Telugu govt jobs   »   Current Affairs   »   Ap Food Processing Society has signed...

Ap Food Processing Society has signed MoUs for the Growth of farmers | రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

Ap Food Processing Society has signed MoUs for the Growth of farmers | రైతుల అభివృద్ధి కోసం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ MoUలు కుదుర్చుకుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి రైతులకు లబ్ధి చేకూరచేలా మరియు వారి ఆదాయాన్ని పెంచి వారి అభివృద్ధి కోసం వివిధ సంస్థలతో మౌలిక అవగాహన ఒప్పందాలుMoU చేసుకుంది. ఈ ఒప్పందం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB), రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL) మరియు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిధ్యాలయం తో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ CEO శ్రీధర్ రెడ్డి గాఋ ఒప్పంద పాత్రల మీద సంతకాలు చేసి మార్చుకున్నారు.

 APGB తో అవగాహన ఒప్పందం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో రైతులు పండించిన టమాటా ఉల్లి పంటలకు గిట్టుబాటు కల్పించడానికి ప్రత్యేకంగా 5000 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ లను ఏర్పాటు చేసేందుకు APGB తో ఏ.పి ఫుడ్ ప్రొసెసింగ్ సంస్థ  అవగాహ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యూనిట్ లు ఏర్పాటుకోశం 10 లక్షలు APGB గ్రామీణ యువతకి ఆర్ధిక చేయుట అందించనుంది. యూనిట్ మొత్తం లో 35% సబ్సిడీ అందించగా 9% వడ్డీ తో ఋణం అందిస్తారు. వడ్డీ లో మరో 3% అగ్రి ఇన్ఫ్రా కింద రాయితీ లభిస్తుంది. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ లు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు లో కుర్నూల్ లో విజయవంతం అయ్యింది.

రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL)

రాయలసీమ లో ఏర్పాటు అవ్వనున్న యూనిట్ ల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL) తో MOU చేసుకుంది. తద్వారా 2000 యూనిట్ ల వరకూ సహకారం అందించనుంది.

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిధ్యాలయం

రాష్ట్రం లోని ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (GI టాగ్) తీసుకుని వచ్చేందుకు న్యాయ సలహాల కోసం అవసరమైన సహకారం అంది పుచ్చుకోవడానికి దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విధ్యాలయం తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రం లో ఉన్న వివిధ ప్రాంతాలలోని 32కి పైగా ఆహార ఉత్పత్తులకు GI టాగ్ ను తీసుకుని వచ్చేందుకు ఏ. పి ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి కి విశ్వ విధ్యాలయం అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తుంది.

AP State Monthly Current Affairs – August 2023

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests | Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటి ఏ సంస్థలతో MOU కుదుర్చుకుంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సంస్థ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB), రహేజా సోలార్ ఫుడ్ ప్రొసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (RSFPL)& దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిధ్యాలయంతో MOU చేసుకుంది