Telugu govt jobs   »   Current Affairs   »   జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్...

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది

దేశంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రశంసించారు. ఈ విద్యా విధానం అమలులో తొలి దశ నుంచి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలకు ఆయన అభినందనలు తెలిపారు. జగదీష్ కుమార్ రాష్ట్ర  పటిష్టమైన ఉన్నత విద్యా రంగాన్ని గుర్తించి, దాని బలాన్ని నొక్కి చెప్పారు. JNTU (K)లో 2 రోజులపాటు జరిగే ఉన్నత విద్య ప్రణాళిక 5వ సమావేశం జూలై 1 న జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రారంభమైంది. దీనికి హాజరైన జగదీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. జాతీయ విద్యా విధానం 2030 నాటికి భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుందని, దాని అమలులో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు మరియు పాఠశాలలు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా 600 యూనివర్సిటీల్లో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని జగదీష్ కుమార్ ప్రకటించారు. విభిన్న పరిశోధన కార్యక్రమాల కోసం వచ్చే ఐదేళ్లలో 50,000 కోట్లు వినియోగించేందుకు యూజీసీ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందని జగదీష్ కుమార్ చెప్పారు. ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు యువతకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడంపై ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రతిపాదించిన బిల్లు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదనంగా, ఈ- వర్సిటీలలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన రాష్ట్రం ఏది?

2021లో NEP 2022 అమలుకు సంబంధించిన ఆర్డర్‌ను జారీ చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. తర్వాత 26 ఆగస్టు 2021న మధ్యప్రదేశ్ కూడా కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.