Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh Government Increases Age Limit...

Andhra Pradesh Government Increases Age Limit for Certain Job Positions | నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

Andhra Pradesh Government Increases Age Limit for Certain Job Positions | నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకోసం చేసే నియామక ప్రక్రియలో వయోపరిమితి పెంచి మరింత మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా  వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం చేపట్టే కొన్ని ఉద్యోగ స్థానాలకు వయోపరిమితిని పెంపు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్-యూనిఫాం పోస్టుల వయోపరిమితిని ఇప్పటివరకు ఉన్న 34 నుండి 42 సంవత్సరాలకు పెంచారు. ఈ 8 సంవత్సరాలు వయస్సు సడలింపుతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియాలకు అర్హులు అవుతారు. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని రెండేళ్లు పెంచారు. ఈ వయోపరిమితి పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో విడుదల కానున్న గ్రూపు-1, గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి లో కూడా ఈ సడలింపుతో నోటిఫికేషన్ విడుదలవుతాయి అని భావిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న సందర్భంలో వయోపరిమితి పెంచింది అని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగానికి గరిష్ట వయసు దాటిపోయిన నిరుద్యోగులకు నష్టం వాటిల్లకుండా ఈ వయోపరిమితిని పెంపు జీవో ఉపశమనం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు వివిధ బోర్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితిని పెంచింది.

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!