Telugu govt jobs   »   నాటక సంస్థలు

Social and Cultural History of Andhra Pradesh: Naataka Samsthalu | ఆంధ్ర ప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర నాటక సంస్థలు

APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో నాటక సంస్థలను సిలబస్ లో పొందుపరిచారు మరియు APPSC గ్రూప్ 2 మెయిన్స్ కి సన్నద్దమయ్యే అభ్యర్ధులకి ఈ అంశంపై తప్పనిసరిగా పట్టు ఉండాలి. అధికారికంగా జులై 28న పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు గతంలోనే తెలిపారు తదనుగుణంగానే అభ్యర్ధులు తప్పనిసరిగా వారి ప్రిపరేషన్ ప్రణాళికని మెరుగుగా రూపొందించుకోవాలి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం దాదాపు 75 రోజుల సమయం ఉంది ఈ సమయాన్ని రివిజన్, మాక్ టెస్ట్లు మరియు సమయ నిర్వహణ తో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే అభ్యర్ధులు తప్పనిసరిగా విజయం సాధించవచ్చు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర: నాటక సంస్థలు

తెలుగులో క్రీ. పూ. నన్నయ, తిక్కన, ఎర్రన, వంటి ఎందరో కవులు సాహిత్యానికి, నాటకానికి పునాధి వేశారు మరియు నన్నయ మహాభారత గ్రంధ రచన తో పాటు ఎంతో ప్రముఖమైన నాటకాలు రచించారు. 13వ శతాబ్దంలో నే పండితులు తెలుగు భాష సాహిత్యానికి, నాటక రంగానికి పెద్దపీట వేశారు. అభిజ్ఞాన శాకుంతలం, సంహారం, ముద్రా రాక్షసం, వేయి పడగలు వంటి నాటకాలు ప్రసిద్ది చెందాయి.

ఆంధ్రా ప్రాంతంలో బ్రిటీషు వారిచే అప్పట్లోనే 1857 కాలంలో 3 విశ్వ విద్యాలయాలు నెలకొల్పి ఇక్కడి విద్య, సామాజిక, సాంస్కృతిక అభివృద్దికి తోడ్పడ్డారు. 1860 నాటికి ఆధునిక రంగస్థలం ఏర్పాటు జరిగినది. ఈ ప్రాంత ప్రజలకి ఆంగ్ల కవులు, రచయితలు అయిన షేక్స్పియర్, మాణీయర్ లాంటి వారి గురించి తెలిసే ఏర్పాటు జరిగినది.

తెలుగు నాటక రచన కి 1860లలో పునాధి వేసింది కోరాడ రామచంద్ర శాస్త్రి, ఈయన మంజరి మధుకరియం అనే నాటకాన్ని రచించారు మరియు ధర్మవరం రామకృష్ణామాచార్యులు తెలుగు నాటక పితామహుడుగా పిలవబడతారు.

19 వ దశకం నాటికి తెలుగులోకి దాదాపు 40 షేక్స్పియర్ నాటకాలు అనువాదించబడ్డాయి. 1880 వరకు నాటక ప్రదర్శనలు జరగలేదు. కాలక్రమేణా పాశ్చాత్య నాటకాల వలన తెలుగు ప్రాంతంలో నాటకాలు ఆధునిక రూపం సంతరించుకున్నాయి.

తెలుగు భాషా సాహిత్యం మరియు అభివృద్ది, APPSC గ్రూప్ 2 మెయిన్స్ ప్రత్యేకం

ముఖ్య రచనలు/ నాటకాలు:

  • సంస్కృతం లో ధర్మసూరి రచించిన నరకాసుర విజయవ్యామోగంని తెలుగు లోకి కొక్కొండ వెంకట రత్నం అనువదించారు.
  • వాసుదేవ శాస్త్రి షేక్స్పియర్  రచించిన జూలియస్ సీజర్ ని సీజరు చరితముగా అనువదించారు
  • కందుకూరి వీరేశలింగంగారు రత్నావళి ని తెలుగులోకి అనువదించారు.
  • ధర్మవరం కృష్ణమాచార్యులు చిత్రనళీయం, సారంగధర అనే నాటకలని రచించారు ఇందులో సారంగధర తెలుగులో వచ్చిన మొదటి విషాద నాటకం.

ప్రముఖ నాటక సంస్థలు:

మహారాష్ట్రా నుండి వచ్చిన సైనిక జాతి వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో స్థిరపడ్డారు వీరిని ఆరేకాపులు మెడ అరె మరాటిలు అని అంటారు. కాలక్రమేణా వీరు రాయదుర్గం, బాల కొండ, సురభి అని మూడు శాఖలుగా విడిపోయారు. ఇందులో సురభి వారు నాటక రంగంలో రాణించారు.

సురభి

సురభి వారు రామి రెడ్డి, చెన్నా రెడ్డిగారి ఇంట్లో వివాహ మహోత్సవానికి గాను కీచక వధ నాటకాన్ని ప్రదర్శించారు. దానిని చూసిన పులివెందుల మెజిస్ట్రేటు గోవిందరాజుల నాయుడు వారి చేత ఇంకో ప్రదర్శన చేయించారు. సురభి ప్రాంతంలో వీరు స్థిర పడ్డారు మరియు సురభి వారి నాట్య అసలు పేరు శ్రీ శారదా మానవ వినోదిని సంగీత నాటక సభ. వీరే మొట్టమొదటిగా సంచార నాట్యకాలని ప్రదర్శించారు. కోస్తాంధ్రలో నరసారావు పేట లో తొలి నాటకాన్ని ప్రదర్శించారు. 1910 నాటికి సురభి లో ఉన్న అన్నదమ్ములు విడిపోయారు రాయల సీమ, తెలంగా, సర్కారు జిల్లాల పంచుకుని ఎవరికి వారు ప్రదర్శనలు చేసే వారు:

  • పెద్ద కృష్ణాజీ రావు
  • వెంకోజీ  రావు
  • పెద రామయ్య

శ్రీ గోవిందా రాయ సురభి నాట్య మండలి:

గోవిందరావు అసలు పేరు పకీరన్న, చిన్నతనం లో తల్లిదండ్రులు మరణించడంతో పనారస సంజీవరావు భార్య చెన్నమ్మ ఆదరించింది. ఈయనకి గోవిందప్ప అని నామకరణం చేసి దత్తత తీసుకున్నారు.

1890 లలో నంద్యాల లో ఉన్న జ్యోతి సుబ్బయ్య కంపెనీలో సంగీతం, నటన నేర్చుకున్నారు. ఈయన వేసిన మొదటి నాటకం హరిశ్చంద్ర నాటకం లో విశ్వామిత్ర పాత్ర. 1910 లో లంకాదహనం, కాంతమతి నాటకాలతో పేరుపొందారు. చిన్న రామయ్యతో కలిసి దశావతారములు, వసంత సేన అనే నాటకాలు వేశారు. ఈయనకి 1929 లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు ఆంధ్ర నాటక కళోద్దారక అనే బిరుడుని తెనాలి లో అందించారు.

APPSC Group 2 Mains Previous Year Papers With Answer Key, Download PDF

సురభి కుటుంబానికి సంబంధించిన ఇతర సమాజాలు

లక్ష్మీ ప్రసాన్ని నాట్యమండలి -మొదటి రామయ్య దీని నిర్వాహకుడు

సుబ్బయ్య సమాజం- 1914-28

వీరయ్య సమాజం-

జంరటి  వెంకటి సమాజం- 1916-30

శ్రీ శారదా మనో వినోదిని సంగీత నాటక సభ- అబ్బాజీ రావు దీని నిర్వాహకుడు.

రామాబాయి సమాజం-1914 -1937

ఆంధ్ర నాటక కళా పరిషత్తు:

ఆంధ్రనాటక కళా పరిషత్తు 1929లో కొత్తపల్లి లక్ష్మయ్య చే శతపించబడింది. దీని ద్వారా నాటక రంగం వైపు ఆకర్షితులైన వారిని మరియు ప్రతిభ గల కళాకారులని ప్రోత్సహించారు. 1929 తెనాలి లో 3 ఆంధ్రనాటక కళా పరిషత్తు ని స్థాపించి మూడు రోజుల పాటు సభలు నిర్వహించారు. 1937 లో నాట్యకళ అనే పత్రికను స్థాపించారు.

హిందూ నాటక సమాజం: సత్యవోలు గున్నేశ్వర రావు మరియు నాగేశ్వర రావు గార్ల చేత  రాజమహేంద్రవరంలో స్థాపించబడినది

హిందూ నాటక సమాజం: దీనిని రాజామహేంద్ర వారం లో 1889 న హనుమంత రావు గారు ప్రారంభించారు

గుంటూరు ఫస్టు కంపెనీ : దీనిని గుంటూరు లో కొండుబట్ల సుబ్రమణ్య శాస్త్ర గరిచే స్థాపించబడినది. దీని ముందు పేరు గుంటూరు హిందూ నాటక సమాజం. సత్యహరిశ్చంద్రీయం దీని ప్రసిద్ద నాటకం. గుంటూరు సెకండ్ కంపెనీ: గుంటూరులో చేగు కనకరత్నం గారు స్థాపించారు. దీని అసలు పేరు విబుధ రంజని శృంగార హిందూ నాటక సమాజం

యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్: దీనిని 1916లో కాకినాడలో జనాబ్కాశీం, మాదిరెడ్డి రామనుజులు రావు నాయుడు స్థాపించారు. లేచింది మహిళాలోకం వీరి ప్రముఖ ప్రదర్శనలలో ఒకటి

హిందూ నాటక సమాజం : దీనిని 1885 కాకినాడ లో దనవహి హనుమంత రావు ప్రారంభించారు

లలిత కళా పరిషత్తు : దీనిని 1956 లో అప్పటి ఆంధ్ర ప్రాంత గవర్నర్ చేత ప్రారంభించబడింది. కల్లూరు సుబ్బారావు గారు నిర్మాణానికి స్థలాన్ని సమకూర్చారు. ‘

ఆంధ్ర నాటక సమాఖ్య: దీనిని 1954 రాజామహేంద్రవరంలో  బలరాజ్సహానీ చేతులమీదుగా ప్రారంభించబడింది.

 

Also Read:

జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF 
Environmental Study Material – Waste Management Andhra Pradesh Economy: Most important Questions from 2023-24 Budget for APPSC Group 2 Mains

APPSC Group 2 Mains 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!