Telugu govt jobs   »   Current Affairs   »   AP Stands Second In Creation Of...

AP Stands Second In Creation Of Digital Health Accounts | డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

AP Stands Second In Creation Of Digital Health Accounts | డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది

ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. గ్రామాల నుండి రాష్ట్రం వరకు అన్ని స్థాయిలలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ప్రజలకు డిజిటల్ వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ABHA)ల సృష్టిలోనూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు.

దీంతో డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ABHA రిజిస్ట్రేషన్లు చేశారు. రాష్ట్రాలవారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. 4,10,49,333 ఖాతాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. దక్షిణాదికి చెందిన మరే రాష్ట్రం టాప్-5లో లేదు. కర్ణాటక 2.35 కోట్ల ఖాతాలతో 8వ స్థానంలో, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

ఈ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో 4.10 కోట్ల ఖాతాలు నమోదై డిజిటల్ హెల్త్ ఖాతాల సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ABHA ప్రతి పౌరుడికి 14-అంకెల డిజిటల్ హెల్త్ IDని అందిస్తుంది, ఇది వారి పూర్తి ఆరోగ్య చరిత్రను కలిగి ఉంటుంది, క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది మరియు ఒకే క్లిక్‌తో దేశంలో ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు.

ABDM అమలులో ఏపీ మొదటినుంచి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో 4.81 కోట్ల మందికి ABHAలు రిజిస్టర్ చేయడం లక్ష్యం కాగా, ఇప్పటికి 85% మందికి రిజిస్టేషన్ పూర్తి చేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను అమలు చేయడంలో రాష్ట్రం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది, మొత్తం జనాభాలో ABHA రిజిస్టర్ కవరేజ్ పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలుస్తోంది. రాష్ట్రంలోని 14,368 ఆసుపత్రులు, 20,467 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ABDMలో రిజిస్టర్ అయ్యారు. PHC నుంచి బోధనాస్పత్రి వరకు అన్ని స్థాయిల్లో e-HIR విధానాన్ని ప్రశేపెట్టి ప్రజలకు డిజిటల్ వైద్య సేవలను వైద్య శాఖ అందిస్తోంది.

ABHA ద్వారా, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్య రికార్డులు ఆన్‌లైన్‌లో సురక్షితంగా నిల్వ చేయబడతాయి మరియు 100% పౌరులను నమోదు చేయాలనే లక్ష్యాన్ని శ్రద్ధగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా e-HIR విధానాన్ని అమలు చేస్తోంది, పాలసీని విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

డిజిటల్ హెల్త్ సర్వీసెస్‌లో అగ్రగామిగా, ఆంధ్రప్రదేశ్ విధానాలు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాయి, మహారాష్ట్ర మరియు తమిళనాడు అధికారులు వారి విజయవంతమైన అభ్యాసాల నుండి నేర్చుకుంటారు. మొత్తంమీద, ఈ ప్రయత్నాలు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు సామర్థ్యాన్ని మారుస్తున్నాయి, ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక ఉదాహరణ.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

డిజిటల్ ఆరోగ్యం యొక్క అంశాలు ఏమిటి?

డిజిటల్ ఆరోగ్యం యొక్క అంశాలు మొబైల్ హెల్త్ (mHealth) యాప్‌లు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్‌లు (EHRలు), ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్‌లు (EMRలు), ధరించగలిగే పరికరాలు, టెలిహెల్త్ మరియు టెలిమెడిసిన్, అలాగే వ్యక్తిగతీకరించిన ఔషధాలను కలిగి ఉంటాయి.