Telugu govt jobs   »   Article   »   Medieval History of Andhra

Medieval History of Andhra | మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర

మధ్యయుగ చరిత్ర ఆంధ్ర ప్రదేశ్ యొక్క గతం యొక్క శక్తివంతమైన చిత్రపటంలో ఆకర్షణీయమైన మరియు పరివర్తనాత్మక యుగాన్ని ఆవిష్కరిస్తుంది. అనేక శతాబ్దాలుగా, ఈ కాలం రాజవంశాలు, సంస్కృతులు మరియు సామాజిక మార్పుల యొక్క మనోహరమైన పరస్పర చర్యను తెలుపుతుంది, ఈ ప్రాంతం యొక్క వారసత్వంపై చెరగని ముద్ర వేసింది. శక్తివంతమైన సామ్రాజ్యాలు వాటి పతనం, కళ మరియు వాస్తుశిల్పం యొక్క అభివృద్ధి మరియు ఈ యుగాన్ని నిర్వచించిన సామాజిక-రాజకీయ అంశాలు తెలియజేస్తుంది. APPSC గ్రూప్స్ కోసం సన్నద్దమయ్యే అభ్యర్ధులు ఆంధ్రుల చరిత్ర గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.  ఈ కధనం లో మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర 7వ శతాబ్దం నుంచి 17 వ శతాబ్దంలో జరిగిన ముఖ్య సమాచారం గురించి తెలుసుకోండి.

మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర

మధ్యయుగ ఆంధ్రుల చరిత్ర లో ప్రధానంగా 6 యుగాలుగా విభజించాము, గ్రూప్ 1, మరియు గ్రూప్ 2 పరీక్షలల్లో ప్రశ్నలలో అడిగే అవకాశం ఉన్న ముఖ్యాంశాలు తెలుసుకోండి.

  1. వేంగి చాళుక్యుల యుగం
  2. సామంత రాజ్యాలు
  3. కాకతీయ యుగం
  4. రెడ్డినాయక యుగం
  5. విజయనగర సామ్రాజ్య యుగం
  6. బహమనీ- కుతుబ్షాహీల యుగం

వేంగి చాళుక్యుల యుగం

వేంగి లేదా తూర్పు చాళుక్యులు మొదట పిష్టపురం (పిఠాపురం) తర్వాత పెదవేగి (ఏలూరు) రాజధానిగా తూర్పు తీరాంధ్ర నాలుగున్నర శతాబ్దాలు పాలించారు. వేంగి క్రీ.శ.6వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని దాదాపు 624 నుంచి 1075 వరకు పరిపాలించారు. రెండవ పులకేశి 616లో విష్ణుకుండిన రణదుర్జయ రాజ్యాలను సొంతం చేసుకున్నాడు.

రాజు  ముఖ్య సమాచారం
కుబ్బవిష్ణువర్ధనుడు
  • క్రీ. శ 624 నుంచి 642 వరకు పరిపాలించాడు,
  • పిఠాపురం మరియు పెదవేగి రాజధానిగా పరిపాలన జరిగింది
  • విషమ సిద్ధి, సర్వ సిద్ధి, మకర ద్వజుడు, కామదేవుడు, పరమ భాగవత ఇతని బిరుదులు
  • తామ్రశాసనం, చేజర్ల శిలాశాసనం కొప్పరం శాసనాలలో ఇతని ప్రస్తావన ఉంది
  • నుడంబవసతి అనే జైన దేవాలయం రాణి అయ్యనమహాదేవి చేత నిర్మించబడినది
  • ముషినికొండ శాసనం లో జైనుల ప్రస్తావన ఉంది(ఆంధ్రా లో జైనుల గురించి తెలిపే శాసనం ఇదే)
  • జయసింహ వల్లభుడు-I మరియు ఇంద్రభట్టారకుడు ఇతని కుమారులు
  • రెండో విష్ణు వర్ధునున్ని దర్మ శాస్త్రవేత్త అని పిలిచేవారు
  • చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్  ఇతని రాజ్యాన్ని సందర్శించాడు
మొదటి జయసింహ వల్లభుడు
  • 642-673 వరకు ,31 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు
  • పిఠాపురం నుంచి వేంగి కీ రాజధానిని మార్చాడు
  • సర్వ సిద్ధి అనే బిరుదు ఉంది
  • ఇతనికుమారుడు విష్ణువర్ధనుడుకి విషమసిద్ధి, ప్రళయాదిత్యుడు అనే బిరుదు కలవు మరియు కేవలం 9 సంవత్సరాలు పరిపాలించాడు
  • విప్పర్ల శాసనాన్ని వేయించాడు ఇది వేంగి చాళుల తొలి తెలుగు శాసనం
మొదటి విజయాదిత్యుడు
  • ఇతను 753-72 వరకు పరిపాలించాడు
  • తొలి రాష్ట్ర కూట దాడి ఇతని కాలంలో జరిగింది
  • పరమభట్టారక, త్రిభువనాంశకుడు, సమస్త భువనాశ్రయ అనే బిరుదులు కలవు
నాలుగోవ విష్ణువర్ధనుడు
  • 772-808 వరకు పరిపాలించాడు
  • ఇతని కుమార్తె షీలమహాదేధినిని దేవుడికిచ్చి వివాహం చేశాడు
రెండోవ విజయాదిత్యుడు
  • 808-847 వరకు పరిపాలించాడు
  • ఇతను తూర్పు చాళుక్యులలో 11వ వాడు
  • విక్రమధవళ, చాళుక్యరామ,నరేంద్ర మృగరాజు
  • సాతలూరు శాసనం ప్రకారం ఇతను 12 సంవత్సరాల పాటు 108 యుద్ధాలు చేసి  తన పేరుమీద 108 శివాలయాలు నిర్మించాడు
మూడవ విజయాదిత్యుడు
  • 848-891 వరకు పరిపాలించాడు
  • గుణకెనల్లాట, పరచక్రరామ, త్రిపురామర్త్య, వల్లభుడు, అనే బిరుదులు ఉన్నాయి
  • ఇతనికి నలుగురు బ్రాహ్మణులు- సేనాపతులు, కడియరాజు, పండరంగ, రాజదిత్య, వినయాదిత్య శర్మ ఉన్నారు
  • పండరంగడు వేయించిన అద్దంకి శాసనం తెలుగు భాషలో పద్య శాసనం
మొదటి చాళుక్య భీముడు
  • క్రీ.శ 892- 922 వరకు పరిపాలించాడు
  • విక్రమార్జున విజయం, మాదిగొండ, బెజవాడ, అత్తిలి, కశింకోట శాసనాలు ఇతడి చరిత్ర చెబుతాయి
  • ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయం మరియు పంచారామాలు నిర్మించాడు
  • ఇతని ఆస్థానంలో చల్లవ (చెల్లాంబిక) అనే విద్యా ప్రవీణురాలికి భూమిని దానం చేశాడు.
  • చాళుక్య భీమ సర్వలోకాశ్రయ విష్ణు వర్ధన మహారాజు అని  ఇతని శాసనం పేర్కొంది
మొదటి అమ్మ రాజు
  • ఇతను నాలుగో విజయాదిత్యుడి కుమారుడు, 922 నుంచి 928 వరకు పాలించాడు
  • క్రీ.శ 927లో రాజ్యమహేంద్రపురంని నిర్మించాడు
  • రాజామహేంద్ర అనే బిరుదు కలదు
రెండో అమ్మరాజు
  • 945 నుంచి 970 వరకు పాలించాడు
  • కవి గాయిక కల్పతరు అనే బిరుదు కలదు
  • ఇతని సోదరుడు దానర్మవ రాష్ట్రకూటం మద్దతుతో అమ్మరాజు ని అంతం చేశాడు
విమలాదిత్యుడు
  • ఇతను 1011 నుంచి 1018 వరకు పాలించాడు
  • ఇతను జైన మతాన్ని స్వీకరించాడు
  • విజయనగరం (రామతీర్ధంలో) జైన ఆలయాన్ని నిర్మించాడు
  • విజయాదిత్యుడు రాజరాజనరేంద్రుని చేతిలో ఓడిపోయాడు
ఏడోవ రాజరాజనరేంద్ర
  • 1022 నుంచి 1061 వరకు పాలించాడు
  • అమ్మంగి అనే రాకుమారిని పెళ్లిచేసుకున్నాడు
  • ఇతని ఆస్థానంలో నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లన్న అనే కవులు ఉండేవారు
రెండో రాజేంద్ర
  • 1061 నుంచి 1063 వరకు పరిపాలించాడు
  • ఇతని తర్వాత  ఏడో విజయాదిత్య పరిపాలించాడు
  • ఏడో విజయాదిత్య తర్వాత వేంగి రాజ్యం చోళ రాజ్యం లో కలిసిపోయింది
కులోత్తుంగ చోళుడు
  • ఇతను క్రీ.శ 1070 నుంచి 1120 వరకు పరిపాలించాడు
  • చాళుక్య రాజు విక్రమార్కుడు వేంగి మరియు కళింగ రాజ్యాలపై దాడి చేశాడు. ఆఆ దాడి లో శక్తి వర్మ మరణించాడు
  • ఈ వేంగి చాళుక్య రాకుమారుడు రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడుఅనే బిరుదుని పొందాడు
  • ఇతని కాలంలో అనేక ద్రావిడ, బ్రాహ్మణులు వలస వచ్చారు
  • తంజావూరు కేంద్రంగా వేంగి చాళుక్య-చోళ సింహాసనం అధిరోహించాడు

ఆర్ధిక పరిస్థితి

పరిపాలన విభాగాలు మూడు భాగాలు గా ఉన్నాయి అవి, విషయ, నాద గ్రామము. రెండో భీమ పాలనలో మచిలీపట్నం లో ఒక శాసనం ప్రకారం గ్రామ కమిటీ ప్రస్తావన ఉంది. పంచవర అనే గ్రామ కమిటీ ఈ శాసనం లో పేర్కొన్నారు. భూమి శిస్తుని సిద్దాయ మరియు అరిపన్ను అని పిలిచేవారు. ఈ కాలంలో వర్తకం బంగారు, వెండి, రాగి నాణాలతో జరిగేది. బంగారు నానాలను గద్వాణము అని, వెండి నానాన్ని మాడ అని, రాగినాణాన్ని కాసు అని పిలిచేవారు

ముఖ్యరేవు పట్టణాలు:

  • విశాఖపట్నం లో ఉన్న కులుత్తోంగ చోళ పట్టణం ఒక ప్రధాన రేవుపట్టణం
  • చోళ పాండ్యపురం
  • గండగోపాలపురం
  • దేశయకొండ పట్టణం

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 APPSC గ్రూప్ 2 జీతం
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు APPSC గ్రూప్ 2 సిలబస్
APPSC గ్రూప్ 2 అప్లికేషన్ పూరించే విధానం APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 పరీక్ష విధానం 2024
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024

 

Sharing is caring!