Telugu govt jobs   »   Andhra Pradesh History Satavahanas   »   Andhra Pradesh History Satavahanas

Andhra Pradesh History – Satavahanas Study material in Telugu, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర- శాతవాహనులు

Andhra Pradesh History – Satavahanas Study material in Telugu, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర- శాతవాహనులు: ఆంధ్రప్రదేశ్‌ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర(Andhra Pradesh History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను  అందిస్తుంది.

 

Andhra Pradesh History In Telugu (ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర తెలుగులో)

APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

Andhra Pradesh History - Satavahanas Study material in Telugu |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర- శాతవాహనులు

మూలపురుషుడు శాతవాహనుడు
స్థాపకుడు రాజధాని సిముఖుడు
రాజ భాష 1) ధాన్యకటకం2) పైఠాన్ ప్రతిష్టానపురం
 రాజలాంచనం సూర్యుడు
మతం జైనం , హైందవం
అధికార భాష ప్రాకృతం

శాతవాహనులు – శాసనాలు:

నానాఘాట్ శాసనం నాగానిక (మొదటి శాతకర్ణి గురించి)
 నాసిక్ శాసనం గౌతమీ బాలశ్రీ (గౌతమీపుత్ర శాతకర్ణి గురించి)
 మ్యాకధోనీ శాసనం మూడవ పులోమావి (శాతవాహన వంశ పతనం గురించి)
 జునాగఢ్/గిర్నార్ రుద్రదాముడు (మొదటి సంస్కృత శాసనం)
 హాతిగుంఫ శాసనం ఖారవేలుడు
ఎర్రగుడి శాసనం (కర్నూలు) అశోకుడు

 

శాతవాహన పాలకులు, వారి రాజకీయ చరిత్ర

శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వైదిక మతస్తులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా, శాతవాహన అనేది వంశ నామం. శాతవాహనుల పాలన శ్రీముఖుడితో ప్రారంభం కాగా, చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో వంశం అంతరించింది.

1. శ్రీ ముఖుడు :

 • శాతవాహన రాజ్య స్థాపకుడు
 • ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు
 • ఇతని తండ్రి శాతవాహనుడు
 • ఇతడిని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణుపురాణం బలిపుచ్చక అని, మత్స్యపురాణం సిమకుడు అని, ‘భాగవత పురాణం’ బలి అని పేర్కొంటున్నాయి.
 • ఇతని నాణేలు ‘శాద్వాహణ’ పేరుతో ముద్రించిన నాణేలు కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల, మెదక్‌ జిల్లాలోని కొండాపూర్‌ ప్రాంతాల్లో లభించాయి

2. కృష్ణుడు (కణ్పడు) : 

 • శ్రీముఖుడి అనంతరం అతడి సోదరుడు కన్హ రాజ్యానికి వచ్చాడు.
 • కచేరి, నాసిక్ గుహలను తవ్వించాడు.
 • నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు “ధర్మ మహామాత్య” అనే అధికారులను నియమించారు.
 • కస్హేరి గుహాలయాలు నిర్మించాడు.
 • మాళ్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి ఇతడే.
 • ఇతని కాలంలోనే భాగవత మతం దక్కణ్ లో ప్రవేశించింది.

3. శాతకర్ణి -1 

 • శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు.
 • మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణాలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు.
 •  మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి
 • వైదిక యజ్ఞ యాగాలు నిర్వహించిన మొదటి రాజు – శాతకర్ణి-I
 • ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.

4. శాతకర్ణి-2 

 • ఇతను ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువకాలం అంటే 56 సంవత్సరాలు
  పాలించిన శాతవాహన చక్రవర్తి రెందో శాతకర్ణి.
 • ఇతను సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. ఇతని శాసనం సాంచి (విదిశ దగ్గర)లో లభించింది.
 • భిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహనరాజు రెందో శాతకర్ణే.
 • ఇతని ఆస్థాన కళాకారుడు – వశిష్టపుత్ర ఆనంద.

5. కుంతల శాతకర్ణి :

 • ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా మారింది. (అప్పటి వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది)
 • ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారని పేర్కొంటారు.
 • శర్వవర్మ-కాతంత్ర వ్యాకరణం (సంస్కృత వ్యాకరణ గ్రంధం)
 • గుణాఢ్యుడి-బృహత్కథ (పైశాచిక భాష) విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైనది.
 • శర్వవర్మ, గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గూర్చి వివరించిన గ్రంథం సోమదేవుడి “కథాసరిత్సాగరం •
 • కుంతల శాతకర్ణి భార్య “మలయావతి” కరిర్త అనే కామక్రీడ వలన మరణించింది.

6. హాలుడు :

 • ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు.
 • శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథాసప్తశతి (సట్టసి) అనే గ్రంథాన్ని రచించాడు.
 • తన సాహిత్యం వల్ల హాలుడు కవివత్సలుడు అనే బిరుదు పొందాడు.
 • ఈ ఇతను ప్రాకృతంలో గాధా సప్తశతి (మహారాష్ట్ర ప్రాకృతం) ని సంకలనం చేశాడు.
 • ఇతను శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడు.
 • ఈ వివహం పై కుతూహలుడు లీలావతి పరిణయం (ప్రాకృతం) రంగాన్ని రచించారు.

శాతవాహనులు -గౌతమీపుత్ర శాతకర్ణి 

 1. శాతవాహనుల్లో అతి గొప్పవాడు.
 2. ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం (క్రీ.శ.78) ప్రారంభమైంది.
 3. 1957 నుండి క్రీ.శ 78 వ సం||ను భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తున్నది.
 4. శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు “యాదవ రామచంద్ర దేవుడు” (దేవగిరి రాజు).
 5. ఇతని గొప్పతనం గూర్చి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన – నాసిక్ శాసనం తెలియజేస్తుంది.
 6. ఇతను నహపానుడి వెండి నాణాలను తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు. ఈ నాణాలు “కడలూరు” (జోగల తంబి)లో కనుగొనబడ్డాయి.
 7. ఇతను వైదిక సంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు.
 8. బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేశాడు.
 9. బౌద్ధ శాఖ అయిన భద్రనేయ అనే శాఖకు నాసిక్ లో గుహలను ఇచ్చాడు.
 10. ఇతని నాణెములు కొండాపూర్, పెదబంకూరులలో పెద్దసంఖ్యలో లభించాయి.
 11. శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే.
 12. గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది.
 13. తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు ఇతడే.

పులోమావి-2 (వశిష్ట పుత్ర పులోమావి):

 • ఇతడిని దక్షిణా పథేశ్వరుడుగా పేర్కొనడమైంది. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది.
 • ఇతని కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని (ప్రాకృతం) వేయించింది.
 • ఇతని కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగింది.
 • ఇతని కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది.
 • ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు.
 • ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే

యజ్ఞశ్రీ శాతకర్ణి :

 1. శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు.
 2. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది.
 3. ఇతను నాగార్జునునికి శ్రీపర్వతం (నాగార్జున కొండ)పై పారావత విహారం నిర్మించాడు.
 4. రెండు తెరచాపల నౌక బొమ్మ గల నాణాలు ముద్రించాడు.  ( ప్రారంభించింది పులోమావి-2)
 5. బాణుడు హర్ష చరిత్రలో ఇతనిని “త్రిసముద్రా ధీశ్వరుడు” అని పేర్కొన్నాడు.
 6. యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం (ప్రకాశం) శాసనాన్ని వేయించాడు. *
 7. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ ‘సుహృల్లేఖ”ను రచించాడు.

మూడవ పులోమావి: 

 • ఇతను చివరి శాతవాహన చక్రవర్తి
 • ఇతని సేనాపతి అయిన శ్రీశాంత మూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి
 • అక్కడ నుండి కొంతకాలం పాలించాడు. ఇతను బళ్ళారిలో ‘మ్యాకదోని శాసనాన్ని‘ వేయించాడు. *
 • మ్యాకదోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తుంది.

శాతవాహనుల పాలనాంశాలు:

 • శాతవాహనుల కాలంనాటి పాలనా విశేషాలను ఉన్నాఘర్‌ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాలనే అనుసరించారు.
 • కౌటిల్యుని అర్థశాస్త్ర, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామిక, వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు.
 • శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు ) విషయాలు (జిల్లాలు), గ్రామాలుగా విభజించారు.
 • సామంతరాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు.
 •  విషయం (జిల్లా) అధిపతిని విషయపతి అని, గ్రామ అధిపతిని గ్రామిఖ/ గ్రామణి అని పిలిచేవారు.

శాతవాహనుల కాలంలోని రచనలు – రచయితలు

 • గాథాసప్తశతి (ప్రాకృత భాషలో) – హాలుడు
 • బృహత్‌ కథ (పైశాచిక ప్రాకృత భాషలో) – గుణాఢ్యుడు
 •  లీలావతి (ప్రాకృత భాషలో) –  కుతూహలుడు
 •  కాతంత్ర వ్యాకరణం (సంస్కృత భాషలో) –  శర్వవర్మ
 •  సుహృల్లేఖ, రససిద్దాంతం/ రసమంజరి, ప్రజ్ఞా పారమితశాస్త్ర , ఆరోగ్యమంజరి, రత్నావళి రాజపరి కథ (సంస్కృత భాషలో)  – ఆచార్యనాగార్జునుడు

**************************************************************************

Andhra Pradesh History - Satavahanas Study material in Telugu |_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Andhra Pradesh History - Satavahanas Study material in Telugu |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Andhra Pradesh History - Satavahanas Study material in Telugu |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.