Table of Contents
Economy Study Material in Telugu: Overview
Economy Study Material PDF in Telugu : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ఆర్ధిక శాస్త్రం పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో ఆర్ధిక శాస్త్రం విభాగం లో కొన్ని అంశాలను ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ఆర్ధిక శాస్త్రం ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా ఆర్ధిక శాస్త్రం లో ఉన్న ప్రతి అంశాలను మేము మీకు అందిస్తాము.
Economy Study Material in Telugu: ద్రవ్య వ్యవస్థ
ద్రవ్య వ్యవస్థ ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహం ప్రాధాన్యాన్ని మానవ శరీరంలో రక్త ప్రవాహంతో పోల్చవచ్చు. దేశ ఆర్థిక విధానాలను లోతుగా చేసుకోవడంలో ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రధానపాత్ర పోషిస్తాయి
ద్రవ్యం – నిర్వచనం ద్రవ్యాన్ని నిపుణులు ప్రజల భావాలకు అనుగుణంగా వివిధ కోణాల్లో నిర్వచించారు.
- ‘ప్రజలంతా దేన్ని ‘ద్రవ్యం’ అని సార్వత్రికంగా అంగీకరిస్తే అదే ద్రవ్యం – సెలిగ్ మన్
- వినిమయ సాధనంగా ప్రజలంతా భావించేదే ద్రవ్యం – క్రౌధర్
- ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభ్యమయ్యే మొత్తమే ద్రవ్యం – రాడ్క్లిఫ్ కమిటీ
ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువుని బట్టి రెండు రకాలు. అవి
1. లోహపు ద్రవ్యం
2. కాగితపు ద్రవ్యం
చట్టబద్ధమైన ఆమోదం కోణంలో రెండు రకాలు.
1. అపరిమిత
2. పరిమిత
ప్రజల ద్రవ్యత్వాభిరుచి(లిక్విడిటీ ప్రిఫరెన్స్)కి అనుగుణంగా చూస్తే
1. సామాన్య ద్రవ్యం,
2. సమీప అని రెండు రకాలు.
విశదీకరణ లోహపు ద్రవ్యం: ద్రవ్యం తయారీలో లోహాలు (బంగారం, వెండి, నికెల్) దాన్ని లోహపు ద్రవ్యం అంటారు. ఇందులో 3 అంశాలుంటాయి.
i) ప్రమాణ ద్రవ్యం: ఒక నాణెం తయారీకి ఉపయోగించే లోహం విలువ దాని ముఖవిలువకు సమానంగా ఉంటే దాన్ని ప్రమాణ ద్రవ్యం అంటారు. ఉదా: 5 రూపాయల నాణెం తయారీకి 5 రూపాయల విలువ ఉన్న వెండి వాడటం.
ii) చిహ్న ద్రవ్యం: నాణెం తయారీకి ఉపయోగించే విలువ కంటే దాని చెలామణి విలువ ఎక్కువ ఉండటం.
iii) ప్రతినిధి ద్రవ్యం: తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా ద్రవ్యంగా ముద్రించి వాడటం. ఈ విధానంలో ద్రవ్యం జారీ చేసే అధికారుల దగ్గర ద్రవ్యానికి సమానమైన బంగారం, వెండి నిల్వలుంటాయి.
Economy Study Material in Telugu: ద్రవ్య వ్యవస్థ
ద్రవ్య భావనలు
M1, M2. M 3 ,M 4 అనే నాలుగు రకాల ద్రవ్య భావనలను భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్ 1977 లో ప్రవేశపెట్టింది
- M1నీ సంకుచిత ద్రవ్యం, M3 ని విశాల ద్రవ్యం అంటారు.
- M 1 ,M 3 పరిమాణాలను రిజర్వు ద్రవ్యం లేదా హైపర్ ద్రవ్యం నిర్ణయిస్తుంది.
- M1 నుంచి M4 కు ద్రవ్యత్వం తగ్గుతూ వస్తుంది.
ప్రస్తుత ద్రవ్య వ్యవస్థను పరివర్తనలేని కాగితపు ప్రమాణంగా వర్ణించవచ్చు. భారత ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్ రూపాయి. రూపాయితోపాటు రూ.2, 5, 10,20,50, 100, 500, 2000 విలువ ఉన్న కాగితపు ద్రవ్య యూనిట్లు ఉంటాయి.
ఈ ద్రవ్య వ్యవస్థ 1957 ” జనవరి నుంచి వాడుకలో ఉంది. భారతదేశ కాయినేజ్ (సవరణ) చట్టం – 1955 ద్వారా నూతన దశాంశ(డెసీమల్) వ్యవస్థను ప్రవేశపెట్టారు.
నాణేలు, ఆర్బీఐ నోట్లు
భారతదేశ కేంద్ర ప్రభుత్వ విత్త మంత్రిత్వ శాఖ ఒక రూపాయి నోట్లను; ఒక రూపాయి, 50పైసల నాణేలతో సహా అన్ని నాణేలను ముద్రిస్తుంది.2011 జూన్ నుంచి 25 పైసలు అంతకంటే తక్కువ విలువ ఉన్న నాణేలను తొలగించారు.భారతదేశంలో కరెన్సీను ముద్రించే గుత్తాధిపత్య హక్కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఉంది.
భారత్లో ద్రవ్య సరఫరా
ఒక దేశంలో ప్రజల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ఉండే ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ లావాదేవీలు జరపడానికి, రుణాలను చెల్లించడానికి వినియోగించే మొత్తం మాత్రమే ‘ద్రవ్య సరఫరా’ పరిధిలోకి వస్తుంది. ద్రవ్య సమష్టిలు (మానిటరీ అగ్రిగేట్స్) / ద్రవ్య కొలమానాలు
i) మొదటి రకం ద్రవ్యం లేదా సంకుచితమైన ద్రవ్యం (M1)
ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు (C).
బ్యాంకుల డిమాండ్ డిపాజిట్లు (DD)
కేంద్ర బ్యాంకు ఇతర డిపాజిట్లు (OD)
M1= C + DD + OD.
ii) రెండోరకం ద్రవ్యం (M2) M1సహా తపాలా కార్యాలయాల వద్ద ఉండే పొదుపు డిపాజిట్లు.
iiI) మూడోరకం ద్రవ్యం (M3) లేదా విశాల ద్రవ్యం
M1 సహా బ్యాంకుల వద్ద ఉన్న కాలపరిమితి డిపాజిట్లు (TD)
M3 = M1 +TD
iv) నాలుగోరకం ద్రవ్యం (M4)
M1 సహా అన్ని రకాల తపాలా కార్యాలయాల డిపాజిట్లు , తపాలా కార్యాలయాలకు చెందిన గణాంకాలను రిజర్వు బ్యాంకు తాజాగా సంకలనం చేయడం లేదు కాబట్టి M2,M4 భావనలు అర్థరహితంగా మారాయి.
వై.వి.రెడ్డి (1998) మూడో వర్కింగ్ గ్రూపు నూతన ద్రవ్య, ద్రవ్యత్వ కొలమానాలు ఈ వర్కింగ్ గ్రూపు నాలుగు ద్రవ్య సమస్టీలను పునర్ నిర్వచించింది. సవరించిన ద్రవ్య సప్లయి నిర్వచనం ప్రకారం M0 (రిజర్వ్ ద్రవ్యం), M1 (సంకుచిత ద్రవ్యం), M2, M3, (విశాల ద్రవ్యం)లను మాత్రమే లెక్కిస్తారు. రిజర్వు లేదా హైపవర్ ద్రవ్యం (M): ద్రవ్య సప్లయిని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైంది. దీన్ని ప్రభుత్వ ద్రవ్యంగా భావించవచ్చు. దీన్ని మూలాధార ద్రవ్యం లేదా హైపవర్ ద్రవ్యం అంటారు.
M₂ =C +OD + CR
C = ప్రజల దగ్గర చెలామణిలో ఉన్న నాణేలు, కరెన్సీ
OD = ప్రజలు రిజర్వు బ్యాంకులో పెట్టుకున్న ఇతర డిపాజిట్లు
CR = వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు
M0 కు M1 కు సంబంధం ఉంది.
M1 = C+ OD + DD
బ్యాంకింగ్ వ్యవస్థ సృష్టించే మొత్తం డిపాజిట్ నిర్మాణానికి నగదు నిల్వలు (CR) మూలాధారంగా ఉంటాయి.
ద్రవ్య గుణ
ఒక ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైంది రిజర్వు ద్రవ్యం, ద్రవ్య సప్లయి రిజర్వు ద్రవ్యానికి మధ్య ఉండే నిష్పత్తిని ద్రవ్య గుణకం తెలియజేస్తుంది.
సంకుచిత ద్రవ్య గుణకం m1= M1/Mo
విశాల ద్రవ్య గుణకం m3= M3/Mo
Economy Study Material in Telugu : Conclusion
APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఎకానమీ విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.
Economy Study Material in Telugu : FAQs
Q 1. Economy కోసం ఉత్తమమైన మెటీరియల్ ఏమిటి?
జ. Adda247 అందించే Economy స్టడీ మెటీరియల్ చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో కూడా మీకు లభిస్తుంది.
Q 2. Economy కు సిద్ధం కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటి?
జ. ఆర్ధిక అంశాలకు సంబంధించిన ఇటివల సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి పరీక్షలోను తప్పనిసరిగా అడిగే కొన్ని అంశాలు, భారతదేశంలోని పంచవర్ష ప్రణాళికలు, దేశంలో ఇప్పటికి వరకు జరిగిన వివిధ ఆర్ధిక సంస్కరణలు, నీతి ఆయోగ్, రాజ్యాంగంలో ఉన్న వివిధ ప్రభుత్వ ఆర్ధిక సంస్థల వివరాలు, జాతీయ ఆర్ధిక సర్వే యొక్క పుటం, రాష్ట్ర ఆర్ధిక సర్వే మరియు జాతీయ, రాష్ట్రీయ బడ్జెట్ పై పూర్తి అవగాహనా ఉండాలి.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |