Telugu govt jobs   »   Daily Quizzes   »   AP State GK MCQs Questions and...

AP State GK MCQs Questions and Answers in Telugu , 1st August 2023 For APPSC GROUP-2 & Sachivalayam

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రపదేశ్లోని కొత్త జిల్లాలలో క్రింది వాటిలో ఏది లేదు?

  1. అల్లూరి సీతారామరాజు జిల్లా 
  2. ఎన్టీఆర్ జిల్లా 
  3. పల్నాడు 
  4. పాలకొల్లు

Q2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో “ఆరోగ్య శ్రీ “పధకం ప్రారంభించబడినది?

  1. 2007 
  2. 2017 
  3. 2014
  4. 2019

Q3. 2021-22 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత(కోట్లలో)?

  1. 2,40,564.29
  2. 2,29,779.27
  3. 2,25,244.30
  4. 2,24,789.18

Q4. దక్షిణ భారత ప్రజల సంఘాన్ని ఎవరు స్థాపించారు ?

  1. వెంకటపతిరాజు
  2. కాశీనాథుని నాగేశ్వరరావు
  3. పిట్టి త్యాగరాయచెట్టి
  4. న్యాపతి సుబ్బారావు

Q5. శ్రీబాగ్‌ ఒప్పందం ఎక్కడ జరిగింది ?

  1. మద్రాస్
  2. గుంటూరు
  3. విజయవాడ
  4. కడప

Q6. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడ ప్రారంబించారు?

  1. మద్రాస్
  2. గుంటూరు
  3. విజయవాడ
  4. నెల్లూరు

Q7. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన దేనిని సరిహద్దుగా కలిగి ఉంది?

  1. బంగాళాఖాతం
  2. తమిళనాడు
  3. ఒడిస్సా , చత్తీస్ గఢ్ , తెలంగాణా
  4. కర్ణాటక

Q8. ఈ క్రింది వాటిలో మద్రాసు రాష్ట్రము నుండి వేరుపడిన రాష్ట్రము ఏది?

  1. కర్ణాటక
  2. మధ్యప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. పైవేవి కాదు

Q9. రాష్ట్రాల పునర్విభజన చట్టం ను అనుసరించి హైదరాబాద్ రాజ్యంలోని కన్నడ భాషియ జిల్లాలు ఏ రాష్ట్రంలో కలిశాయి?

  1. మధ్యప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక 
  4. పైవేవి కాదు

Q10. ఆంధ్ర ప్రాంతానికి గల ఇతర పేర్లను కనుగొనండి?

  1. ఆంధ్ర దేశం
  2. త్రిలింగ దేశం 
  3. ఆంధ్రావని
  4. ఆంధ్ర విషయ 
  1. 1, 2 మాత్రమే
  2. 3,4 మాత్రమే
  3. 1,2 మరియు 3
  4. 1,2,3 మరియు 4

Solutions:

S1. Ans(d)

Sol. పాలకొల్లు తప్ప మిగిలినవన్నీ కొత్తగా ఏర్పడనున్న జిల్లాలు. మొత్తం 13 కొత్త జిల్లాలు ఏర్పదనున్నాయి. వీటితో జిల్లాల సంఖ్య 26 కు చేరనున్నది. 

S2. Ans(a) 

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 వ సంవత్సరంలో ఆరోగ్య శ్రీ పధకం ప్రారంభించబడింది.

S3. Ans(b) 

Sol. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2,29,779.27 కోట్ల అంచనాతో 2021 మే 20న అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది బడ్జెట్ రూ. 2,24,789.18 కోట్లు కంటే ఈ బడ్జెట్ 2.2% పెరుగుదల ఉంది.

S4.ANS (c) 

Sol. 1916 నవంబరులో దక్షిణ భారత ప్రజల సంఘాన్ని (south india poeples association- SIPA)  పిట్టి త్యాగరాయచెట్టి స్థాపించారు.

S5. Ans(a)

Sol. 1937, నవంబరు 16న సర్కారు, రాయలసీమ నాయకులు మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం శ్రీబాగ్‌లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.విశ్వవిద్యాలయం, నీటిపారుదల, శాసనసభలో స్టానాలు లాంటి విషయాలపై అంగీకారానికి వచ్చారు.

S6.Ans(a)

 Sol.  1952, అక్టోబరు 19న మద్రాస్‌లోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి 1952,డిసెంబరు 15 అర్దరాత్రి స్వర్గస్తులయ్యారు (ఈ నిరాహార దీక్ష 58 రోజులపాటు కొనసాగింది).

S7.Ans(b)

Sol. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున- బంగాళాఖాతం , పడమరన-కర్ణాటాక రాష్ట్రం, ఉత్తరాన- ఒడిస్సా , చత్తీస్ గఢ్ , తెలంగాణా రాష్ట్రాలు, దక్షిణాన- తమిళనాడు సరిహద్దులుగా కలిగి ఉంది.

S8.Ans.(d)

Sol. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ను అనుసరించి హైదరాబాద్ రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకు, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకాకు పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. అలా 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని, మద్రాసు నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా తొలి బాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. 

S9.ANS.(C)

Sol. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ను అనుసరించి హైదరాబాద్ రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకు, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకాకు పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. అలా 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని, మద్రాసు నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా తొలి బాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. 

S10.ANS.(D)

Sol. ఆంధ్ర అనే శబ్దం మొదటగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఇందులో శునశ్శేపుని వృత్తాంతంలో దక్షిణాపథంలో “ఆంధ్ర “ జాతి ప్రజలు ఉంటారని చెప్పబడింది. ఆంధ్రప్రాంతాన్ని ఆంధ్ర దేశమని, త్రిలింగ దేశమని, ఆంధ్రావని, ఆంధ్రవిషయ అని వివిధ పేర్లతో సంబోదించే వారు. బౌద్ద సాహిత్యంలో “అందరట్టగా” ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website