Table of Contents
List of Telangana Districts | తెలంగాణ జిల్లాల సమాచారం Pdf : తెలంగాణాలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్ ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
తెలంగాణ జిల్లాల సమాచారం (List of Telangana Districts)
- ప్రజలకు చేరువగా పరిపాలనను అందించడానికి పథకాలను (Programmes) సమర్థవంతంగా అమలు చేయడానికి , పేదరిక నిర్మూలన (Poverty eradication) వంటి లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11 న దసరా పండుగ దినాన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత ములుగు మరియు నారాయణపేట అనే రెండు కొత్త జిల్లాలు 17 ఫిబ్రవరి 2019న సృష్టించబడ్డాయి, మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.
- ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీని వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం ఉనసంఖ్య 33 కి చేరింది.
- తెలంగాణ ప్రాంతంలో చివరిసారిగా రంగారెడ్డి జిల్లా 1978 ఆగస్టు 15న ఏర్పాటు చేశారు.
Nirmal | నిర్మల్
- దాదాపు 400 సంవత్సరాల క్రితం పాలించిన నిమ్మనాయుడు పేరు మీద నిర్మలకు ఆ పేరు వచ్చింది.
- ఇది తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంతం జిల్లా.
- దర్శనీయ ప్రదేశాలు : జ్ఞాన సరస్వతి దేవాలయం-బాసర
- ప్రత్యేకతలు – అత్యధిక జీవ వైవిధ్యం గల ప్రాంతం
- రాంజీగోండ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి, అమరుడైన ప్రాంతం, నిజాం ఆయుధాల తయారి కేంద్రం ఉన్న ప్రాంతం – నిర్మల్ పట్టణం.
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి :
- నిర్మల్ పెయింటగ్స్, కొయ్య బొమ్మలు ఇక్కడివే.
- బాసర ఐఐఐటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ విద్యాకేంద్రం.
- జాతీయ రహదారి 44. ఈ జిల్లాను అడ్డంగా విభజిస్తుంది.
- ప్రధాన పత్తి కొనుగోలు కేంద్రం భైంసాలో ఉంది.
- సహ్యదీ (లేదా) సాత్నాల పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం మహబూబ్ ఘాట్ ఈ జిల్లాలోనే ఉంది.
- ప్రముఖులు : రాధా రాజిరెడ్డి – ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుడు. ఇతను పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారం పొందాడు.
Kumaram Bheem Asifabad | కుమురం భీం ఆసిఫాబాద్
- ఈ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి విభజించి ఏర్పాటు చేయబడింది.
- ఈ జిల్లా కేంద్రంగా గల అసిఫాబాద్ ఒకప్పటి గోండుల రాజధాని
- 1913 నుంచి 1941 వరకు అసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
- జల్, జంగిల్, జమీన్ కోసం నిజాం సర్కార్ పై దాడి చేసిన గోండు అమరవీరుడు కుమురం భీం పేరుమీద ఈ జిల్లాకు ఆ పేరు వచ్చింది.
- ప్రత్యేకతలు :చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన శిలాజాలు అసిఫాబాద్ మరియు చుట్టుప్రక్కలప్రాంతంలో బయటపడ్డాయి.
- సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ఈ జిల్లాలోనే పెద్దది
- బెజూరు అడవిలో వున్న పాలరపు కొండలు అంతరించిపోతున్న రాబందులకు నిలయంగా ఉంది.
Manchiryal | మంచిర్యాల
- ఆదిలాబాద్ నుంచి విభజించి ఏర్పాటు చేయబడిన జిల్లా.
- గోదావరి, ప్రాణహిత నదులు, అపారమైన బొగ్గు నిక్షేపాలు, సిమెంట్ పరిశ్రమలు ఈ జిల్లా ప్రత్యేకం
- ప్రత్యేకతలు : గోదావరి నది చెన్నూర్ ప్రాంతంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. దీనిని పంచకోశ ఉత్తర వాహినిగా పిలుస్తారు. , ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు.
Jagityala | జగిత్యాల
- శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, కాకతీయుల సమకాలికులు అయిన పొలవాస రాజుల రాజధాని అయిన పొలాస ఈ జిల్లాలోనే ఉన్నాయి.
- జగ్గదేవుడు పేరుమీద జగిత్యాల పేరు వచ్చింది. (కరీంనగర్ జిల్లా ఉత్తర భాగాన్ని విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు)
- ప్రత్యేకతలు :సంపూర్ణ ఆయకట్ట కలిగిన జిల్లా
- వ్యవసాయ పరిశోధన కేంద్రం (పొలాస)
- విత్తన కేంద్రం (చల్ గల్)
- ఏడుపాయల గోదావరి (వేంపల్లి వెంకట్రావు పేట) (గోదావరి జిల్లాలో ప్రవేశించే ప్రాంతం)
- రాఖి గుట్టలు (సారంగపూర్, బోర్నపల్లి, బీర పూర్, జగన్నాథపురం)
- పాశిగాం బౌద్ధ స్థూపం (పాశగాం)
- ప్రముఖులు : అచ్చమాంబ (తొలి తెలుగు రచయిత్రి-కొడిమ్యాల)
- అందె వెంకట్రాం
- బి.ఎస్.రాములు, ఎం.వి.నరసింహారెడ్డి, కె.వి.నరేందర్, సంగవేణి రవీంద్ర, ఆచార్య జైశెట్టి రమణయ్య, ఆచార్య జైకిషన్
Pedda palli | పెద్దపల్లి
- కరీంనగర్ జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
- నిజాం కాలంలో పెద్దపల్లి ప్రత్యేక సంస్థానంగా వెలుగొంది.
- పరిశ్రమలు : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ (రామగుండం), ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ లిమిటెడ్, టి.ఎస్.జెన్‌కో, సౌర విద్యుత్ కేంద్రం, శాలివాహన విద్యుత్ కేంద్రం, జెన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, రబ్బరు & ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమలు.
- ప్రత్యేకతలు : రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ)
- రామగుండం (సిట్ ఆఫ్ ఎనర్జీ), ఇది దేశంలోనే ఐ.ఎస్.ఓ. 14001 సర్టిఫైడ్ పొందిన మొదటి సంస్థ.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 కార్పొరేషన్ లో రామగుండం కార్పొరేషన్ ఒకటి.
Download Pdf: తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు
Rajanna Sirisilla | రాజన్న సిరిసిల్ల
- కరీంనగర్ జిల్లా నైరుతీ భాగంను విభజించి రాజన్న సిరిసిల్లను ఏర్పాటు చేశారు. – దాదాపు 750 నుంచి క్రీ.శ. 973 వరకు పాలించిన వేములవాడ చాళుక్యుల కాలంలో ‘సిరి’శీలగా ఏర్పడ్డ గ్రామం.
- తరువాత కాలంలో సిరిసిల్లగా మార్పు చెందింది. – మర నేత, చేనేత పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
- దర్శనీయ ప్రదేశాలు : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరస్వామి దేవాలయం (వేములవాడ)
- ప్రముఖులు : బద్దం ఎల్లారెడ్డి- ఇల్లంతకుంట మ,, గాలి పెల్లి గ్రా,, (కరీంనగర్ తొలి లోక్ సభ సభ్యుడు)
- సి. హెచ్.విద్యాసాగర్ రావు-మారుపాక (ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్)
- సినారె (వేములవాడ మండలం, హనుమాజిపేట)
- ప్రత్యేకతలు :టెక్స్ టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ (సిరిసిల్ల)
- ది సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్క్ (బద్దెనపల్లి)
- దేశంలోనే తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ సిరిసిల్లలోనే ఉంది.
- ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక మరమగ్గాలున్న ప్రాంతం – సిరిసిల్ల.
Karimnagar | కరీంనగర్
- సబ్బినాడుగా మరియు అరిపిరాలగా పిలవబడిన ఈ ప్రాంతం ఎలగందల్ ఖిలాదారు అయిన సయ్యద్ కిపేరు మీద కరీంనగర్ గా పిలువబడుతుంది.
- క్రీ.శ.1905 మీర్ మహమద్ అలీఖాన్ కాలంలో జిల్లా కేంద్రం ఎలగందల్ నుంచి కరీంనగర్ కు మార్చారు.
- ప్రాజెక్టులు : లోయర్ మానేరు డ్యాం
- ప్రత్యేకతలు : గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ-కరీంనగర్ (దాదాపు 200గ్రానైట్ పరిశ్రమలు ఈజిల్లాలోనే ఉన్నాయి)
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పరిపాలన రజతోత్సవాల సందర్భంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా స్వాగత తోరణ కమాన్‌గా ప్రసిద్ధి చెందింది.
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిల్వర్ ఫిలగ్రీ కళ ఈ జిల్లాకే చెందినది.
Also Read: Arts & Crafts of Telangana
Nizamabad | నిజామాబాద్
- 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజైన ‘ఇంద్రవల్లభ పంత్య వర్ష ఇంద్రసోను’ పేరుమీద ఏర్పడిన ఇందూరు (ఇంద్రపురి) నిజాం ఉల్ ముల్క్ పేరు మీద 1905లో నిజామాబాద్ జిల్లాగా మారింది.
- ప్రాజెక్టులు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
- పరిశ్రమలు: నిజాంసాగర్ ఫ్యాక్టరీ (బోధన్), సహకార చక్కెర ఫ్యాక్టరీ (సారంగపూర్)
- ప్రత్యేకతలు :తెలంగాణలో ఇక్కడ తయారైన ఇనుము, ఉక్కు ఆయుధాలు, అరబ్బు దేశాలకు రవాణా చేసినారు.
- గోదావరి నది ఈ జిల్లాలోని కందకుర్తి వద్ద మొదటిగా ప్రవేశిస్తుంది.
- బ్రిటీష్ కాలం నాటి రూద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం
- తెలంగాణ యూనివర్సిటీ (డిచ్ పల్లి )
Kamareddy | కామారెడ్డి
- దోమకొండ సంస్థానాధీశుడైన రెండవ కామారెడ్డి పేరిట వెలిసిన గ్రామమే కామారెడ్డి. (గతంలో ఈ ప్రాంతంలోకోడూరు అనే గ్రామం ఉండేది)
- ప్రాజెక్టులు: నిజాంసాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, కౌలాసనాల ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయల్-కామారెడ్డి ఎత్తిపోతల పథంకం
- ప్రత్యేకతలు : రాష్ట్రంలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక జిల్లా, ఇండియన్ అరోరాగా పేరుగాంచిన గ్రానైట్ లభిస్తుంది.
- డెయిరీ టెక్నాలజీ కళాశాల (కామారెడ్డి) (రాష్ట్రంలో డెయిరీ ఎకైక కళాశాల)
Jayashankar Bhupalapalli | జయశంకర్ భూపాలపల్లి
- తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త అయిన ఆచార్య జయశంకర్ సార్ పేరుమీద ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది.
- వరంగల్ జిల్లా నుండి అధిక భాగం కరీంనగర్ నుండి కొంత భాగంను వేరు చేసి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
- ప్రాజెక్టులు – కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, వి.వి.నర్సింహారావు కంతలనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు, మల్లూరు వాగు ప్రాజెక్టు (నర్సింహాసాగర్ ప్రాజెక్టు), రామప్ప చెరువు, లక్నవరం చెరువు.
- పరిశ్రమలు – కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి కాలరీస్, వ్యవసాయాధారిత చిన్న పరిశ్రమలు, కాగితపు పరిశ్రమ.
- దర్శనీయ ప్రదేశాలు : • కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయం – మహదేవ్ పూర్ ,రామప్ప ఆలయం (పాలంపూర్) • దక్షిణ త్రివేణి సంగమం (కాళేశ్వరం) • రామప్ప & లక్నవరం చెరువు • సమ్మక్క సారలమ్మ గద్దెలు • బొగతా జలపాతం
ప్రత్యేకతలు :
- మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర.
- తెలంగాణ నయగార, బోగత జలపాతం (వాజేడు మండలం)
- రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ(ఐ.టి.డి.ఎ) ఏటూరునాగారంలో ఉంది.
- రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా.
DOWNLOAD PDF: సింధు నాగరికత Pdf
Warangal Rural | వరంగల్ రూరల్
- కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన జిల్లా
- దర్శనీయ ప్రదేశాలు : పాకాల చెరువు
- ప్రత్యేకతలు : దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీ గంగదేవిపల్లి ఈ జిల్లాలోనే ఉంది.
- అత్యధిక శాతం గ్రామీణ జనాభా ఉన్న జిల్లా
- జయశంకర్ సారు జన్మించిన జిల్లా
- దేశంలోనే అతి పెద్ద జౌళి పార్కును చింతపల్లి, శాయంపేటల మధ్య ఏర్పాటు చేయనున్నారు.
Warangal Urban |వరంగల్ అర్బన్
- కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం ఓరుగల్లు (వరంగల్) జిల్లాల పునర్విభజనలో ఇప్పుడు నగరం చుట్టుపక్కల మండలాన్ని కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా రూపాంతరం చెందింది.
- ఖనిజాలు – క్వార్జ్, కాలర్ గ్రానైట్, రాతి గుట్టలు
- పరిశ్రమలు – ఐ.టి. పరిశ్రమ (మడికొండ), వ్యవసాయాధార పరిశ్రమలు, టీఎస్ఎన్డీడీసీ. రాష్ట్రంలో అతిపెద్ద టెక్ – పరిశ్రమ, నడికట్టు కాటన్ ఇండస్ట్రీస్.
- దర్శనీయ ప్రదేశాలు: వరంగల్ ఖిల్లా ,వేయి స్థంభాల గుడి • పద్మాక్షి ఆలయం • భద్రకాళి ఆలయం | • మల్లిఖార్జునాలయం (ఐనవోలు) – కొత్తకొండ కోరమీసాల స్వామి ఆలయం (భీమదేవరపల్లి) • గోవింద రాజుల గుట్ట • కుష్ మహల్
- ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే ఖాజీపేట రైల్వే జంక్షన్. ,మామునూరు విమానాశ్రయం
- ప్రత్యేకతలు : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం
- ఎనుమాములలో ఆసియాలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ కలదు
- 2013 ఫిబ్రవరిలో వరంగల్ ప్రపంచ వారసత్వ. నగరంగా గుర్తింపు పొందింది.
- హృదయ్ పథకంలో భాగంగా ఎంపిక చేయబడిన పట్టణం
- దక్షిణ భారత దేశం నుండి ఎంపికైన తొలి ప్రధాని పివి నరసింహరావు ఈ జిల్లావారే.
Janagam | జనగాం
- జైనుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో ఈ ప్రాంతానికి జైనుల గ్రామం అని, జనగాం అని పేరు వచ్చిందని ప్రతితి. కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది.
- తెలంగాణ సాయుధ పోరాట కేంద్రం, సామాజిక రాజకీయ ఉద్యమాల పోరుగడ్డ – జనగాం
- సర్దార్ సర్వాయి పాపన్న కోట (ఖిలాషాపూర్)
- ప్రత్యేకతలు :ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెంబర్తి ఇత్తడి కళ
- రాష్ట్రంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే
- దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం – సాలామైల్ (ఈ జిల్లాలోనే ఉంది)
- మహాకవులైన వాల్మీకి, బమ్మెరపోతన, పాల్కూరికి సోమనాథుడు, వంటివారు జన్మించిన జిల్లా
- తెలంగాణ సాయుధ పోరాట వీరులైన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, సర్దార్ సర్వాయి పాపన్నల జన్మస్థలం ఈ జిల్లా.
- ప్రముఖులు : సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్ తేజ, పేర్వారం జగన్నాథం, చుక్కా రామయ్య, పేర్వారం రాములు, అంపశయ్య నవీన్.
Mahbubabad District | మహబూబాబాద్ జిల్లా
- నిజాం కాలంలో ఈ ప్రాంతంలో అతి పెద్ద వృక్షాలు (మానులు) వుండటంతో మానుకోటగా, నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ పేరుమీద మహబూబాబాద్ అనే పేరు స్థిరపడింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతం వరంగల్ జిల్లా నుండి విభజించిన ప్రాంతం.
- దర్శనీయ ప్రదేశాలు : కురవి వీరభద్రస్వామి దేవాలయం (కురవి జాతర | వీరభద్రస్వామి జాతర)
- ప్రత్యేకతలు : గిరిజన జనాభా శాతం అధికంగా గల రెండవ జిల్లా.
- కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యానవన పరిశోధన కేంద్రం (మాల్యల) .
- రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పసుపు వ్యవసాయ మార్కెట్ (కేసముద్రం)
- దసరా రోజున జాతీయ జెండాను ఎగురేసే సాంప్రదాయం – గార్ల
- ప్రముఖులు : వద్దిరాజు సోదరులు (తొలి తెలుగు పత్రిక) (ఇనుగుర్తి)
- షోయాబుల్లాఖాన్ (ప్రముఖ నిజాం వ్యతిరేక జర్నలిస్టు)
- చక్రీ, (ప్రముఖ సంగీత దర్శకుడు)
- దాశరథి కృష్ణమాచార్య, రంగచార్యులు (గూడూరు), (నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన దాశరథి సోదరులు)
also read: RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం
- దక్షిణాది అయోధ్యగా పిలువబడే భద్రాద్రి సీతారామయ్య పేరు మీద ఏర్పాటు చేయబడిన జిల్లా, ఖమ్మం జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
- పరిశ్రమలు : స్పాంజ్ ఐరన్ యూనిట్ (పాల్వంచ) (అగ్నేయాసిలోనే మొదటిది)
- భారజల కర్మాగారం (మణుగూరు)
- కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (రాష్ట్రంలో అతి పెద్దది)
- భద్రాద్రి విద్యుత్ ఉత్పాదన కార్మాగారం (మణుగూరు)
- ముడి ఇనుము శుద్ధి కేంద్రం
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం (కొత్తగూడెం)
- ఐటీసీ పేపర్ బోర్డు & స్పెషాలిటీ పేపర్ డివిజన్ (సారపాక)
- నవభారత్ ఫెర్రో అల్లాయిస్.
దర్శనీయ ప్రదేశాలు :
- శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం (భద్రాచలం)
- పర్ణశాల (దుమ్ముగూడెం)
- కిన్నెరసాని అభయారణ్యం
- గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతం (అశ్వారావుపేట)
ప్రత్యేకతలు :
- వెంకటేశ్వరస్వామి దేవాలయం (అన్నపురెడ్డిపల్లి)
- కిన్నెరసాని ప్రాజెక్టు.
- విస్తీర్ణంపరంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా
- కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (రాష్ట్రంలో మొదటి మైనింగ్ కాలేజి ) (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్)
- రాష్ట్రంలో గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న జిల్లా.
- ప్రాంతీయ విమానాశ్రయం-కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్నారు
- ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంలో రాష్ట్రంలో తొలిస్థానంలో ఉంది
- ఆయిల్ ఫాం సాగులో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్న జిల్లా.
Khammam | ఖమ్మం
- పరిశ్రమలు – చక్కెర ఫ్యాక్టరీలు-నేలకొండపల్లి, కల్లూరు, ఉపరితల బొగ్గు గని-సత్తుపల్లి.
- దర్శనీయ ప్రదేశాలు : స్థంభాద్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం (ఖమ్మం)
- దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దది అయిన బౌద్ధ స్థూపం (నేలకొండపల్లి)
- ఖమ్మం ఖిల్లా • అతి పురాతన, వెంకటేశ్వరస్వామి ఆలయం (జమలాపురం)
- ప్రత్యేకతలు : ఇక్కడి గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
- ప్రముఖులు : వందేమాతరం శ్రీనివాసరావు, కె.దాశరథి
Nalgonda | నల్లగొండ
- పాతపేరు : నీలగిరి, నందికొండ
- ప్రాజెక్టులు – నాగార్జునాగర్, మూసీ ప్రాజెక్టు, డిండి ప్రాజెక్టు, ఉటుకూరు మారేపల్లి ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం), ఎస్సారెస్సీ కాలువ-2, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ
- పరిశ్రమలు : పెన్నా సిమెంట్ లిమిటెడ్ (దామరచెర్ల)
- ది ఇండియన్ సిమెంట్ లిమిటెడ్ (దామరచెర్ల) •
- నాట్కో పేరంటాల్స్ లిమిటెడ్ (పెద్దపూర) •
- డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ లిమిటెడ్ (త్రిపురారం)
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (దామరచెర్ల)
- పారాబాయిల్డ్ రైస్ పరిశ్రమలు (మిర్యాలగూడెం)
- చేనేత పరిశ్రమ (మునుగోడు, దేవరకొండ)
- రవాణ: NH-65 (NH-9 old), NH-565 నకిరేకల్-చిత్తూరు.
- ప్రత్యేకతలు : వీరనారి రుద్రమదేవి మరణశాసనం చందుపట్లలో దొరికింది.
- మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఈ జిల్లాలోనే ఉంది
- అత్యధిక మండలాలు గల జిల్లా (31 మండలాలు)
- విస్తీర్ణంపరంగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జిల్లా
- తెలంగాణ సాయుధ పోరాటం ఆవిర్భవించిన జిల్లా.
Surypet | సూర్యా పేట
- చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం – తెలంగాణ ప్రాంతంలో సూర్యకిరణాలు పడి మొదటి ప్రాంతం అయినందున ఈ ప్రాంతానికి భానుపురి అని తరువాత సూర్యాపేటగా స్థిరపడటం జరిగింది.
- నిజాం, రజాకార్ల వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కేంద్రం – సూర్యాపేట
- పరిశ్రమలు : దక్కన్ సిమెంట్ (నేరేడుచర్ల)
- కాకతీయ సిమెంట్ (మేళ్లచెరువు) • మైసమ్ సిమెంట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ (మేళ్లచెరువు) • కోరమాండల్ సిమెంట్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ (మేళ్లచెరువు) • సులెన్ లైఫ్ స్టెన్స్ లిమిటెడ్ (సూర్యాపేట) • సుధాకర్ పి.వి.సి. పైపులు (సూర్యా పేట) , కాకతీయ టెక్స్ టైల్స్ లిమిటెడ్ (కోదాడ)
- రవాణ – NH-65 పూణె, హైదరాబాద్, సూర్యాపేట, కోదాడ, విజయవాడ, మచిలీపట్నం.
- లింగమంతుల స్వామి ఆలయం (పెద్దగట్టు, దురాజ్ పల్లి గ్రామం, చివ్వెంల మండలం) (రాష్ట్రంలో రెండవ అతి పెద్ద జాతర)
- జాతరలు : 1. గొల్లగట్టు జాతర, 2. మేళ్ల చెరువు జాతర
- ప్రత్యేకతలు : గేట్ వే ఆఫ్ తెలంగాణ-సూర్యాపేట (నిజాంకాలంలో తెలంగాణకు ముఖ్య ద్వారంగా ఈ ప్రాంతం ఉండేది)
- సిమెంట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే జిల్లా. .
- ప్రముఖులు : ఆర్. విద్యాసాగర్ రావు, (జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి మండలం) – తెలంగాణ నీటి హక్కులపై పోరాడిన ఉద్యమవీరుడు, తెలంగాణ ప్రభుత్వరంగ నీటి పారుదల రంగ సలహాదారు, యు.ఎస్.ఓ.పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా వ్యహరించారు. రచనలు : నీళ్లు-నిజాలు, ప్లస్-మైనస్ , నటించిన చిత్రాలు:జైబోలో తెలంగాణ, దమ్ము.
Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి
- శ్రీయాద మహర్షి తపస్సు ఫలితంగా – కొండపైన 5 అవతారాలతో వెలిసిన నరసింహస్వామి పేరుమీద ఈ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగేది.
- నల్లగొండ జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
- పరిశ్రమలు : బీబీనగర్, భువనగిరి మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు
- పోచంపల్లి చేనేత పరిశ్రమ • కెమికల్, ఆటోమెటికల్, ఇనుము, ప్లాస్టిక్స్, ఎక్స్ ప్లోజిన్స్ శానిటరీ, క్రషర్, గ్లాస్ ఇండస్ట్రీ • సూర్యోదయ స్పిన్నింగ్ మిల్ (చౌటుప్పల్)
- దర్శనీయ ప్రదేశాలు : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం (రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం)
- కొలనుపాక జైన దేవాలయం (2000ఏళ్లనాటిది) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్వేతంబర జైన దేవాలయం ) • భువనగిరి కోట • సోమేశ్వరాలయం (కొలనుపాక) (800 ఏళ్ల క్రితం నాటిది).
- ప్రత్యేకతలు :నిజాం సంస్థానంలో స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికిన ఆంధ్ర మహాసభలు ఇక్కడే
ప్రారంభం అయినాయి. - భూదాన ఉద్యమం ఆవిర్భవించిన పోచంపల్లి ఈ జిల్లాలోనే ఉంది.
- రామానంద తీర్థ గ్రామీణ వివిధ శిక్షణ కేంద్రం – జలాల్ పూర్
- ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు.
- ప్రముఖులు: రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి & కమలాదేవి, బండి యాదగిరి
Nagar Karnuool | నాగర్‌కర్నూలు
- క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన వడ్డెమాన్ రాజు సామంతులు అయిన నాగన, కందనలు నాగనూలు మరియు కందనహాలు అనే గ్రామాలు నిర్మించారు. ఈ రెండు గ్రామాలను కలిపి నాగోలు సీమగా పిలిచేవారు. కాలక్రమంలో కందనవోలు నాగర్‌కర్నూలుగా మారింది.
- దాదాపు 100 సంవత్సరాల (1794-1904) క్రితం జిల్లాగా ఉన్న నాగర్ కర్నూలు మళ్లీ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి విభజించబడి జిల్లాగా ఆవిర్భవించింది.
- దర్శనీయ ప్రదేశాలు : నల్లమల అటవీ ప్రాంతం
- నది పడవ ప్రయాణం (సోమశిల-శ్రీశైలం) • మల్లెలతీర్థం జలపాతం (నల్లమల ఊటి)
- ప్రత్యేకతలు : దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్)
- జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ గల అక్కారం కుంకుడు కాయలు
- నల్లమల అటవీ ప్రాంతానికే పరిమితం అయిన ‘బిట్టుడుత
Also Read: Telangana Economy in Telugu
Jogulamba Gadwala | జోగులాంబ గద్వాల 
- కృష్ణా, తుంగభద్ర దోబ్ ప్రాంతంలో నలసోమ భూపాలుడిచే స్థాపించబడిన గద్వాల సంస్థానం దాదాపు 285 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
- ఇది నిజాం రాజ్యంలోను స్వతంత్ర సంస్థానంగా వెలుగొందింది.
- మహబూబ్ నగర్ జిల్లా నుంచి విభజించబడి ఏర్పాటు చేయబడిన జిల్లా.
- నదులు : కృష్ణా, తుంగభద్ర
- ప్రాజెక్టులు : • కృష్ణానదిపై రాష్ట్రంలో తొలి ప్రాజెక్ట్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (కుడికాలువ /నల్ల సోమనాథ కాలువ
- పరిశ్రమలు : గద్వాల చేనేత పరిశ్రమ
- పత్తి విత్తనోత్పత్తి డీలింగ్ పరిశ్రమలు (గద్వాల, అయిజ) • ఎస్.ఎస్.ఎస్. స్టార్చ్ పరిశ్రమ • పొట్టుతో విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమ (బీచుపల్లి)
- దర్శనీయ ప్రదేశాలు : జోగులాంబ ఆలయం (దక్షిణాన అష్టదశ శక్తిపీఠాల్లో 5వది)
- ప్రత్యేకతలు : . తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జిల్లాగా ప్రసిద్ధి పొందినది.
- అత్యంత ప్రసిద్ధి పొందిన కలిమిపూల దుప్పట్లు (అయిజ పట్టణం)
Mahbub Nagar | మహబూబ్ నగర్
- పాల ఉత్పత్తికి పేరుగాంచిన పాలమూరుగా మరియు రుక్కమ్మ పేటగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పేరుమీద ఈ ప్రాంతానికి 4వ డిసెంబర్ 1890లో ఆ పేరు వచ్చింది.
- ఈ ప్రాంతం చోళనడిగా ప్రసిద్ధి పొందింది.
- దర్శనీయ ప్రదేశాలు : 300 ఎకరాల్లో విస్తరించిన పిల్లలమర్రి
- ప్రత్యేకతలు: చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం (నారాయణ పేట)
- నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా – శామీర్ పేట్ (1998)
Vanaparthi | వనపర్తి
- వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి నూగూరు ప్రాంతంను రాజధానిగా చేసుకొని సంస్థానంను స్థాపించాడు.
- ఈయన తరువాత వచ్చిన మొదటి రామకృష్ణారెడ్డి రాజధానిని వనపర్తికి మార్చడంతో వనపర్తి సంస్థానంగా పేరు గాంచింది.
- ఈ సంస్థానం పేరుమీదనే మహబూబ్ నగర్ జిల్లా నుంచి విడదీసి వనపర్తి జిల్లాను ఏర్పాటు చేశారు.
- సరళాసాగర్ (ఆసియాలోనే గ్రెవన్ పద్ధతిలో నిర్మించిన 2వ ప్రాజెక్టు)
Ranga Reddy | రంగారెడ్డి
- రాష్ట్ర ఐ.టి. పరిశ్రమ కేంద్రీకృతమై ఉన్న జిల్లా
- పరిశ్రమలు : ఐటి పరిశ్రమ, ఫౌలీ పరిశ్రమ, హార్టికల్చర్, ఫార్మాసిటీ, కాటేదాన్, కొత్తూరు పారిశ్రామిక వాడలు, హార్డ్ వేర్ పార్క్-మహేశ్వరం, ఫార్మాసిటీ-కందుకూరు
- దర్శనీయ ప్రదేశాలు : చిలుకూరు బాలాజీ
- సంఘీ టెంపుల్ • కీసర గుట్ట
- రామోజీ ఫిలింసిటీ
- మృగవని జాతీయ పార్క్ (చిలుకూరు)
- ప్రత్యేకతలు :• ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (శంషాబాద్)
- రాష్ట్రంలో తొలి సైన్స్ సిటీని రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
- భారతీయ గ్రామీణ సంస్కృతికి, కళలకు ప్రతిరూపం – శిల్పారామం.
Vikarabad | వికారాబాద్
- గంగవరం అనే పేరు గల ఈ ప్రాంతంను పాలించిన వికారోద్దిన్ అనే నవాబు పేరుమీద వికారాబాద్ అనే పేరు వచ్చింది.
- రంగారెడ్డి జిల్లా నుంచి విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.
- దర్శనీయ ప్రదేశాలు : • అనంతగిరి కొండలు ,అనంత పద్మనాభస్వామి ఆలయం (1900 సంవత్సరాల పురాతనమైనది)
- ప్రత్యేకతలు : • మూసీనది జన్మస్థానం (అనంతగిరి కొండలు)
- దేశంలో 2వ అది పెద్ద ఐ.బి. శానిటోరియం (వికారాబాద్)
- బ్లూ లైమ్ స్టోన్, ఎల్లో లైమ్ స్టోన్లను ఉత్పత్తి చేసే ప్రధాన ఉత్పత్తి (తాండూరు)
- కందులకు అత్యంత ప్రసిద్ధి పొందిన ప్రాంతం (తాండూరు)
Also Read: Telangana Festivals & Jatharas
Medchal Malkaz Giri | మేడ్చల్ మల్కాజ్ గిరి
- మేడి చెలియె అనే పేరు కాలక్రమేణ మేడ్చల్ గా మారింది. (మేడ్చల్ అనగా ప్రకాశవంతమైన నగరం అని అర్థం)
- జిల్లా కేంద్రం – మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా నుంచి విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు)
- ఖనిజాలు : రోడ్ మెటల్, బ్లాక్ గ్రానైట్, క్వార్జ్, ఫెల్డ్ స్పార్, అమెథిస్ట్ – పరిశ్రమలు : ఉప్పల్, చర్లపల్లి, మల్లాపూర్, కుషాయిగూడ, జీడిమెట్ల పారిశ్రామిక వాడలు.
- ఫౌల్టీ పరిశ్రమ & హార్టికల్చర్ • ఇసిఐఎల్ , ఉప్పల్ ప్రత్యేక ఆర్థిక మండలం.
- దర్శనీయ ప్రదేశాలు: శ్రీరామలింగేశ్వరాలయం (కీసర గుట్ట) (కీసర జాతర)
- సంస్థలు: ఇ.సి.ఐ.ఎల్. • ఐ.ఐ.సి.టి. • సర్వే ఆఫ్ ఇండియా • దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, నేషనల్ లా యూనివర్సిటీ – శామీర్ పేట
- ప్రత్యేకతలు : హైదరాబాద్ మరియు ఉత్తర తెలంగాణ మధ్య అనుసంధాన పట్టణం (మేడ్చల్)
- రాష్ట్రంలో అత్యధిక జనాభా గల రెండవ జిల్లా
- ఇండస్ట్రీయల్ కారిడార్‌కు కేంద్ర బిందువు.
Medak | మెదక్
- పరిశ్రమలు : టాటా కాఫీ ఫ్యాక్టరీ శాంత బయోటెక్స్ (ముప్రిరెడ్డిపల్లి), మైక్రోసీడ్స్ (కాళ్లకల్), కావేరి ఐరన్ స్టీల్ (చెగుంట), దివ్య శక్తి గ్రానైట్స్ (నర్సాపూర్), తూప్రిన్, చిన్న శంకరంపేట, చేగుంట దాణ, విత్తన తయారీ పరిశ్రమలు
- దర్శనీయ ప్రదేశాలు : • ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం (ఏడుపాయల జాతర)
- మెదక్ చర్చి (మెదక్ జిల్లా)
- జైన మందిరం (కుల్చారం) (23వ తీర్థంకరుడు, పార్శనాథుడు ఏకశిలావిగ్రహం)
- పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు • నర్సాపూర్ అడవులు
- ప్రత్యేకతలు : ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద చర్చి (మెదక్ చర్చి)
Siddipet | సిద్ధిపేట
- సంకల్పసిద్ధి గల సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా నుంచి అధికభాగం, కరీంనగర్, వరంగల్ లోని కొన్ని ప్రాంతాలతో జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది.
- ఖనిజాలు – కలర్ గ్రానైట్, స్టోన్ మెటల్, క్వార్జ్, సాధారణ ఇసుక
- దర్శనీయ ప్రదేశాలు : • కొమరవెల్లి మల్లన్న , కోమటి చెరువు (సిద్ధిపేట)
- ప్రత్యేకతలు : రాష్ట్రంలోని తొలి ఎడ్యుకేషన్ హబ్ ను గజ్వేల్ లో ఏర్పాటు చేయనున్నారు.
- రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత గ్రామం – చింతమడక
- కొమురవెల్లి మల్లన్న జాతర, కొండపోచమ్మ జాతరలు (తీగల్ నర్సాపూర్) రాష్ట్రంలో సుదీర్ఘకాలం జరిగే జారతలు.
- సింగారయ జాతర (కొహెడ మండలం)
- ఇటీవల బయటపడిన ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు (అతి పెద్ద ప్రాచీన సమాది)(నర్మేట)
- నలుపు, ఎరుపు రంగు మట్టి పాత్రలు (పాలమాకుల) –
- ప్రముఖులు: • నందిని సిధారెడి, దేశపతి శ్రీనివాస్, వేముగంటి నర్సింహాచార్యులు, కాపు రాజయ్య (తెలంగాణ కుంచెకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తి).
also read: తెలంగాణ చరిత్ర – కాకతీయులు
Sangareddy | సంగారెడ్డి
- నిజాం కాలంలో మెదకను పాలించిన రాణి శంకరాంభ తనయుడు సంగా పేరుమీదుగా ఈ ప్రాంతానికి సంగారెడ్డి పేటగా, తరువాత కాలంలో సంగారెడ్డిగా స్థిరపడింది.
- పరిశ్రమలు : బి. హెచ్.ఇ.ఎల్. (మహారత్న కంపెనీ) , బి.ఒ.ఎల్
- ఆయుధాల కార్మాగారం (ఎద్దు మైలారం)
- జాతీయ పెట్టుబడుల ఉత్పాదక ప్రాంతం (నిమ్స్) – జహీరాబాద్
- పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతం • మహింద్ర & మహింద్రా
- ఎం.ఆర్.ఎఫ్.
- ప్రత్యేకతలు : ఎర్రరాతి కట్టడాలతో కూడిన జహీరాబాద్ డివిజన్ రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది.
- హైదరాబాద్ ఐఐఐ (కంది).
Adilabad | ఆదిలాబాద్
- రాష్ట్రానికి ఉత్తరపు అంచున ఉన్న జిల్లా.
- దర్శనీయ ప్రదేశాలు : రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం – కుంతల జలపాతం (నేరడిగొండ మండలం)
- నాగోబా దేవాలయం (నాగోబా జాతర) (కేస్లాపూర్)
- లక్ష్మీనారాయణ ఆలయం (జైనాథ్)
- పొచ్చెర (నెరడిగొండ మండలం), గాయత్రి (ఇచ్చోడ మండలం), కనకాయి (బజార్ హత్నూర్ మండలం) జలపాతాలు.
- ప్రత్యేకతలు : రాష్ట్రంలో అత్యధిక పత్తి పండించే రాష్ట్రం.
- తెలంగాణ కాశ్మీర్ గా ప్రసిద్ధి పొందిన ప్రాంతం (ఆదిలాబాద్)
- సహ్యద్రి పర్వత శ్రేణి (సాత్నాల) ఇక్కడి నుంచి ఆగ్నేయం వైపుగా 281 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. (ఈశ్రేణిలో ఎత్తైన శిఖరం మహబూబ్ ).
Read More About Adilabad District
Hyderabad | హైదరాబాద్
- మహమ్మద్ కులీకుతుబ్ షా 1591 ఎ.డి లో మూసినది ఒడ్డున భాగ్యనగరంను నిర్మించాడు. – – మెదక్ సుభాలో భాగంగా ఉన్న ఆత్రఫ్ – ఏ – బాల్టా జిల్లా నుండి భాగహత్ అనే తాలుకాను 1931-34లో పేరుకు ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు.
- 1948లో పోలీసు చర్య తర్వాత ఈ రెండు జిల్లాలను (Atraf-a-Balda & Baghat ) కలిపి హైద్రాబాద్ జిల్లాను ఏర్పాటుచేశారు.
- జిల్లా ప్రధాన కేంద్రం : హిమాయత్ నగర్ –
- సంస్థలు : CCMB – సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ – హబ్సీగూడ
- IICT – ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – హబ్సీగూడ
- CDFD – సెంటర్ ఫర్ డి.ఎన్.ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్ – నాంపల్లి
- దర్శనీరు ప్రదేశాలు : చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్, ఫలక్ నుమా ప్యాలెస్, తారామతి బరాదరి, బిర్లాటెంపుల్, బిర్లా ప్లానిటోరియం, సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్‌సాగర్, మహవీర్ హరిణి జాతీయ పార్కు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు
- దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ జెండా – సంజీవయ్య పార్క్ లో ఏర్పాటు చేశారు
- మెడికల్ టూరిజంకు ప్రపంచ హబ్ గా ఎదుగుతుంది.
- జాతరలు : 1. పెద్దమ్మ జాతర : జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి 2. మహంకాళీ జాతర : సికింద్రాబాద్
- ప్రత్యేకతలు : క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2015′ ప్రకారం ప్రపంచ వ్యాప్త సర్వేలో ముత్యాల నగరం హైద్రాబాద్ దేశంలోనే జీవించటానికి అత్యుత్తమ నగరంగా నిలిచింది. (ప్రపంచంలో 138వ స్థానంలో ఉంది)
- భూపరివేష్టిత జిల్లా
- రాష్ట్రంలో విస్తీర్ణంలో అతిచిన్న జిల్లా.
- పూర్తిగా పట్టణ జనాభాను కలిగి ఉన్న జిల్లా.
- దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం – సికింద్రాబాద్. .
- ఈశాన్య ఋతుపవనాల వలన అధికంగా వర్షం పొందే ప్రాంతం – హైద్రాబాద్.
- హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు అత్యుత్తమ ఇంజనీరింగ్ ఆవిష్కరణగా గుర్తింపు పొందింది
- రాష్ట్ర మానవాభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో గల జిల్లా,
- ప్రముఖ వ్యక్తులు : జాకీర్ హుస్సేన్, మహమ్మద్ అజారుద్దీన్, అందిటి తిరుపతిరాయుడు, సైనానెహ్వాల్, వంగవరపు వెంకట సాయి లక్ష్మణ్ (వి.వి.ఎస్.లక్ష్మణ్), శ్యాంబెనగల్, షబానా ఆజ్మీ, ఎక్కాయాదగిరి , పివి సింధు.
DOWNLOAD : తెలంగాణ జిల్లాల సమాచారం Pdf
********************************************************************************************

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |