APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.
$ 250 మిలియన్ ప్రాజెక్టులకై భారత ప్రభుత్వం & ప్రపంచ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి : ప్రపంచ బ్యాంకు, భారతదేశంలో 250 మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను దీర్ఘకాలిక డ్యామ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కోసం మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న డ్యామ్‌ల భద్రత మరియు పనితీరును మెరుగుపరచడానికి ఆమోదించింది. రెండవ Dam Rehabilitation and Improvement Project (DRIP-2) ఒప్పందం ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, కేంద్ర జల సంఘం మరియు పాల్గొనే 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల మధ్య సంతకం చేయబడింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) ద్వారా ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అమలు చేయబడుతుంది.
రాష్ట్ర స్థాయిలో, చత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో సుమారు 120 డ్యామ్‌లు చేపట్టబడతాయి. ప్రాజెక్ట్ అమలు సమయంలో ఇతర రాష్ట్రాలు లేదా ఏజెన్సీలు ప్రాజెక్టు కొరకు జోడించబడవచ్చు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్.
- ప్రపంచ బ్యాంకు నిర్మాణం: జూలై 1944.
- ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు: డేవిడ్ మాల్పాస్
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: