Telugu govt jobs   »   RBI hikes collateral-free loans to Self...

RBI hikes collateral-free loans to Self Help Groups | స్వయం సహాయక సంఘాలకు RBI తనఖా రహిత రుణాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా DAY-NRLM (దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్) కింద స్వయం సహాయక బృందాలకు (SHG) తనఖా రహిత రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచినది. DAY-NRLM అనేది ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. పేదలకు, ప్రత్యేకించి మహిళలకు బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరిక నిర్మూలనను ప్రోత్సహించడం కోసం మరియు ఈ సంస్థలు అనేక రకాల ఆర్థిక సేవలు మరియు జీవనోపాధిని పెంపొందించడానికి వీలు కల్పిస్తుంది.

వాణిజ్య బ్యాంకులు SHG కి రుణాలు అందిస్తాయి. ఈ రకమైన రుణం కోసం ఆర్‌బిఐ నుండి వాణిజ్య బ్యాంకులకు అందిన కొత్త ఆదేశాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • రూ. 10 లక్షల వరకు SHG లకు రుణాల కోసం, ఎలాంటి తనఖా మరియు మార్జిన్ వసూలు చేయబడదు. SHG ల పొదుపు బ్యాంకు ఖాతాకు ఎలాంటి తాత్కాలిక హక్కును గుర్తించకూడదు మరియు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఎలాంటి డిపాజిట్‌లను ఖచ్చితం చెయ్యకూడదు.
  • రూ. 10 లక్షలు మరియు రూ. 20 లక్షల వరకు SHG లకు రుణాల కోసం, ఎలాంటి SHG ల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు ఎలాంటి తాకట్టు వసూలు చేయబడదు మరియు ఎలాంటి తాత్కాలిక హక్కును గుర్తించకూడదు. అయితే, మొత్తం లోన్ (రుణ బకాయితో సంబంధం లేకుండా, తరువాత రూ. 10 లక్షల కంటే తక్కువకు వెళ్లినా) మైక్రో యూనిట్ల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ (CGFMU) కింద కవరేజ్ కోసం అర్హత పొందుతుంది.

DAY-NRLM గురించి:

భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MRD) స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గర్ యోజన (SGSY) పునర్వ్యవస్తీకరించడం  ద్వారా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) ను ప్రారంభించింది. NRLM పేరు DAY-NRLM (దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్) గా మార్చబడింది.

 

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!