Telugu govt jobs   »   Current Affairs   »   Celebrating Excellence: 27 YSR Awards Presented...

Celebrating Excellence: 27 YSR Awards Presented to Prominent Personalities | శ్రేష్టతకు గుర్తింపు: ప్రముఖులకు 27 వైఎస్సార్ అవార్డులు ప్రదానం

Celebrating Excellence: 27 YSR Awards Presented to Prominent Personalities | శ్రేష్టతకు గుర్తింపు: ప్రముఖులకు 27 వైఎస్సార్ అవార్డులు ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను YSR జీవితకాల సాఫల్య మరియు సాఫల్య పురస్కారాల గ్రహీతలను మూడవ సంవత్సరం కూడా ప్రకటించింది. GDV కృష్ణ మోహన్ రెండు విభాగాలలో కలిపి మొత్తం 27 మంది పేర్లను ప్రకటించారు. స్క్రీనింగ్ కమిటీ 23 మంది జీవితకాల సాఫల్య పురస్కారాలు మరియు 4 ని అచీవ్‌మెంట్ అవార్డులుకు ఎంపిక చేసింది. కృష్ణమోహన్‌ మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రముఖులకు 23 మందికి YSR లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, నాలుగు YSR అచీవ్‌మెంట్‌ అవార్డులు అందజేయాలన్న కమిటీ సిఫారసులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు అని ప్రకటించారు.

ఈ అవార్డులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను వారు చేసిన సామాజిక  బాధ్యత ను గుర్తిస్తుంది. అవార్డు పొందిన వారికి బహుమానం కూడా అందిస్తారు. డా. YSR లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, డా. YSR కాంస్య బొమ్మ, స్మారక చిహ్నం, ప్రశంసా పత్రం అందిస్తారు. డా. YSR అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రతిమ, ప్రశంసా పత్రం అందజేస్తారు.

అవార్డు పొందిన అభ్యర్ధులు 

వ్యవసాయం:

  1. పాంగి వినీత (సాఫల్య పురస్కారం)
  2. వైవీ మల్లా రెడ్డి (అనంతపురం జిల్లా)

 

కళలు మరియు సంస్కృతి:

  1.  యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు (శ్రీకాకుళం జిల్లా)
  2. తలిశెట్టి మోహన్, కలంకరి (తిరుపతి జిల్లా)
  3. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ (బాపట్ల జిల్లా)
  4. కోన సన్యాసి, తప్పెటగుళ్లు (శ్రీకాకుళం జిల్లా)
  5. ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (కాకినాడ)
  6. ఎస్వీ రామారావు, పెయింటింగ్ (కృష్ణా జిల్లా)
  7. రావు బాల సరస్వతి, నేపథ్య గాయని (నెల్లూరు జిల్లా)
  8. తల్లావజ్జుల శివాజీ, పాత్రికేయుడు మరియు రచయిత (ప్రకాశం జిల్లా)
  9. చింగిచెర్ల కృష్ణా రెడ్డి, జానపద కళలు (అనంతపురం జిల్లా)
  10. కాళీ సాహెబీ మహబూబ్ మరియు షేక్ మహబూబ్ సుబానీ, నాదస్వరం (ప్రకాశం)
    జిల్లా)

Telangana State Weekly CA October 2023 2nd week

తెలుగు భాష మరియు సాహిత్యం:

  1. ప్రొఫెసర్ బేతత్వోలు రామబ్రహ్మం (పశ్చిమగోదావరి జిల్లా)
  2. ఖదీర్ బాబు (నెల్లూరు జిల్లా) అచీవ్ మెంట్ అవార్డు
  3. మహోజబీన్ (నెల్లూరు జిల్లా) అచీవ్‌మెంట్ అవార్డు
  4. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు (చిత్తూరు జిల్లా)
  5. అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం జిల్లా)

క్రీడలు:

  1.  పుల్లెల గోపీచంద్ (గుంటూరు జిల్లా)
  2. కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం జిల్లా)

వైద్య మరియు ఆరోగ్యం:

  1. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సైకియాట్రిస్ట్ (ఎన్టీఆర్ జిల్లా)
  2. EC వినయ్ కుమార్ రెడ్డి, ENT స్పెషలిస్ట్, (YSR జిల్లా)

మీడియా:

  1.  గోవిందరాజు చక్రధర్ (కృష్ణా జిల్లా)
  2. HRK (కర్నూలు జిల్లా)

AP State Weekly CA October 2023 1 and 2 Week PDF

సామాజిక సేవ:

  1. బెజవాడ విల్సన్ (ఎన్టీఆర్ జిల్లా)
  2. శ్యామ్ మోహన్ (అంబేద్కర్ కోన సీమ జిల్లా) అచీవ్‌మెంట్ అవార్డు
  3. నిర్మల్ హృదయ్ భవన్ (ఎన్టీఆర్ జిల్లా)
  4. జి. సమరం (ఎన్టీఆర్ జిల్లా)

Kautilya Current Affairs Special Live Batch by Ramesh Sir | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!