Table of Contents
List of Andhra Pradesh Governors ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు పూర్తి సమాచారం Pdf: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్ ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
List of Andhra Pradesh Governors ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు
- ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక కాలం పాటు గవర్నర్ గా పనిచేసిన వారు E. S. L. నరసింహన్ – 3495 రోజులు
- అత్యల్ప కాలం పాటు గవర్నర్ గా పనిచేసిన వారు జస్టిస్ B.J. దివాన్ -78 రోజులు
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రధాన కార్యాలయం – రాజ్ భవన్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా గవర్నర్లుగా పనిచేసినది – సరాదా ముఖర్జీ, కుముద్ బెన్ జోషి
- ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ – చందూలాల్ మాదవ్ త్రివేది (సీఎం త్రివేది)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ – సీఎం త్రివేది
S.No | Name | Period |
---|---|---|
1 | చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది | 1953-1957 |
2 | భీమ్ సేన్ సచార్ | 1957-1962 |
3 | సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్ | 1962-1964 |
4 | పట్టం ఎ. థాను పిళ్లై | 1964-1968 |
5 | ఖండూభాయ్ కసంజీ దేశాయ్ | 1968-1975 |
6 | ఎస్ ఓబుల్ రెడ్డి | 1975-1976 |
7 | మోహన్‌లాల్ సుఖాడియా | 1976 |
8 | ఆర్ డి భండారే | 1976-1977 |
9 | జస్టిస్ B.J. దివాన్ | 1977 |
10 | శారదా ముఖర్జీ | 1977-1978 |
11 | కె.సి. అబ్రహం | 1978-1983 |
12 | ఠాకూర్ రామ్ లాల్ | 1983-1984 |
13 | శంకర్ దయాళ్ శర్మ | 1984-1985 |
14 | కుముద్‌బెన్ మణిశంకర్ జోషి | 1985-1990 |
15 | క్రిషన్ కాంత్ | 1990-1997 |
16 | జి. రామానుజం | 1997 |
17 | సి. రంగరాజన్ | 1997-2003 |
18 | సుర్జిత్ సింగ్ బర్నాలా | 2003-2004 |
19 | సుశీల్ కుమార్ షిండే | 2004-2006 |
20 | రామేశ్వర్ ఠాకూర్ | 2006-2007 |
21 | నారాయణ్ దత్ తివారీ | 2007-2009 |
22 | E. S. L. నరసింహన్ | 2009 – 2019 |
23 | బిశ్వభూషణ్ హరిచందన్ | 2019 – Present |
Biswabhusan Harichandan

- బిశ్వభూషణ్ హరిచందన్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేస్తున్నారు.
- ఈయన 24 – జూలై – 2019 రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసారు.
- హరిచందన్‌కు 2021లో కళింగ రత్న అవార్డు లభించింది.
- బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు
Articles Related to Governor
- గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరుడు.
- రాష్ట్రానికి అధిపతి
- రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీద జరుగుతుంది.
- గవర్నర్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడిగా కొనసాగుతాడు.
- గవర్నర్ గూర్చి వివరించే నిబంధనలు – 153-162 (6వ భాగం) )
- 153వ నిబంధన ప్రకారం గవర్నర్ పదవి రాష్ట్రంలో ఉంటుంది.
- రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు.
- రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్.
- ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నర్ రాష్ట్రంలో గల పరిస్థితులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపుతారు.
- దేశంలో మొదటి మహిళా గవర్నర్ – సరోజిని నాయుడు (ఉత్తరప్రదేశ్)
- దేశంలో 2వ మహిళా గవర్నర్ – పద్మజా నాయుడు (పశ్చిమబెంగాల్)
- రాష్ట్ర శాసనశాఖలో అంతరభాగం- గవర్నర్
- తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతారు అని ఏ.పి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 తెలుపుతుంది.
Governor Qualifications
- భారతీయ పౌరుడైవుండాలి.
- కనీస వయస్సు 35 సంవత్సరాలు నిండివుండాలి.
- లాభాదాయకమైన పదవి ఉండరాదు.
- చట్ట సభల్లో సభ్యత్వం ఉండరాదు.
Governor Appointment & Tenure
- 155వ నిబంధన ప్రకారం ప్రధాన మంత్రి సూచన మేరకు గవర్నర్‌ను నియమిస్తారు.
- గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది – హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- రాష్ట్రపతి ఒకే వ్యక్తిని 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చు.
- గవర్నర్ నియామక పద్దతిని కెనడా నుండి స్వీకరించారు.
- రాజ్యాంగ ప్రకారం గవర్నర్ పదవికాలం – 5 సంవత్సరాలు
- వాస్తవంగా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నత వరకే గవర్నర్ పదవిలో కొనసాగుతారు.
- గవర్నర్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇవ్వాలి.
- గవర్నర్ ను పదవి నుండి తొలగించేది రాష్ట్రపతి,
- ఏ కారణం చేతనైనా గవర్నర్ పదవి ఖాళీ అయితే 7 నెలలలోపు భర్తీ చేయాలి.
- కొత్త గవర్నర్ వచ్చే వరకు వేరే రాష్ట్ర గవర్నర్ కు అధనపు భాద్యతలను రాష్ట్రపతి కల్పిస్తారు.
ALSO READ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
Governor Emoluments
- గవర్నర్ జీతభత్యాలు నిర్ణయించేది – పార్లమెంట్
- ప్రస్తుతం గవర్నర్ నెలసరి వేతనం – 1,10,000
- నార్షిక పెన్షన్ – 6లక్షల 60 వేలు.
- రాష్ట్ర సంఘటిత నిధి నుండి జీతభత్యాలను స్వీకరిస్తారు.
- భారత సంఘటిత నిధి నుండి పెన్షన్ ను స్వీకరిస్తారు.
- ఒకే వ్యక్తి 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసినట్లయితే ఆయా రాష్ట్రాలు గవర్నర్ వేతనాన్ని సమానంగా చెల్లిస్తాయి.
- గవర్నర్ అధికార నివాసంను – రాజ్ భవన్ గా పిలుస్తారు.
- రాష్ట్ర రాజధాని నగరంలో రాజ్ భవన్ ఉంటుంది.
- దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కూడా గవర్నర్ వేతనం మారదు.
- రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య, ఆరోగ్య, రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది.
Governor Powers & Functions
రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1. Legislative Powers (శాసన అధికారాలు)
- రాష్ట్ర శాసనశాఖలో అంతరభాగం, 3వ సభగా గవర్నర్.
- 174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయడం, నిరవధికంగా సమావేశాలను వాయిదా వేస్తారు.
- 174వ నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభలో విశ్వాసం కల్గిన ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభను రద్దు చేస్తారు.
- 333 నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ ను నియమిస్తారు. శాసనసభకు)
- 171వ నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ విధాన పరిషత్ కు 1/6 వ వంతు సభ్యులను నియమిస్తారు. (కళలు సాహిత్యం , సమాజ సేవ, శాస్త్ర సాంకేతిక ఇతర రంగాల్లో అనుభవం గలవారు)
- 213 నిబంధన ప్రకారం గవర్నర్ శాసనసభ సమావేశంలో లేనప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వాన గల కేబినేట్ మంత్రులు లిఖిత పూర్వకం సిపారసు చేసినట్లయితే ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు.
- ఆర్డినెన్స్ పరిమితి కాలం – 6 నెలలు
- గరిష్ట కాలపరిమితి – 7 1/2 నెలలు.
- శాసనసభ సమావేశం ప్రారంభం అయిన రోజు నుండి 6 వారాల లోపు ఆర్డినెన్ను ఆమోదించినట్లయితే చట్టంగా మారుతుంది. లేని యెడల రద్దు అవుతుంది. –
- రాష్ట్ర గవర్నర్ ప్రసంగ పాఠాన్ని తయారుచేసేది ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కేబినెట్ మంత్రులు.
- రాష్ట్ర శాసనసభ గవర్నర్ ప్రసంగ పాఠానికి ధన్యవాధాలను తెలిపే తీర్మానాన్ని ఆమోదించాలి. లేని యెడల మంత్రిమండలి రద్దవుతుంది.
- గవర్నర్ ప్రసంగ పాఠానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వం తరుపున అధికార పక్ష సభ్యుడు లేదా మంత్రి శాసనసభలో ప్రవేశపెడతారు.
Also read: (RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల)
2. Executive Powers (కార్యనిర్వాహక అధికారాలు)
- రాజ్యాంగ ప్రకారం గవర్నర్ కు నామమాత్రమైన కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.
- 164(ఎ) నిబంధన ప్రకారం గవర్నర్ మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.
- ముఖ్యమంత్రి సూచన మేరకు క్రింది వారిని నియమిస్తారు
- 1. రాష్ట్ర మంత్రులు
- 2. అడ్వకేట్ జనరల్
- 3. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు
- 4. రాష్ట్ర ఎన్నికల కమిషనర్
- 5. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు
- 6. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు
- 7. రాష్ట్ర లోకాయుక్తా
- 8.రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సులర్స్
- 9. రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్, సభ్యులు
- 10. జిల్లా న్యాయమూర్తులు
3.Financial Powers (ఆర్థిక అధికారాలు)
- రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి, ప్రారంభించే అధికారం గవర్నర్ కు ఉంటుంది.
- రాష్ట్ర ఆర్థిక మంత్రి గవర్నర్ ముందస్తు అనుమతితో బడ్జెట్ ను మొదటగా శాసన సభలో ప్రవేశపెట్టాలి.
- శాసన సభ ఆమోదించిన బడ్జెట్ ను విధాన పరిషత్ 14 రోజుల లోపు ఆమోదించాలి.
- రాష్ట్ర శాసనసభ ఆమోదంతోనే బడ్జెట్ అమలులోకి వస్తుంది.
- రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరం లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
- రాష్ట్ర ఆర్థిక సంఘంలో చైర్మన్, 4 గురు సభ్యులు ఉంటాయి.
- రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది.
- గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం వార్షిక నివేదికను పరిశీలించిన తర్వాత శాసనసభకు పంపుతారు.
- రాష్ట్ర ఆర్థిక సంఘం గూర్చి వివరించే నిబంధన – 243(I)
- రాష్ట్ర బడ్జెట్ గూర్చి వివరించే నిబంధన – 202. – 266వ నిబంధన రాష్ట్ర సంఘటిత నిధి
- 267(1) రాష్ట్ర ఆఘంతక నిధి గూర్చి వివరిస్తుంది.
- రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సహాయం చేయలేనప్పుడు గవర్నర్ తన దగ్గర గల అఘంతక నిధి నుండి డబ్బులు ఖర్చు పెడతారు.
4. Judicial Powers (న్యాయ అధికారాలు)
- 161వ నిబంధన ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి.
- ఉరిశిక్ష పైన క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్ కు ఉండదు.
- ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కేబినెట్ మంత్రుల లిఖిత పూర్వక సిఫారసుల మేరకు గవర్నర్ నేరస్తులకు క్షమాభిక్షను పెడతారు. ( శిక్షను తగ్గించడం, శిక్షా స్వభావాన్ని మార్చడం, శిక్ష అమలు కాలాన్ని వాయిదా వేయడం, శిక్షను పూర్తిగా రద్దు చేయడం.)
- జిల్లా న్యాయమూర్తులను నియమించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.
Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF
5.Discriminatory Powers (విచక్షణా అధికారాలు)
- దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నపుడు గవర్నర్ వాస్తవ అధికారాలను నిర్వహిస్తారు.
- శాసనసభా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు గవర్నర్ తన విచక్షణా అధికారంతో ముఖ్యమంత్రిని నియమిస్తారు.
- గవర్నర్ నిర్దేశించిన గడువులోపు ముఖ్యమంత్రి శాసనసభలో బలనిరూపన చేసుకున్నట్లయితే పదవిలో కొనసాగుతారు. లేనియెడల పదవిని కోల్పోతారు.
DOWNLOAD: AP GOVERNORS PDF
********************************************************************************************
Monthly Current Affairs PDF All months |
AP SSA KGBV Recruitment 2021 |
Folk Dances of Andhra Pradesh |