Telugu govt jobs   »   RBI announces its bi-monthly monetary policy...

RBI announces its bi-monthly monetary policy | ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన RBI

RBI announces its bi-monthly monetary policy : ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) వరుసగా ఏడవసారి యథాతథ స్థితిని కొనసాగించింది. వడ్డీ రేటును చారిత్రాత్మక కనిష్టానికి తగ్గించడం ద్వారా డిమాండ్ పెంచడానికి ఆర్‌బిఐ చివరిగా తన పాలసీ రేటును మే 22, 2020 న సవరించింది. సమావేశం ఆగస్టు 4 మరియు 6 మధ్య జరిగింది. మిగిలినవి అక్టోబర్‌ (6 నుండి 8 వరకు); డిసెంబర్ (6 నుండి 8) మరియు ఫిబ్రవరి (7 నుండి 9, 2022) లో జరుగుతాయి.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు మరియు బ్యాంక్ రేట్లు మారవు:

  • పాలసీ రెపో రేటు: 4.00%
  • రివర్స్ రెపో రేటు: 3.35%
  • మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు: 4.25%
  • బ్యాంక్ రేటు: 4.25%
  • CRR: 4%
  • SLR: 18.00%

RBI announces its bi-monthly monetary policy : కొన్ని కీలక అంశాలు 

ఆర్బిఐ ద్రవ్య విధానం యొక్క కొన్ని ముఖ్యాంశాలు కింద ఇవ్వబడినది.

  • FY22 కి గాను జిడిపి వృద్ధి అంచనాను ఆర్‌బిఐ మార్చలేదు, ఇది 9.5% వద్ద యథాతథంగా ఉంది.
  • ఆర్‌బిఐ జి-సెక్షన్ అక్విజిషన్ ప్రోగ్రామ్ (GSAP) కింద ఆగస్టు 12 మరియు ఆగస్టు 26 తేదీలలో ఒక్కొక్కటి ₹ 25,000 కోట్ల మరో రెండు వేలాలను(Auctions) నిర్వహించనుంది.
  • 2021-22 సమయంలో CPI ద్రవ్యోల్బణం 5.7% గా అంచనా వేయబడింది-ఇది Q2 లో 5.9%, Q3 లో 5.3% మరియు 2021-22 Q4 లో 5.8% కలిగి ఉంటుంది. 2022-23 మొదటి త్రైమాసికంలో CPI ద్రవ్యోల్బణం 5.1%గా అంచనా వేయబడింది.

ద్రవ్య విధాన కమిటీ కూర్పు క్రింది విధంగా ఉంది

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – చైర్‌పర్సన్, ఎక్స్ అఫిషియో: శ్రీ శక్తికాంత దాస్.

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్, ద్రవ్య విధాన పర్యవేక్షణ అధికారి- సభ్యుడు, ఎక్స్ అఫిషియో: డాక్టర్ మైఖేల్ దేబబ్రాతా పత్రా.
  • సెంట్రల్ బోర్డ్ నామినేట్ చేయబడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక అధికారిని – సభ్యుడు, ఎక్స్ అఫీషియో: డాక్టర్ మృదుల్ కె. సాగర్.
  • ముంబైకి చెందిన ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంటల్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్: ప్రొఫెసర్ ఆషిమా గోయల్.
  • అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్: ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ.
  • వ్యవసాయ ఆర్థికవేత్త మరియు న్యూ ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో సీనియర్ సలహాదారు: డాక్టర్ శశాంకా భిడే.

RBI announces its bi-monthly monetary policy : ద్రవ్య విధానం యొక్క కొన్ని ముఖ్యమైన సాధనాలు

ఆర్బిఐ యొక్క ద్రవ్య విధానంలో ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి ఉపయోగించే అనేక ప్రత్యక్ష మరియు పరోక్ష సాధనాలు ఉన్నాయి. ద్రవ్య విధానం యొక్క కొన్ని ముఖ్యమైన సాధనాలు క్రింది విధంగా ఉన్నాయి:

రెపో రేట్

ఇది లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్‌ఎఎఫ్) కింద ప్రభుత్వ మరియు ఇతర ఆమోదించిన సెక్యూరిటీల అనుశంగీకాల ద్వారా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకకాలంలో ద్రవ్యాన్ని తీసుకోనే (స్థిర) వడ్డీ రేటు.

రివర్స్ రెపో రేట్

ఇది LAF క్రింద అర్హతగల ప్రభుత్వ సెక్యూరిటీల అనుషంగికానికి ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకకాలంలో బ్యాంకుల నుండి ద్రవ్యాన్ని తీసుకొనే (స్థిర) వడ్డీ రేటు.

లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (LAF)

ఎల్‌ఎఎఫ్‌లో ఏకకాలం అలాగే టర్మ్ రెపో వేలం ఉంటాయి. రెపో అనే పదం ఇంటర్-బ్యాంక్ టర్మ్ మనీ మార్కెట్ అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది ఈ మార్కెట్ రుణాలు మరియు డిపాజిట్ల ధరలకు ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇది ద్రవ్య విధానం యొక్క ప్రసారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వివిధ వడ్డీ రెట్ల వద్ద రివర్స్ రెపో వేలం నిర్వహిస్తుంది.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF)

షెడ్యూల్ చేసిన వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏకకాలంలో అదనపు మొత్తాన్ని రుణంగా పొందడానికి  వీలు కల్పించే నిబంధనే ఎంఎస్ఎఫ్. జరిమానా వడ్డీ రేటు పరిమితి వరకు తమ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్)ను తగ్గించడం ద్వారా బ్యాంక్ దీన్ని నిర్వహించవచ్చు. బ్యాంకులు ఎదుర్కొంటున్న ముందుగా గ్రహించని ఆర్ధిక నష్టాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.

 

APCOB Manager & Staff Assistant Target Batch

APCOB online coaching

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

Sharing is caring!