Andhra University Backlog Posts Recruitment 2021
ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి SC/ST బ్యాక్ లాగ్ పోస్టులకు గాను ప్రకటన వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Typist, Record Assistant, Junior Lab Assistant, Attender, draftsmen వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి విద్యా ప్రమాణాలు, అర్హతలు, వయస్సు, అనుభవం వంటి వివిధ అంశాలకు సంబంధించిన వివరాలు ఈ వ్యాసంలో మీరు పొందగలరు. Andhra University Backlog Post పోస్టులకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Andhra University Backlog Posts Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు
Andhra University Backlog Posts Recruitment: పరిమిత రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో రెగ్యులర్ స్కేల్‌లో SC/ST వ్యక్తుల కోసం కేటాయించిన కింది బ్యాక్ లాగ్ ఖాళీల కొరకు నిర్దేశిత ఫార్మాట్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడతాయి.
క్రమ సంఖ్య | విభాగము | SC ల కొరకు | ST ల కొరకు | విద్యార్హతలు |
1. | TYPIST | 1 | ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరిన్ని వివరాలకై అధికారిక ప్రకాటనని చూడండి | |
2. | Record assistant | 1+ 1(w) | SSC | |
3. | Junior Lab Assistant | 1 (w) | BSc | |
4 | Draughts man | 1(w) | ITI Draughtsman | |
5 | Attender | 1 | 1 | VI th class |
6 | Gardner | 1 | 1 | VI th class |
మరియు మెస్స్ బాయ్, సెక్యురిటి గార్డ్, పంప్ అటెండర్ వంటివి ఉన్నాయి.
- ITI అర్హతతో ప్లంబర్, బోయిలెర్, కార్పెంటర్,ఎలక్టరీషన్ మొదలైన ఖాళీలు కూడా ఉన్నాయి.
- W – మహిళల కోసం ప్రత్యేకం గా కేటాయించబడినది.
Andhra University Backlog Posts Recruitment 2021: ముఖ్యమైన తేదీలు
Andhra University SC/ST బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి ప్రకటనను 31 జూలై 2021 న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 31 జూలై 2021
దరఖాస్తు ఆఖరు: 31 ఆగష్టు 2021
Andhra University Backlog Posts Recruitment 2021: వయో పరిమితి
Andhra University Backlog Posts Recruitment 2021: వయస్సు : దరఖాస్తు దారునికి 1.07.2021 తేదీకి 18 సం” నిండి ఉండాలి మరియు 47 సం” మించకూడదు
అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra University Backlog Posts Recruitment 2021: నియామక విధానం:
Andhra University Backlog Posts Recruitment 2021: SC & ST కేటగిరీలు: వ్రాత పరీక్ష లేనందున అభ్యర్థులు ఉత్తీర్ణులైన అర్హత కలిగిన అకడమిక్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
Andhra University Backlog Posts Recruitment 2021: దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఈ దిగువ తెలిపిన పత్రాల నకల్లు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 31.08.2021లోపు పంపించాలి
1. విభాగానికి సరిపోయే మార్కుల మెమో ,ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిషనల్ సర్టిఫికెట్ నకలు
2. అధికారిక జనన ధృవీకరణ పత్రం
3. SC/ST దరఖాస్తుదారులకు తాజా కుల ధృవీకరణ పత్రం.
4. ప్రతి పోస్ట్‌కు ఫీజు రూ .100/- ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. A.U. సాధారణ రెవెన్యూ ఖాతా, ఖాతా నం. 10428603374, IFSC కోడ్: SBIN0000772, A.U. క్యాంపస్ బ్రాంచ్, SBI.
5. ఎంపికైన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెడికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కోసం అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది
6. దరఖాస్తు నమూనా పత్రం అధికారిక వెబ్సైట్ https://www.andhrauniversity.edu.in/ . నుండి పొందగలరు.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: