APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.
“స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్” ను ప్రారంభించిన Facebook
“స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్” ను ప్రారంభించిన Facebook : ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ రుణ ప్లాట్‌ఫారమ్ Indifi (ఇండిఫై) భాగస్వామ్యంతో భారతదేశంలో “స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్” ను ప్రారంభించింది. ఫేస్‌బుక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి దేశం ఇండియా. ఈ చొరవ యొక్క లక్ష్యం స్వతంత్ర రుణ భాగస్వాముల ద్వారా క్రెడిట్/రుణాలు త్వరగా పొందడానికి Facebook లో ప్రకటన చేసే చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు (SMB లు) సహాయం చేయడం. ఇది వ్యాపార రుణాలను చిన్న వ్యాపారాలకు మరింత సులభంగా అందుబాటులోకి తెస్తుంది మరియు భారతదేశ MSME రంగంలో క్రెడిట్ అంతరాన్ని తగ్గిస్తుంది. ఇది భారతదేశంలోని 200 పట్టణాలు మరియు నగరాల్లో నమోదు చేయబడిన వ్యాపారాలకు అందుబాటులో ఉంటుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- Facebook స్థాపించబడింది: ఫిబ్రవరి 2004;
- Facebook CEO: మార్క్ జుకర్‌బర్గ్;
- Facebook ప్రధాన కార్యాలయం: కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్.