Telugu govt jobs   »   Daily GK Quiz 2021 | 05...

Daily GK Quiz 2021 | 05 May 2021 Current Affairs Quiz

Daily GK Quiz 2021 | 05 May 2021 Current Affairs Quiz_2.1

పోటీ పరీక్షల విషయంలో జనరల్ నాలెడ్జ్ విభాగంలో సమకాలీన అంశాలు(కరెంట్ అఫైర్స్) చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలలో జరిగే గ్రూప్-1, 2 , 3 మరియు 4 అలాగే SI మరియు కానిస్టేబుల్ పరీక్షలతో పాటు SSC మరియు బ్యాంకింగ్ తో పాటు UPSC పరీక్షలలో కూడా ఈ అంశం చాల కీలకంగా మారింది . ఒక అభ్యర్ధి యొక్క ఎంపికను నిర్ణయించడంలో కరెంట్ అఫైర్స్ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి రోజు అందించే రోజు వారి కరెంట్ అఫైర్స్ మీద మరింత పట్టు సాధిస్తారు అనే ఉద్దేశ్యంతో ఈ రోజు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కు అనుగుణంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మీకు అందించడం జరుగుతోంది. వీటిని చదివి, చేయడం ద్వారా మీ జ్ఞాపక శక్తి స్థాయిని ఎప్పటికప్పుడు మెరుగుపరచు కోవచ్చు.

Q1.  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఎవరు?

(a) జగ్దీప్ ధంఖర్

(b) ఆనంది బెన్ పటేల్

(c) బిస్వభూషణ్ హరిచందన్

(d) లాల్జీ టాండన్

Q2. 2022 వార్షిక సంవత్సరానికి గాను గోల్డ్మన్ సాచ్స్ సంస్థ భారత GDP వృద్ది అంచనాలను ఎంతకు తగ్గించి వేసింది?

(a) 10.7%

(b) 11.1%

(c) 12.4%

(d) 11. 5%

Q3. ఇటివల వనాడియం లోహాన్ని ఏ ప్రాంతంలో కనుగొన్నారు?

(a) సిక్కిం

(b) అరుణాచల్ ప్రదేశ్

(c) మేఘాలయ

(d) ఆంధ్రప్రదేశ్

Q4. మార్క్ సెల్బి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?

(a) లాన్ టెన్నిస్

(b) బాడ్మింటన్

(c) వాలి బాల్

(d) స్నూకర్స్

Q5. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ఏ రోజున జరుగుపుకుంటారు?

(a) ఏప్రిల్ 30

(b) మే 3

(c) మే 1

(d) మే 5

Q6. 2021 UNESCO వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్(ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతి) విజేత ఎవరు?

(a) గౌరీ లంకేష్

(b) గుల్మేరి ఇమిన్

(c) మరియా రెస్సా

(d) నద సబౌరి

Q7. “CO-JEET  ” ఆపరేషన్ ను ఎవరు ప్రారంభించారు? 

(a) CRPF

(b) CISF

(c) భారత సాయుధ దళాలు

(d) పైవన్నీ

Q8. అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం(world mild wife day) ఏరోజున జరుపుకుంటారు? 

(a) ఏప్రిల్ 30

(b) మే 3

(c)మే 2

(d) మే 5

Q9. ఏ దేశ ఆటగాడి పై అవినీతి నిరోధక నియమావళి ఉల్లంఘన కారణంగా 6 సంవత్సరాలు ICC నిషేధం విధించినది? 

(a) ఇండియా

(b) ఇంగ్లాండ్

(c) వెస్ట్ ఇండీస్

(d) శ్రీలంక

Q10. COVID కారణంగా మరణించిన జగన్మోహన్ ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసారు?

(a) మధ్య ప్రదేశ్

(b) గుజరాత్

(c) కేరళ

(d) జమ్మూ కాశ్మీర్

Answers:

Q1. Ans(a)

sol. మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి విజయం సాధించారు. తృణమూల్ 292 సీట్లలో 213 గెలుచుకోగా, దాని బలమైన ప్రత్యర్థి బిజెపి 77 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్.

Q2. Ans(b)

sol. వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్, గోల్డ్ మన్ సాచ్స్ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని  తగ్గించడానికి రాష్ట్రాలు లాక్ డౌన్ ల తీవ్రతను పెంచడం వల్ల భారత జిడిపి వృద్ధి రేటు అంచనాను ఆర్థిక సంవత్సరం FY22 (ఏప్రిల్ 01, 2021, మార్చి 31, 2022) లో 11.1 శాతానికి తగ్గించింది. గోల్డ్ మన్ సాచ్స్ కూడా 2021 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను మునుపటి అంచనా 10.5 శాతం నుండి 9.7 శాతానికి సవరించింది.

Q3. Ans(b)

sol. జనవరి 2021 లో, అరుణాచల్ ప్రదేశ్‌లో వనాడియం కనుగొనబడింది. భారతదేశంలో వనాడియం యొక్క మొదటి ఆవిష్కరణ ఇది. ప్రపంచ వనాడియం ఉత్పత్తిలో భారతదేశం 4% వినియోగిస్తుంది. భారత సైన్యం ఇటీవల సిక్కింలో మొట్టమొదటి గ్రీన్ సోలార్ శక్తి ఉత్పత్తి  ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్ వనాడియం ఆధారిత బ్యాటరీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.

Q4. Ans(d)

sol. స్నూకర్ లో ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఆటగాడు మార్క్ సెల్బీ నాలుగోసారి ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ గా అవతరించాడు. దీనికి ముందు సెల్బీ 2014, 2016, 2017 మరియు 2021 సంవత్సరాల్లో ఛాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకున్నాడు.

Q5. Ans(d)

sol. ప్రతి సంవత్సరం, ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని మే 5న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజును నిర్వహిస్తుంది. 2021 యొక్క నేపధ్యం : ‘సెకండ్స్ సేవ్ లైవ్స్: క్లీన్ యువర్ హ్యాండ్స్’.

Q6. Ans(c)

sol. మరియా రెస్సా 2021 యునెస్కో / గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్  గ్రహీతగా ఎంపికైంది. యునెస్కో ప్రకారం,  “పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి లేదా ప్రోత్సహించడానికి విశేష కృషిని గుర్తింపుగా” $25,000 బహుమతి అందజేస్తారు. ఈ బహుమతికి కొలంబియన్ జర్నలిస్ట్ గిల్లెర్మో కానో ఇసాజా పేరు పెట్టారు.

Q7. Ans(c)

sol. భారతదేశంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ఆక్సిజన్ సరఫరా గొలుసులు వంటి COVID-19 ను తరిమికొట్టే ప్రయత్నాలకు సాయుధ దళాలు “CO-JEET” ఆపరేషన్ ప్రారంభించాయి. వీటితో పాటు, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి  కూడా చర్యలు తీసుకుంటుంది.

Q8. Ans(d)

sol.

  • 1992 నుండి ప్రతి సంవత్సరం మే 5అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మంత్రసానుల పనిని గుర్తించి, తల్లులకు మరియు వారి నవజాత శిశువులకు వారు అందించే అవసరమైన సంరక్షణ కోసం మంత్రసానిల స్థితిగతులపై అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు.
  • 2021 అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం యొక్క నేపధ్యం : “ఫాలో ది డేటా : ఇన్వెస్ట్ ఇన్ మిడ్ వైవ్స్.”

Q9. Ans(d)

sol. ఐసిసి అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు, ఐసిసి అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దోషిగా తేల్చిన తరువాత శ్రీలంక మాజీ ఆటగాడు మరియు కోచ్ నువాన్ జోయిసాను అన్ని క్రికెట్ ఫార్మట్ల  నుండి ఆరు సంవత్సరాల పాటు నిషేధించారు.

  • ఐసిసి చైర్మన్: గ్రెగ్ బార్క్లే.
  • ఐసిసి సిఇఒ: మను సాహ్నీ.
  • ఐసిసి ప్రధాన కార్యాలయం: దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

Q10. Ans(d)

sol. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా కన్నుమూశారు. జగ్మోహన్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా రెండు సార్లు, ఒకసారి 1984 నుండి 1989 వరకు, ఆ పై జనవరి 1990 నుండి మే 1990 వరకు పనిచేశారు. ఢిల్లీ, గోవా మరియు డామన్ & డియు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

 

Sharing is caring!