APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.
2021 హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా విడుదల
2021 హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా విడుదల : హురున్ గ్లోబల్ 500 అత్యంత విలువైన కంపెనీల జాబితా 2021 ప్రకారం ఆపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ (USD 2,443 బిలియన్). ప్రపంచంలోని అగ్ర ఆరు విలువైన కంపెనీలు ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, ఫేస్‌బుక్ మరియు టెన్సెంట్.
ప్రపంచవ్యాప్తంగా, 243 కంపెనీలతో US;తరువాత చైనా 47, జపాన్ 30 తో మూడవ స్థానంలో ఉంది మరియు UK 24 తో నాలుగో స్థానంలో ఉంది. 12 కంపెనీలతో భారతదేశం 9వ స్థానంలో ఉంది.
57వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (USD 188 బిలియన్) జాబితాలో అగ్రశ్రేణి భారతీయ కంపెనీ. విప్రో లిమిటెడ్, ఆసియన్ పెయింట్స్ లిమిటెడ్ మరియు HCL టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రపంచంలోని 500 అత్యంత విలువైన సంస్థల జాబితాలో చోటు దక్కించుకోగా, ITC లిమిటెడ్ 2021 కి గాను 12 భారతీయ కంపెనీలు హురున్ గ్లోబల్ 500 లో చోటు సంపాదించుకున్నాయి.
