G-20 Summit 2023 | G-20 సమావేశం
G-20 Summit : విశాఖపట్నం వేదికగా నేటి నుంచి నాలుగు రోజులపాటు జీ-20 సమావేశాలు జరగనున్నాయి
2023 మార్చి 28 & 29 తేదీల్లో G-20 సమ్మిట్ అధికారిక సమావేశాలకు అతిధేయ నగరాల్లో ఒకటైన విశాఖపట్నంలో G-20 సమ్మిట్ సమావేశం జరగనుంది.విశాఖ మహా నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను (జీఐఎస్) ఘనం గా నిర్వహించి దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించగా, తాజాగా మంగళవారం నుంచి జీ-20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సు వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్ తో 28, 29, 30, 31 తేదీల్లో విశాఖలో జరగనుంది. నగరంలోని రాడిసన్ హోటల్లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ-20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు వంటివి అధికారులు పూర్తిచేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక -సాంస్కృతిక బృందాలను సిద్ధంచేశారు.
పూణే, కడియంల నుంచి తెచ్చిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.విద్యుత్ స్తంభాలకు విద్యుద్దీపాలను అలంకరించారు. ఇలా,విశాఖ నగరం మునుపెన్నడూ లేని రీతిలో ఎటు చూసినా ఎంతో సుందరంగా కనిపిస్తోంది. ఇక జీ-20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్, ఆర్కే బీచ్ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్ ఎయిర్ సఫారీ కూడా నిర్వహించారు. గత కొన్నిరోజులుగా మంత్రులు గుడివాడ అమర్ నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్ తదితరులు ఈ సదస్సు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
G-20 Countries | జీ-20 దేశాలు
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్.
నేడు సదస్సు ప్రారంభం.. హాజరుకానున్న సీఎం జగన్
జీ-20 సదస్సు తొలిరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి అనంతరం గాలా డిన్నర్లో పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. మరోవైపు,జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి రాష్ట్ర సమాచారాన్ని అందజేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు.
Also Read : Global Investment Summit 2023| Visakapatnam
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***********************************************************************************************************************