Telugu govt jobs   »   Latest Job Alert   »   ECIL ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్...

ECIL ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్, కోసం ఇంటర్వ్యూలు

ECIL లేదా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది షెడ్యూల్ A కేటగిరిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ, ECIL ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని తన అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. ECIL 2023-24 ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకి ఇది శుభవార్త. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్ కి PE, TO, APE ఉద్యోగ అవకాశాలు అనేవి ECIL నుంచి ఒక చక్కని అవకాశం. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాలకు సరిగ్గా సరిపోయే అభ్యర్థులు ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 కి హాజరు కండి.

ఆగష్టు 2023 యొక్క ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ తేదీల జాబితా_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

ECIL రిక్రూట్‌మెంట్ 2023

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 163 ఖాళీల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ECIL రిక్రూట్‌మెంట్ 2023 కోసం అవసరమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు 01 మరియు 04 సెప్టెంబర్ 2023న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఈ కథనం ద్వారా ECIL రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్ని వివరాలను పొందండి.

ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ 163 పోస్ట్‌ల కోసం డైనమిక్, అనుభవజ్ఞులైన మరియు నిబద్దత కలిగిన సిబ్బందిని కోరుకుంటోంది. ECIL తన అధికారిక వెబ్‌సైట్ @ecil.co.inలో ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన తాజా నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించి విద్యా అర్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ మొదలైన వాటితో సహా మొత్తం సంబంధిత సమాచారాన్ని పొందడానికి ఈ కథనాన్ని చూడండి.

ECIL రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం

ECIL రిక్రూట్‌మెంట్ 2023 గురించి సంక్షిప్త సమాచారం క్రింద పట్టిక చేయబడింది. అభ్యర్థులు ఇక్కడ రిక్రూట్‌మెంట్ వివరాల వివరణాత్మక అవలోకనాన్ని పొందవచ్చు.

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 అవలోకనం

రిక్రూట్‌మెంట్ అథారిటీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం ఖాళీలు 163
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం తేదీలు 01 సెప్టెంబర్ నుండి 4 సెప్టెంబర్ 2023 వరకు
ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ద్వారా
అధికారిక వెబ్‌సైట్ https://www.ecil.co.in/
ఇంటర్వ్యూ ప్రదేశం హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కోలకతా, ఢిల్లీ, ముంబై కార్యాలయాలలో

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 ముఖ్యమైన తేదీలు

అన్ని ముఖ్యమైన ఈవెంట్‌ల తేదీలు దిగువ పట్టికలో ఉన్నాయి. అభ్యర్థులు ముఖ్యమైన తేదీలను తప్పక గమనించాలి, తద్వారా వారు మౌఖిక పరీక్ష కి బాగా సన్నద్దమవ్వగలరు.

ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ తేదీలు 01 సెప్టెంబర్ నుండి 4 సెప్టెంబర్ 2023 వరకు

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 నోటిఫికేషన్

ECIL లో ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కోసం ఇంటర్వ్యూ లను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ECIL రిక్రూట్మెంట్ 2023 ని విడుదల చేసింది. అభ్యర్ధులు https://www.ecil.co.in/ కి వెళ్ళి నోటిఫికేషన్ ను తనిఖీ చేయవచ్చు, అభ్యర్ధుల సౌకర్యార్ధం నోటిఫికేషన్ pdf ను ఇక్కడ అందిస్తున్నాము. నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తేదీ, ప్రదేశం వంటివి పరిశీలించుకోవచ్చు.

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 నోటిఫికేషన్ PDF 

ECIL అర్హత ప్రమాణాలు 2023

ECIL రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హతలు కలిగిఉండాలి మరియు వయోపరిమితిలోపు ఉండాలి. విద్యార్హత మరియు వయోపరిమితిపై దృష్టి సారిస్తూ వివరణాత్మక ECIL అర్హత ప్రమాణాలు 2023 క్రింద ఇవ్వబడ్డాయి.

అర్హతలు
ECIL రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఫస్ట్-క్లాస్ BE/B.Tech/డిప్లొమాతో పాటు పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.

ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 2023 ఇంటర్వ్యూ ప్రదేశం

ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 2023 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం అభ్యర్ధులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రదేశానికి వాళ్ళు చెప్పిన సమయం ఉదయం 9 గంటలు దీని కంటే కనీసం ఒక గంట ముందుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి చేరుకోవాలి. ఇది మీ మనసు మరియు మిమ్మల్ని ఆ కొత్త ప్రదేశానికి అలవాటు పడేలా చేస్తుంది. ఇంటర్వ్యూ జరిగే చోటు ఈ దిగువన తెలియజేస్తున్నాము.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం  Interview held at 
CLDC, నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఎలక్ట్రానిక్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL పోస్ట్, Hyd-62
CLDC, Nalanda Complex, TIFR Road, Electronics
Corporation of India Limited, ECIL Post, Hyd-62
ECIL, # 47-09-28, ముకుంద్ సువాస అపార్ట్‌మెంట్స్, 3వ లేన్, ద్వారకా నగర్, విశాఖపట్నం-530016 ECIL, # 47-09-28, Mukund Suvasa Apartments,3rd Lane, Dwaraka Nagar, Visakhapatnam-530016

 

ECIL వాకిన్ ఇంటర్వ్యూ 2023 ఎంపిక విధానం

రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అభ్యర్ధుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, ఇది పూర్తయిన తర్వాతే అభ్యర్థులను ఇంటర్వ్యూ కి అనుమతిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా మూల్యాంకనం చేస్తారు మరియు ఈ క్రింది ప్రమాణాల ప్రకారం తుది సిఫార్సులు విడుదలచేస్తారు.

వెయిటేజ్  మార్కులు 
విద్యార్హత ఇంజనీరింగ్‌లో మొత్తంలో 20% శాతం
అనుభవం 30 (సంవత్సరానికి 10 మార్కులు చొప్పున గరిష్టం గా 30 మార్కులు)
ఇంటర్వ్యూ 50 మార్కులు

ECIL ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 2023 జీతం

పోస్ట్  నెలవారీ జీతం
ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 వ సంవత్సరం 40,000

2 వ సంవత్సరం 45,000

3 వ సంవత్సరం 50,000

4 వ సంవత్సరం 55,000

టెక్నికల్ ఆఫీసర్ మొదటి సంవత్సరం 25,000

2 వ సంవత్సరం 28,000

3 వ మరియు 4 వ సంవత్సరం 31,000

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 వ సంవత్సరం 24,500

2 వ సంవత్సరం 26,950

3 వ మరియు 4 వ సంవత్సరం 30,000

ECIL ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్టు అసిస్టెంట్, వయో పరిమితి

ECIL నోటిఫికేషన్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి పోస్ట్-వారీ వయో పరిమితి క్రింది పట్టికలో ఇవ్వబడింది:

ECIL రిక్రూట్మెంట్ 2023 వయోపరిమితి

పోస్టు పేరు వయో పరిమితి
ప్రాజెక్ట్ ఇంజనీర్ 33 సంవత్సరాలు
టెక్నికల్ ఆఫీసర్ 30 సంవత్సరాలు
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 25 సంవత్సరాలు

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ECIL ప్రాజెక్టు ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్, కోసం ఇంటర్వ్యూలు ఎక్కడ జరుగుతాయి