Telugu govt jobs   »   Article   »   IB ACIO

IB ACIO 2024 పరీక్ష క్లిష్టత స్థాయి

IB ACIO పరీక్ష విశ్లేషణ 2024

ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, భారతదేశం IB ACIO పరీక్ష 2024 యొక్క 1వ షిఫ్ట్‌ 17 జనవరి 2024న వివిధ పరీక్షా కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించింది. IB 995 ఖాళీలతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం టైర్ 1 పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 8:30 నుండి 9:30 వరకు షెడ్యూల్ చేయబడిన 1వ షిఫ్ట్ పూర్తయింది. ADDA 247 తెలుగు అభ్యర్ధులు మరియు 1వ షిఫ్ట్‌కు హాజరైన అభ్యర్థులు వారి పరీక్ష సమీక్ష నుండి విశ్లేషణ అందిస్తున్నాము. ఈ కథనంలో, మేము మీకు IB ACIO పరీక్ష విశ్లేషణ, 17 జనవరి,1వ తేదీగురించి తెలుసుకోండి. మేము మంచి ప్రయత్నాలు, క్లిష్టత స్థాయి మరియు విభాగాల వారీగా విశ్లేషణలను ఇక్కడ అందిస్తున్నాము.

IB ACIO పరీక్ష విశ్లేషణ 17 జనవరి, 1వ షిఫ్ట్ – క్లిష్టత స్థాయి

అభ్యర్థులు అందించిన విశ్లేషణ ప్రకారం, పరీక్ష స్థాయిని సులభం నుంచి మధ్యస్థం గా అభివర్ణించవచ్చు. అభ్యర్ధి పరీక్ష స్థాయి ప్రిపరేషన్ మరియు సాధన పైకూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఈ క్లిష్ట స్థాయి అభ్యర్థులకు తదుపరి షిఫ్ట్ లో పరీక్ష రాయడానికి ఒక దిక్సూచి లాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాము.

విభాగం క్లిష్టత స్థాయి
జనరల్ అవేర్‌నెస్ & జనరల్ స్టడీస్ మధ్యస్థం
లాజికల్/ఎనలిటికల్/న్యూమరికల్ ఎబిలిటీ & రీజనింగ్ ఎబిలిటీ సులభం
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సులభం-మధ్యస్థం
ఇంగ్లీష్ లాంగ్వేజ్ సులభం
 మొత్తంగా సులభం-మధ్యస్థం

IB ACIO పరీక్ష విశ్లేషణ 2024 మంచి ప్రయత్నాలు

IB ACIO పరీక్ష 2024లో విజయం పొందడానికి అభ్యర్థులు గరిష్ట సంఖ్యలో ప్రశ్నలను ప్రయత్నించాలి మరియు ఈ మంచి ప్రయత్నాల సంఖ్య కంటే ఎక్కువ వారి సరైన సమాధానాలు ఉండాలి. IB ACIO మొదటి దశలో జనరల్ స్టడీస్ & జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/ఎనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాలలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వివరణాత్మక IB ACIO పరీక్ష విశ్లేషణ కోసం పూర్తి కధనాన్ని తనిఖీ చేయండి.

IB ACIO విభాగాల వారీగా పరీక్ష విశ్లేషణ 2024

ఇక్కడ అభ్యర్థులకి మా నిపుణులచే వివరణాత్మక పరీక్ష సమీక్షను తెలుసుకోండి. IB ACIO పరీక్ష 2024లో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. విభాగాల వారీగా చేసిన విశ్లేషణ నిర్దిష్ట విభాగం నుండి అడిగిన అంశాలకు సంబంధించిన వివరణాత్మక అంతర్దృష్టిని అందిస్తుంది.

జనరల్ అవేర్‌నెస్ & జనరల్ స్టడీస్ కోసం IB ACIO పరీక్ష విశ్లేషణ 2024

ఈ విభాగం ప్రధానంగా ప్రపంచ, అంతర్జాతీయ మరియు జాతీయ సంఘటనల నుండి కరెంట్ అఫైర్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే అభ్యర్థులకు విస్తారమైన పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా జరిగే సాధారణ విషయాలపై అవగాహన ఉండాలి. 17 జనవరి 1 షిఫ్టులో అడిగిన ప్రశ్నలు కొన్ని ఇక్కడ అందించాము. ఈ ప్రశ్నలు పరీక్ష రాసిన అభ్యర్ధులు ADDA247 తో పంచుకున్నారు.

ప్రశ్నలు:

  • నిసార్ రాడార్ పై ఒక ప్రశ్న అడిగారు.
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ప్రశ్న
  • ఈఏఎస్ కమిటీ
  • యోజన నుంచి 2 ప్రశ్నలు అడిగారు.
  • క్రీడలలో మహిళల హాకీ గురించి ఒక ప్రశ్న
  • గ్లోబల్ వార్మింగ్ నుంచి ఒక ప్రశ్న.
  • రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి ఒక ప్రశ్న
  • అశోక్ సామ్రాట్ గురించి ఒక ప్రశ్న
  • భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన ప్రశ్న
  • ఉడాన్ పథకం గురించి ఒక ప్రశ్న
  • హీరాకుండ్ గురించి ఒక ప్రశ్న అడిగారు

లాజికల్/ఎనలిటికల్/న్యూమరికల్ ఎబిలిటీ & రీజనింగ్ ఎబిలిటీ కోసం IB ACIO పరీక్ష విశ్లేషణ

ఈ విభాగంలో, అభ్యర్థి యొక్క తార్కిక సామర్థ్యంని పరీక్షిస్తారు మరియు ఈ ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. సరైన ప్రణాళిక మరియు ప్రాక్టీస్ ఉంటే ఈ విభాగం లో అధిక మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో అడిగిన మొత్తం ప్రశ్నల సంఖ్య 20. ఈ విభాగం యొక్క క్లిష్టత స్థాయి స్థాయి సులభం.

విభాగం ప్రశ్నలు  క్లిష్టత స్థాయి
Missing Number Series 1-2 సులభం
Mirror Image 1 సులభం
Analogy 3 సులభం
Blood Relation 3 సులభం
Coding-decoding 2-3 సులభం-మధ్యస్థం
Mathematical operations 1 సులభం
Seating arrangement 1 సులభం
Ranking 1 సులభం
Syllogism 2-3 సులభం
Misc. 2-3 సులభం
మొత్తంగా 20 సులభం

IB ACIO జీతం 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం IB ACIO పరీక్ష విశ్లేషణ

ఇది పరీక్షలో ఎక్కువ సమయం తీసుకునే విభాగం. దిగువ పట్టిక IB ACIO 2024లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో అడిగిన అంశాల పూర్తి విశ్లేషణ ఇక్కడ తనిఖీ చేయండి.

a^3-b^3= ఇవ్వబడింది, a^2+b^2ని కనుగొనాలా?

విభాగం  ప్రశ్నలు  క్లిష్టత స్థాయి
LCM & HCF 1 సులభం
Time & speed 1 సులభం
Percentage 2-3 సులభం-మధ్యస్థం
Profit & Loss 2-3 సులభం
CI/SI 1 సులభం
Mensuration 2 మధ్యస్థం
Time & work 1 మధ్యస్థం
Missing Number Series (Matrix type) 1 సులభం-మధ్యస్థం
DI 3 సులభం
Simplification 1 సులభం
Misc. 4-5 సులభం-మధ్యస్థం
Total 20 సులభం-మధ్యస్థం

IB ACIO గత సంవత్సరం ప్రశ్న పత్రాలు డౌన్లోడ్ PDF

IB ACIO ఇంగ్షీషు లాంగ్వేజ్ పరీక్ష విశ్లేషణ

ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది పరీక్షలో అత్యధిక మార్కులను అందించి మరియు తక్కువ సమయం తీసుకునే భాగం. ఇక్కడ 20 మార్కులకు మొత్తం 20 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్ధులు అందించిన విశ్లేషణ ప్రకారం పరీక్ష క్లిష్టత స్థాయి సులభం. అభ్యర్థులు వ్యాకరణం, పదజాలం మరియు వ్యాకరణం పై పట్టు ఉంటే ఎక్కువ స్కోర్ పొందవచ్చు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ యొక్క విశ్లేషణ ఇక్కడ అందించాము.

పారా జంబుల్- 3 ప్రశ్నలు అడిగారు (మొదట చివరిగా పరిష్కరించబడింది మరియు 4 వాక్యాలను అమర్చండి)

విభాగం ప్రశ్నలు  క్లిష్టత స్థాయి
Cloze Test 2 సులభం
Synonyms 3 సులభం
Antonyms 3 సులభం
Para jumble 3 సులభం- మధ్యస్థం
Math the column 4 సులభం- మధ్యస్థం
Idioms & phrases 1 సులభం
Error detection 3-4 సులభం
Misc. 2-3 సులభం- మధ్యస్థం
Total 20 సులభం

IB ACIO గత సంవత్సరం కట్ ఆఫ్ 

Intelligence Bureau (IB) ACIO Executive Tier (I + II) Complete Live Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!