Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్...

Andhra Pradesh Government has approved two new Leather Parks | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

Andhra Pradesh Government has approved two new Leather Parks | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త లెదర్ పార్క్ లను ఆమోదించింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో కొత్తగా రెండు లెదర్ పార్కులను ఏర్పాటు చేసేందుకు LIDCAP కసరత్తు చేస్తోంది. కృష్ణ జిల్లా మరియు ప్రకాశం జిల్లాలలో ఈ లెదర్ పార్కు లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరపునుంచి రూ.12 కోట్లు కూడా మంజూరు అయ్యాయి. ఇప్పటికె కృష్ణ, గుంటూరు, తిరుపతి కర్నూల్, అనంతపురం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఉన్న లెదర్ పార్కులకు ఈ రెండు లెదర్ పార్కు కలిపి మొత్తం 9 లెదర్ పార్కులు  రాష్ట్రంలో పనిచేయనున్నాయి. లెదర్ పార్కులను అభివృద్ది చేయడమే కాకుండా తగిన శిక్షణ కోసం శిక్షణా కేంద్రాలు కూడా ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా లోని యడవల్లి గ్రామం, కృష్ణ జిల్లా లోని జి. కోడూరు గ్రామాలలో ఈ లెదర్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ లెదర్ పార్కులలో చర్మకార ఉత్పత్తులు తయారీ శిక్షణ ఇవ్వడంతో పాటు ముడిసరుకు కూడా సమకూర్చనున్నారు తద్వారా ప్రాంతీయ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

LIDCAP గురించి 

లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ A.P.Ltd (LIDCAP) 1973 అక్టోబర్ 4న ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రూ.1.00 కోట్ల షేర్ క్యాపిటల్ తో స్థాపించబడింది. కంపెనీ కి రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి అవి:

  • ఆంధ్రప్రదేశ్‌లో లెదర్ పరిశ్రమను ప్రోత్సహించడానికి.
  • రాష్ట్రంలోని తోలు కళాకారుల అభ్యున్నతి సాధించడానికి.
Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

EMRS Hostel Warden Administrative Aptitude & POCSO Act Material eBook for EMRS Hostel Warden Exams By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!