Table of Contents
Static GK State Legislature : If you’re a candidate for APPSC, TSPSC, Groups, UPSC, SSC, Railways. and preparing for STATIC GK Subject . We provide Telugu study material in pdf format all aspects of Static GK – State Legislature that can be used in all competitive exams like APPSC, TSPSC, Groups, UPSC, SSC, Railways.
Static GK State Legislature, పాలిటి- రాష్ట్ర శాసన శాఖ pdf : APPSC,TSPSC ,Groups,UPSC,SSC , Railways వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే APPSC, TSPSC ,Groups, UPSC, SSC , Railways వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని Static GK ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది, కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC ,Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Static GK కు సంబంధించిన ప్రతి అంశాలను pdf రూపంలో మేము అందిస్తున్నాము.
Static GK PDF In Telugu ( స్టాటిక్ GK PDF తెలుగులో)
APPSC, TSPSC , Groups,UPSC,SSC , Railways వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
Adda247 Telugu Sure Shot Selection Group
State Legislature (రాష్ట్ర శాసన శాఖ)
- రాష్ట్ర శాసనశాఖ గూర్చి వివరించే నిబంధనలు – 168-212 (6వ భాగం) )
- 168వ నిబంధన ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర శాసనశాఖ ఉంటుంది.
- రాష్ట్ర శాసనశాఖ అనగా విధాన పరిషత్, విధాన సభ మరియు గవర్నర్.
- రాష్ట్ర శాసనశాఖలో మూడవ సభ – గవర్నర్
- రాష్ట్ర శాసనశాఖలో అంతర భాగము – గవర్నర్
- ఎగువ సభ – విధాన పరిషత్
- దిగువ సభ – విధాన సభగా పిలుస్తారు.
- రాజ్యాంగం ప్రకారం శాసనశాఖలో సభ్యత్వం లేకుండా సమావేశాలకు హాజరయ్యే ఏకైక వ్యక్తి – అడ్వకేట్ జనరల్
- అడ్వకేట్ జనరల్ శాసనశాఖలో బిల్లుపై జరిగే ఓటింగ్ లో పాల్గొనకూడదు.
- సభలో జరిగే చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు.
- ఆర్థిక విషయాల్లో విధానసభకు ఎక్కువ అధికారాలు, విధాన పరిషత్ కు తక్కువ అధికారాలు ఉంటాయి.
- విధాన పరిషత్ ను విధాన మండలిగా, విధాన సభను శాసన సభగా పిలుస్తారు.
- ప్రతిపక్ష నాయకులకు రాష్ట్ర కేబినెట్ మంత్రితో సమానమైన హోదా, గౌరవం ఉంటుంది.
- ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందడానికి కనీసం 1/10వ వంతు సభ్యుల మద్దతు ఉండాలి.
- శాసనసభ సమావేశం జరగడానికి కనీసం 1/10వ వంతు సభ్యులు హాజరుకావాలి.
- రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి.
- 2 సమావేశాల మధ్య కాలవ్యవధి – 6 నెలలు ఉండాలి.
- సాధారణంగా రాష్ట్ర శాసనశాఖ సంవత్సరానికి 3 సార్లు సమావేశమవుతుంది.
అవి:
1) బడ్జెట్ సమావేశాలు (Budget Session)
2) వర్షాకాల సమావేశాలు (Monsoon Session)
(3) శీతాకాల సమావేశాలు (Winter Session)
- రాజ్యాంగం ప్రకారం శాసనసభా సమావేశాలకు గరిష్ట సంఖ్య లేదు.
- సంవత్సరానికి ఎన్నిసార్లు అయినా శాసనసభా సమావేశాలు జరగవచ్చును.
- ఎక్కువ రోజులు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
- తక్కువ రోజులు వర్షాకాలం సమావేశాలు జరుగుతాయి.
State Legislative Council (విధాన పరిషత్)
- విధాన పరిషత్ గూర్చి వివరించే నిబంధన – 171
- 169వ నిబంధన ప్రకారం పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్ ను ఏర్పాటు లేదా రద్దు చేస్తుంది.
- రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించి సిపారసు చేసినట్లయితే పార్లమెంట్ సాధారణ మెజార్టీతో
- ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానము అమలులో ఉంది.
- (1) ఉత్తరప్రదేశ్ – 100 (2) మహారాష్ట్ర – 78 (3) బీహార్ – 75 (4) కర్ణాటక – 75 (5) ఆంధ్రప్రదేశ్ – 58 (6) తెలంగాణ – 40
- అతి త్వరలో విధాన పరిషత్ రాజస్థాన్, ఒడిష్సా రాష్ట్రాల్లో ఏర్పాటు అవుతాయి
- AP విధానపరిషత్ తొలిసారిగా ఏర్పడిన సం. 1958.
- AP విధాన పరిషత్ రద్దు అయిన సం.1985
- రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ కనీస సభ్యుల సంఖ్య – 40 మంది
- రాజ్యాంగ ప్రకారం విధాన పరిషత్ గరిష్ఠ సభ్యుల సంఖ్య శాసనసభా సభ్యుల మొత్తంలో 1/3వ వంతుకు మించి వుండకూడదు.
- 171వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6 వ వంతు సభ్యులను విధానపరిషత్ కు నియమిస్తారు.(కలలు, సాహిత్యం , సమాజ సేవ, శాస్త్ర సాంకేతిక మరియు ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
also check: ESIC Telangana Recruitment 2022 apply for 72 posts
(Qualifications) అర్హతలు
- భారతీయ పౌరుడైవుండాలి.
- కనీస వయస్సు 30 సంవత్సరాలు నిండివుండాలి.
- లాభాదాయకమైన పదవి ఉండరాదు.
- ఎస్సీ, ఎస్టీలు 5,000: ఇతరులు 10,000 రూ.లను డిపాజిట్ చేయాలి.
(Election – Tenure) ఎన్నిక విధానము- పదవీ కాలం
- విధాన పరిషత్ ఎన్నికలను నిర్వహించేది – భారత ఎన్నికల సంఘం.
- విధాన పరిషత్ సభ్యులను ఈ క్రింది వారు ఎన్నుకుంటారు. —
- శాసనసభ సభ్యులు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
- స్థానిక సంస్థలు 1/3వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
- ఉపాధ్యాయులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
- పట్టభద్రులు 1/12వ వంతు సభ్యులను ఎన్నుకుంటారు.
- ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. (కళలు, సాహిత్యం , సామాజిక సేవ, శాస్త్రసాంకేతిక మరియు ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
- విధాన పరిషత్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – చైర్మన్.
- విధాన పరిషత్ శాశ్వతమైనది కాదు.
- పార్లమెంట్ సాధారణ మెజార్టీతో విధాన పరిషత్ ను రద్దు చేస్తుంది.
- విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు.
- ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
- కొత్తగా విధానపరిషత్ ఏర్పడినప్పుడు 2 సంవత్సరాలకు లాటరీ పద్ధతి ద్వారా 1/3వ వంతు సభ్యులను నిర్ణయిస్తారు.
- భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సమక్షంలో లాటరీ పద్ధతిని నిర్వహిస్తారు.
- పదవి విరమణ చేసిన వారు తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవవచ్చు
- విధానపరిషత్ సభ్యులు తమ రాజీనామా లేఖను చైర్మన్ కు ఇవ్వాలి.
- ఏ కారణం చేతనైనా సభ్యుని పదవి ఖాళీ అయితే 6 నెలలలోపు భర్తీ చేయాలి.
- విధాన పరిషత్ ఎన్నికలో నైష్పత్రిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది
- విధాన పరిషత్ సభ్యుల యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం చైర్మన్ కు ఉంటుంది.
Download : APPSC Group 4 Official Notification 2021
Chairman చైర్మన్ :
- విధాన పరిషత్ కు అధిపతి – చైర్మన్
- విధాన పరిషత్ చైర్మన్ కు రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ సదా, గౌరవం ఉంటుంది.
- సాధారణంగా చైర్మన్ అధికార పార్టీకి, డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి చెందివుంటారు.
- రాజ్యాంగ ప్రకారం విధానపరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు వర్తించకుండా ఉండటానికి పదవిని చేపట్టిన వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి.
- విధాన పరిషత్ తొలి సమావేశానికి అధ్యక్షత వహించేది ప్రొటెం చైర్మన్ / తాత్కాలిక చైర్మన్.
- ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ తాత్కాలిక చైర్మన్/ ప్రొటెం చైర్మన్ ను నియమిస్తారు.
- ప్రొటెం చైర్మన్ కు 2 అధికారాలు ఉంటాయి. 1. తొలి సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం.2. చైర్మన్ ఎన్నికను నిర్వహించడం.
(Election – Tenure) ఎన్నిక విధానం – పదవీ కాలం
- విధాన పరిషత్ చైర్మన్ ఎన్నికను నిర్వహించేది – ప్రోటెం చైర్మన్
- విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు.
- రాజ్యాంగ ప్రకారం చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు ప్రమాణ స్వీకారం ఉండదు.
- సాంప్రదాయకంగా విధాన పరిషత్ లో గల అధికార పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు గౌరవంగా చైర్మన్, డిప్యూటీచైర్మన్లను పదవి వద్దకు తీసుకువస్తారు.
- చైర్మన్ పదవీ కాలం – 6 సంవత్సరాలు.
- చైర్మన్ తన రాజీనామా లేఖను డిప్యూటీ చైర్మన్ కు ఇవ్వాలి.
- ఏ కారణం చేతనైనా చైర్మన్ పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు భర్తీ చేయాలి.
- చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు డిప్యూటీ చైర్మన్ 6 నెలలకు మించకుండా తాత్కాలిక చైర్మన్ గా విధులను నిర్వహిస్తారు.
- అధికార దుర్వినియోగం అవినీతికి పాల్పడినప్పుడు చైర్మన్ కు వ్యతిరేఖంగా 14 రోజుల ముందస్తు నోటీసుతో అవిశ్వాస తీర్మాణాన్ని విధాన పరిషత్ లో ప్రవేశపెట్టవచ్చును.
- అవిశ్వాస తీర్మాణం పైన ఓటింగ్ జరిగే రోజు నాడు చైర్మన్ అధ్యక్ష స్థానంలో ఉండకూడదు.
- అవిశ్వాస తీర్మాణంపై జరిగే ఓటింగ్ లో చైర్మన్ పాల్గొనవచ్చును
- విధాన పరిషత్ అవిశ్వాస తీర్మాణాన్ని 2/3వ వంతు మెజార్టీతో ఆమోడించినట్లయితే చైర్మన్ పదవి నుండి తొలగించబడతారు.
Also Read : ICAR IARI Recruitment 2021
(Powers and Functions) అధికారాలు – విధులు
- విధాన పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించి ప్రశాంతంగా నిర్వహించాలి.
- విధాన పరిషత్ లో సభ్యులకు సీట్లను కేటాయించడం, గ్రంథాలయ వసతిని కల్పిస్తారు.
- విధాన పరిషత్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తారు.
- విధాన పరిషత్ నియమాలను ఉల్లంఘించిన సభ్యులను సస్పెండ్ చేస్తారు.
- పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల యొక్క సభా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
- ఏ సభ్యుడయినా చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సమావేశానికి హాజరుకానట్లయితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.
- విధాన పరిషత్ లో బిల్లుపై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా, వ్యతిరేంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు చైర్మన్ ఓటింగ్ లో పాల్గొంటారు.
- చైర్మన్ ఓటును నిర్ణయకపు ఓటు అంటారు.
- విధాన పరిషత్ లో జరిగే చర్చలను రికార్డు చేసి భద్రపరుస్తారు.
- విధాన పరిషత్ లో పనిచేసే సిబ్బందిని నియంత్రణ చేస్తారు.
- విధాన పరిషత్ ఆమోదించిన తీర్మానం పైన చైర్మన్ సంతకం చేసి విధాన సభకు పంపుతారు.
- సభ్యులు ప్రవేశపెట్టే బిల్లును సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లుగా నిర్ణయిస్తారు.
- సభ్యులు అడిగే ప్రశ్నలను నక్షత్రపు గుర్తు గల ప్రశ్నలుగా, నక్షత్రపు గుర్తులేని ప్రశ్నలుగా నిర్ణయిస్తారు.
State Legislative Assembly (శాసనసభ/ విధాన సభ)
- రాష్ట్ర శాసనశాఖలో దిగువ సభను విధానసభ/ శాసన సభగా పిలుస్తారు.
- విధానసభ గూర్చి వివరించే నిబంధన – 170.
- విధానసభ కనీస సభ్యుల సంఖ్య – 60
- విధానసభ గరిష్ట సభ్యుల సంఖ్య – 500.
- ప్రస్తుతం దేశంలో అత్యధిక శాసనసభా సభ్యులను కల్గివున్న రాష్ట్రం – ఉత్తరప్రదేశ్ (403)
- దేశంలో అతి తక్కువ శాసనసభా సభ్యులను కల్గివున్న రాష్ట్రం – సిక్కిం (32)
- పార్లమెంట్ చట్టం ప్రకారం తక్కువ జనాభా గల్గిన రాష్ట్రాలకు శాసనసభ కనీస సభ్యుల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.
- 3 రాష్ట్రాలకు కనీస సభ్యుల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది- (1) సిక్కిం – 32 (2) గోవా – 40 (3) మిజోరాం – 40
- పార్లమెంట్ చట్టం ప్రకారం శాసనసభ నియోజక వర్గాల సంఖ్య 2026 వరకు పెరగవు.
- 332 నిబంధన ప్రకారం శాసన సభ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయి.
Also read: SSC CGL 2021 Notification Out
(Qualifications) అర్హతలు
- భారతీయ పౌరుడై వుండాలి.
- కనీస వయస్సు 25 సంవత్సరాలు నిండివుండాలి.
- ఎస్సీ, ఎస్టీలు 5,000, ఇతరులు 10,000 రూ.లను డిపాజిట్ చేయాలి.
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠ వ్యయ పరిపతి 25 లక్షలు
(Election – Tenure) ఎన్నిక విధానం – పదవీ కాలం
- శాసనసభ ఎన్నికలను నిర్వహించేది భారత ఎన్నికల సంఘం.
- శాసన సభా సభ్యులను ఎన్నుకునేది వయోజనులు.
- శాసన సభా ఎన్నికలను ప్రత్యేక్ష, ఎన్నికలు అంటారు.
- పార్టీ ప్రాతిపదిక మీద శాసన సభ ఎన్నికలు జరుగుతాయి.
- ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – ప్రోటెం స్పీకర్ లేదా స్పీకర్.
- తొలి సమావేశానికి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది – ప్రోటెం స్పీకర్.
- ఇతరులు చేత ప్రమాణ స్వీకారం చేయించేది – స్పీకర్.
- శాసనసభా సభ్యుల పదవి కాలం – 5 సంవత్సరాలు
- వాస్తవంగా శాసన సభ విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారు.
- 174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభలో విశ్వాసం కల్గిన ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభను రద్దు చేస్తారు.
- శాసన సభ పూర్తికాలం కొనసాగి రద్దు అయినట్లయితే 6 నెలలలోపు కొత్త శాసనసభను ఏర్పాటు చేయాలి.
Check Now : APPSC Endowments Officer Notification 2021 PDF
Speaker స్పీకర్
- శాసన సభకు అధిపతి (Head of Legislature) – స్పీకర్
- శాసన సభ సంరక్షకుడు – స్పీకర్
- సాధారణంగా స్పీకర్ అధికార పార్టీకి డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష పార్టీకి (Opposition Party) చెందివుంటారు.
- రాజ్యాంగ ప్రకారం శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ గా మరొకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారు.
- పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు వర్తించకుండా ఉండడానికి పదవిని చేపట్టిన వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికై రాజీనామా చేయాలి.
- రాష్ట్ర కేబినెట్ మంత్రి కంటే ఎక్కువ హెూదా గౌరవం స్పీకర్ కు ఉంటుంది.
- శాసన సభ తొలిసమావేశానికి అధ్యక్షత వహించేది
- ప్రోటెం స్పీకర్ – ప్రోటెం స్పీకర్ ను తాత్కాలిక స్పీకర్ గా పిలుస్తారు
- ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ప్రోటెం స్పీకర్ ను నియమిస్తారు.
- ప్రోటెం స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది – గవర్నర్ –
- ప్రోటెం స్పీకర్ కు 2 రకాలైన అధికారాలు ఉంటాయి. అవి: 1. తొలి సమావేశానికి అధ్యక్షత వహించి హాజరైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 2. శాసన సభ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు.
ALSO READ: RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల
Speaker Election – Tenure ( స్పీకర్ ఎన్నిక విధానం – పదవికాలం )
- రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌ను ఎన్నుకునేది శాసనసభా సభ్యులు
- సబా సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
- రాజ్యాంగం ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు ప్రమాణ స్వీకారం ఉండదు.
- సాంప్రదాయంగా శాసనసభలోగల అధికార పక్ష నాయకుడు & ప్రతిపక్ష నాయకుడు గౌరవంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను పదవి వద్దకు తీసుకువస్తారు.
- రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవి కాలం – 5 సంవత్సరాలు
- స్పీకర్ రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కు ఇవ్వాలి.
- ఏ కారణం చేతనైనా స్పీకర్ పదవి ఖాళీ అయితే 6 నెలల లోపు భర్తీ చేయాలి.
- డిప్యూటీ స్పీకర్ తాత్కాలిక స్పీకర్‌గా 6 నెలలకు మించకుండా పనిచేస్తారు.
- స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సమావేశానికి అధ్యక్షత వహించేది ప్యానెల్ స్పీకర్
- ప్యానెల్ స్పీకర్స్ సంఖ్య – 6.
- స్పీకర్ అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్లయితే 14 రోజుల ముందస్తు నోటీతో అవిశ్వాస తీర్మాణాన్ని శాసనసభలో ప్రవేశపెడతారు.
- శాసనసభలో అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరిగే రోజు స్పీకర్ సమావేశానికి అధ్యక్షత వహించకూడదు.
- స్పీకర్ సమావేశానికి హాజరై ఓటింగ్ లో పాల్గొనవచ్చు.
- శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించినట్లయితే స్పీకర్ పదవి నుండి తొలగించబడతారు.
(Powers of Legislature) శాసన శాఖ అధికారాలు
రాష్ట్ర శాసనశాఖ అధికారాలను క్రింది విధంగా పేర్కొనవచ్చును. అవి:
1. శాసన అధికారాలు (Legislative Powers)
- రాష్ట్ర శాసనశాఖ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో గల అంశాల పైన శాసనాలను తయారు చేస్తుంది.
- దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసేది – పార్లమెంట్సా
- సాధారణ బిల్లును మొదటగా విధానపరిషత్ లేదా విధాన సభలో ప్రవేశపెట్టవచ్చును.
- శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లు పైన విధానపరిషత్ 3 నెలల లోపు అభిప్రాయాన్ని తెలపాలి.
- శాసనసభ 2వ సారి అదే బిల్లును ఆమోదించి విధానపరిషతకు పంపినట్లయితే 30 రోజుల లోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
- రాష్ట్రంలో ఉభయసభల మధ్య సాధారణ బిల్లు పైన అభిప్రాయ బేధాలు ఏర్పడినట్లు అయితే ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు.
- ఉభయసభల మధ్య సాధారణ బిల్లు పైన అభిప్రాయ బేధాలు ఏర్పడినట్లయితే శాసన సభ నిర్ణయం అమలులోనికి వస్తుంది
- ఆర్థిక బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతితో మొదటగా శాసనసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి.
- శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లును విధాన పరిషత్ 14 రోజుల లోపు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి.
- ఉభయసభలు బిల్లును ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపడం జరుగుతుంది.
- శాసన సభ పంపిన బిలును గవర్నర్ ఆమోదించవచ్చు లేదా పునపరిశీలనకు పంపవచ్చును.
- రెండవసారి శాసనసభ బిలును ఆమోదించి పంపినట్లయితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి.
- 213 నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభా సమావేశంలో లేనపుడు ముఖ్యమంత్రి నాయకత్వాన గల కెబినేట్ మంత్రుల లిఖిత పూర్వక సిపారసు మేరకు ఆర్డినెన్లను జారీ చేస్తారు.
- ఆర్డినెన్స్ చట్టంగా మారడానికి శాసనసభ సమావేశం అయిన రోజు నుండి 6 వారాలలోపు ఆమోదించాలి.
- శాసనసభ ఆమోదించి పంపిన వివాదాస్పదమైన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపి అధికారం గవర్నర్‌కు ఉంది.
2. కార్యనిర్వాక అధికారాలు (Executive Powers)
- రాష్ట్ర శాసనశాఖలో గల సభ్యులు ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, అవిశ్వాస తీర్మాణం ద్వారా మంత్రి మండలిని నియంత్రణ చేస్తుంది.
- విధాన పరిషత్, విధాన సభ సభ్యులు ప్రజా సమస్యల పట్ల సభలో ప్రశ్నలను అడుగుతారు.
- శాసనసభా సభ్యులు అడిగే నక్షత్రపు గుర్తుగల ప్రశ్నలకు సంబంధిత మంత్రి మౌకిక రూపంలో సమాధానం ఇస్తారు.
- నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు సంబంధిత మంత్రి లిఖిత రూపకంలో సమాధానమును ఇస్తారు.
- ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మాణాన్ని 1/10వ వంతు సభ్యుల మద్దతుతో శాసనసభలో ప్రవేశపెడతారు.
- శాసనసభ సాధారణ మెజార్టీతో అవిశ్వాస తీర్మాణాన్ని ఆమోదించినట్లు అయితే మంత్రిమండలి రద్దు అవుతుంది.
- ఒక అవిశ్వాస తీర్మాణానికి, మరొక అవిశ్వాస తీర్మాణానికి మధ్య కాలవ్యవధి 6 నెలలు ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రణ చేయడానికి విధాన పరిషత్ కంటే విధాన సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి.
also read: తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు
3. ఆర్ధిక అధికారాలు (Financial Powers)
- రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేది గవర్నర్.
- రాష్ట్ర ఆర్థిక మంత్రి గవర్నర్ ముందస్తు అనుమతితో బడ్జెట్ ను మొదటగా శాసనసభలోనే ప్రవేశపెట్టాలి.
- శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ను విధానపరిషత్ 14 రోజుల లోపు ఆమోదించాలి.
- రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే బడ్జెట్ అమలులోనికి వస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన కొత్త పన్నులను వేయడానికి, అమలులోవున్న పన్నులను పెంచడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.
- రాష్ట్ర సంఘటిత నిధి రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వం సంఘటిత నుండి డబ్బులను ఖర్చు పెట్టడానికి శాసనసభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి.
- రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది.
- గవర్నర్ నివేదికను పరిశీలించిన తర్వాత శాసనసభకు పంపుతారు.
- రాష్ట్ర శాససశాఖ వార్షిక నివేదిక పై చర్చిస్తుంది. – రాష్ట్ర బడ్జెట్ గూర్చి వివరించే నిబంధన – 202
4. న్యాయ అధికారాలు (Judicial Powers)
- సుప్రీంకోర్టు, హైకోర్టులు మినహా దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితా పరిధిలో ఉంటాయి.
- దిగువ న్యాయస్థానాల యొక్క అధికారాలను శాసనశాఖ నిర్ణయిస్తుంది.
- న్యాయమూర్తుల జీతభత్యాలు, అధికార విధులను శాసనశాఖ నిర్ణయిస్తుంది.
also read: RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు
5. ఎన్నిక అధికారాలు (Electoral Powers) :
- ఎన్నికైన శాసనసభా సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు.
- శాసనసభా సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ గా మరొకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకుంటారు.
- విధాన పరిషత్ సభ్యులు తమలో ఒకరిని చైర్మన్ గా, మరొకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు.
- రాష్ట్ర శాసనశాఖలో గల సభ్యులు వివిధ రకాలైన శాసనసభా కమిటీల సభ్యులను ఎన్నుకుంటారు.
- ఉదా: ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల సంఘం మొ..
DOWNLOAD: పాలిటి- రాష్ట్ర శాసన శాఖ Pdf
మునుపటి అంశాలు
స్టాటిక్ GK- జాతీయం , అంతర్జాతీయం
స్టాటిక్ GK- భారతదేశ ప్రప్రధములు
********************************************************************
Monthly Current Affairs PDF All months |
APPSC Group 4 Official Notification 2021 |
Folk Dances of Andhra Pradesh |