల్లి
- భద్రాద్రి కొత్తగూడెం
గమనిక : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు లేదు.
భౌగోళిక స్వరూపం
- తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సముద్రమట్టం నుంచి సరాసరిన 1500 అడుగుల ఎత్తున ఉండి ఆగ్నేయానికి వాలి ఉంది.
- ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి.
- ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు.
- ఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.
Also Check: BARC రిక్రూట్‌మెంట్ 2022
****************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |