ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – కాకతీయులు
కాకతీయ రాజవంశం 10వ శతాబ్దం AD నుండి 14వ శతాబ్దం AD మొదటి త్రైమాసికం వరకు పాలించారు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పాలించారు, ఇందులో ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.కాకతీయ రాజవంశం స్థానిక తెలుగు రాజవంశం. “కాకతీయ” అనే పేరు కాకతి అని పిలువబడే మాతృ దేవత దుర్గా నుండి వచ్చింది. ఈ వ్యాసంలో మేము కాకతీయ రాజవంశం యొక్క పూర్తి వివరాలను అందిస్తున్నాము. కాకతీయ రాజవంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వ్యాసం పూర్తిగా చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Kakatiyas | కాకతీయులు
- కాకతీయుల తొలి ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్హవుడి మాగల్లు శాసనం (క్రీశ. 950)లో ఉంది.
- ఇది గుండియ – ఎరియ – కాకర్త్య గుండనల గురించి వివరిస్తుంది. గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ బయ్యారం చెరువుశాసనం వెన్న భూపతి వంశీయులే కాకతీయులని పేర్కొంటుంది.
- కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, తర్వాత కల్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారు. రాష్టకూటులది గరుడకేతనం. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. కాకతీయులు కల్యాణి చాళుక్యుల వరాహ లాంఛనాన్ని స్వీకరించారు.
- కాకతి అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులు అయ్యారు. కాకతి అంటే కూష్మాండం/ గుమ్మడి అనే అర్థం కూడా ఉంది. 22వ తీర్థంకరుడైన నేమినాథుడి శాసనాధికారిణి పేరు కూష్మాండిణి.
- కాకతీయులు మొదట జైనులు కాబట్టి కూష్మాండి దేవతను కూడా పూజించారు. ఆంధ్రరాజులగా కీర్తి నొందారు.
- కాకతి వంశ ప్రతిష్టకు పునాది వేసింది మొదటి బేతరాజు.
- ఇతడికి కాకతి పురాధినాథ అనే బిరుదు ఉంది. మొదటి ప్రోలరాజుకు కాకతి వల్లభ అనే బిరుదుంది.
- సిద్దేశ్వర చరిత్ర గ్రంథంలో కాకతీయ మూలపురుషుడు మాధవవర్మఅని ఉంది.
- కాకతీయుల కాలంలో చేబ్రోలును మహాసేనం అని, అనుమకొండనురుద్రేశ్వరం అని పిలిచేవారు.
- కాకతీయులను ఆంధ్రదేశాధీశ్వరులు, మహామండలేశ్వరులు, స్వయంభూ దేవతారాధకులు అని పిలుస్తారు. రట్టడి (గ్రామపెద్ద) పదవితో వీరి రాజకీయ ప్రస్థానం మొదలైంది.
First Beta Raju :మొదటి బేతరాజు (క్రీ.శ. 992 – 1052)
- కాకతీపురాధినాథ బిరుదాకింతుడు.
- ఇతడు వేయించిన శనిగరం శాసనం ద్వారా సెబ్బిమండలం (కరీంనగర్)లో కొంత భాగం ఇతడి పాలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
- బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు. మొదటి బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్ల జైనాలయాన్ని పునర్ నిర్మించాడు.
First Prolaraja : మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052 – 1076)
- ఇతడు అరికేసరి/ అరిగజకేసరి బిరుదు పొందాడు.
- ఓరుగల్లు సమీపంలో కేసరి తటాకాన్నితవ్వించాడు. చాళుక్య మొదటి సోమేశ్వరుడికి కొప్పం యుద్ధంలో సహకరించి అతడి నుంచి అనుమకొండ ప్రాంతాన్ని పొందాడు.
Second Betaraja : రెండో బేతరాజు (1076 – 1108)
- త్రిభువనమల్ల, విక్రమచక్ర రెండో బేతరాజు బిరుదులు. మంత్రి వైజదండాధిపుడు.
- మొదటి బేతరాజునిర్మించిన బేతెశ్వరాలయానికి దుర్గరాజు రామేశ్వర పండితుడి పేరుమీద దానధర్మాలు చేసినట్లుఖాజీపేట దర్గాశాసనం తెలుపుతోంది.
Second Prolaraja : రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116 – 1157)
- మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు రెండో ప్రోలరాజు.
- ఇతడు ఓరుగల్లు పట్టణ నిర్మాణం ప్రారంభించాడు. అందులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు.
- మహామండలేశ్వర బిరుదుతో పాలించాడు. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటాడు.
- అనుమకొండలో పద్మాక్షి సిద్దేశ్వర, కేశవ ఆలయాలను నిర్మించాడు.
- ఓరుగల్లును క్రీడాభిరామంగ్రంథం ఆంధ్రనగరి అని పేర్కొంది. దీన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు.
- రెందో ప్రోలరాజు కాలం నుంచే వరాహం అధికార చిహ్నమైంది.
Rudra Deva/ First Prataparudra: రుద్రదేవుడు/ మొదటి ప్రతాపరుద్రుడు (1157 – 1195)
- స్వతంత్ర కాకతీయ రాజ్యస్టాపకుడు.
- ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు. వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
- కాలచూరి బిజ్జలుడు ఇతడి చేతిలో ఓడినట్లు బిజ్జలుని లక్ష్మీశ్వరశాసనం తెలుపుతోంది.
- త్రిపురాంతకం శాసనాన్ని 1185లో వేయించాడు.
- 1186లో ద్రాకారామ శాసనంవేయించాడు.
- ఇతడి కాలంలోనే శైవ – జైన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి.
- రుద్రుడు అనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు.
- రుద్రుడి మంత్రి గంగాధరుడు బుద్ధదేవుడిఆలయం నిర్మించాడు.
- రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు.
- రుద్రదేవుడికి విద్యాభూషణం అనే బిరుదు ఉంది.
- తోలు బొమ్మలాట అభివృద్ధి గురించి పేర్కొన్న గ్రంథం – ప్రతాపరుద్రీయం.
Mahadev : మహదేవుడు (11905 – 11009)
- శైవ మతాభిమాని. ఇతడి గురువు ధృవేశ్వర పండితుడు.
- ప్రతాపరుద్రుడి ఖండవల్లి శాసనంప్రకారం రుద్రదేవుడే మహాదేవుడికి రాజ్యం అప్పగించాడు.
- అతి తక్కువ కాలం పాలించిన పాలకుడు ఇతడే.
Ganapathi Devudu : గణపతిదేవుడు (1190 – 1262)
- అతి ఎక్కువ కాలం పాలించిన వ్యక్తి.
- తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఏకం చేసి పాలించిన కాకతీయ రాజు.
- జైతుగి కుమారుడు సింఘనకు తెలుగు రాయస్థాపనాచార్య అనే బిరుదు ఉంది.
- గణపతి దేవుడి గురువు విశ్వేశ్వర శంభు.
- రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య,కాకతీయరాజ్య భారధేరేయ అనే బిరుదులు ఉన్నాయి.
- 11009 నాటి గణపతి దేవుడి మంథెనశాసనంలో అతడి బిరుదు సకలదేశ ప్రతిష్టాపనాచార్య.
- గణపతి దేవుడికి పృథ్వీశ్వర శిరకందుక క్రీడావినోద అనే బిరుదు కూడా ఉంది.
- అతడు 124లో రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్లుకు మార్చాడు.
- కుమార్తెలు రుద్రమదేవిని నిడదవోలు – వీరభద్రుడికి, గణపాంబను కోట పాలకుడు బేతరాజుకు ఇచ్చి వివాహాలు చేశాడు.
- బమ్మెర పోతన (ఒంటిమిట్ట – కడప) ఇతడి కాలం వాడే.
- గణపతి దేవుడికి చోడకటక చూరకార బిరుదు కూడా ఉంది.
- రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప గణపతి దేవుడు అభయశాసనం, మోటుపల్లి శాసనాలు వేయించాడు. నాటి మోటుపల్లి పాలకుడు సిద్దయ దేవుడు.
- గణపతి దేవుడు వరంగల్లులో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. మోటుపల్లి, అభయ శాసనాలు వేయించాడు.
Rudrama devi : రుద్రమదేవి (1262 – 12809)
- ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి మహిళ.
- శాసనాల్లో రుద్రదేవమహారాజు, రాయగజకేసరి లాంటి బిరుదులతో ఈమెను ప్రస్తావించారు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కరోధృతి/ పట్లో ధృతిగావర్ణిస్తుంది.
- రుద్రమ సేనాని రేచర్ల ప్రసాదిత్యుడికి రాయపితామహాక, కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదులు ఉన్నాయి.
- ఓరుగల్లు కోట లోపల మెట్లు కట్టించింది.
- హేమాద్రి తన వ్రతఖండం గ్రంథంలో రుద్రమదేవిని ఆంధ్రమహారాణి అని పేర్కొన్నాడు.
- బీదర్‌కోట శిలాశాసనంలో రాయగజకేసరి బిరుదును ప్రస్తావించడమైంది.
The Second Prataparudra: రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)
- చివరి కాకతీయ రాజు. ఇతడు రుద్రమ కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడు.
- రాజ్యాన్ని 77 నాయంకరాలుగా విభజించాడు.
- 1323లో ప్రతాపరుద్రుడిని ఖాదర్‌ఖాన్ దిల్లీకి తీసుకుపోతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఆంధ్రనగరి లేదా ఓరుగల్లును సుల్తాన్‌పూర్‌గా పేరు మార్చారు.
- వరంగల్‌లో బుర్హనుద్దీన్‌ను పాలకుడిగా నియమించారు. వరంగల్ పోలిస్ కమిషనర్ గన్నమనాయుడు తుగ్గక్‌ల ఆస్థానంలో ఉప ప్రధాని (మాలిక్ మక్చూల్)గా పనిచేశాడు. ఇతడు తెలంగాణ బ్రాహ్మణుడు.
Rule of Kakatiyas | కాకతీయుల పాలన
- బద్దెన – నీతిశాస్త్ర ముక్తావళి, శివదేవయ్య – పురుషార్ధసారం, మొదటి ప్రతాపరుద్రుడు నీతిసారం, మడికిసింగన – సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు కాకతీయుల పాలనా విశేషాలను వివరిస్తాయి.
- రాచరికం సప్తాంగ సమన్వితం. మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. 18 మంది తీర్థుల గురించి సకలనీతి సమ్మతం పేర్కొంటోంది.
- కాకతీయులు మహామండలేశ్వర బిరుదు ధరించారు
- రాజ్యాన్ని నాడులు – స్థలాలు – గ్రామాలుగా విభజించారు. నాడులకు సీమ, పాడి, భూమి అనే పర్యాయ పదాలున్నాయి.
- రాచపొలం, నీరుపొలం, వెలిపొలం, తోటపొలం అని భూములను వర్గీకరించేవారు.
- వడ్రంగులను తక్షక అనేవారు.
- రేవు పట్టణాలను కర పట్టణాలు అనేవారు. పన్నులు వసూలు చేసే స్థలాలను ఘట్టాలు అని పిలిచేవారు.
- ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు.
Financial conditions | ఆర్థిక పరిస్థితులు
- వ్యవసాయం ప్రధాన వృత్తి.
- మొదటి ప్రోలరాజు కేసరి సరస్సును, రేచర్ల రుద్రుడు పాకాల చెరువును తవ్వించారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించేవారు.
- కందిపప్పు వాడకంలో లేదు.
- ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖమల్ వస్త్రాలునేసేవారు.
- త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని బ్రహ్మనాయుడు ఎత్తించినట్లు పల్నాటి వీరచరిత్ర పేర్కొంటోంది.
- ఆదిలాబాద్ జిల్లా కూనసముద్రం కత్తులకు ప్రసిద్ది.
- మోటుపల్లి (ప్రకాశం), కృష్ణపట్నం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మైసోలియా లాంటి రేవు పట్టణాల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది.
- నాటి నాణేలన్నింటిలో పెద్దది గద్యాణం. ఇది బంగారు నాణెం. దీన్ని నిష్క లేదా మాడ అని కూడా పిలిచేవారు.
- రూక అనేది వెండి నాణెం. ఒక మాడకు పది రూకలు అని బాపట్ల శాసనం పేర్కొంది. రూకలో విభాగాలైన అడ్డుగ, పాదిక, వీస, చిన్నం అనే నాణేలు ఉండేవి.
Religious social conditions | మత సాంఘిక పరిస్థితులు
- కాకతీయులు మొదట జైన మతాన్ని అనుసరించారు.
- రెందో ప్రోలరాజు హనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్ధనతో ప్రారంభమవుతుంది. కానీ రెండో బేతరాజు, దుర్గరాజులు రామేశ్వర పండితుడి (శ్రీశైల మరఠాధిపతి)ని గురువుగా భావించారు. నాడు ఆలంపురం గొప్ప కాళాముఖ శైవ క్షేత్రం.
- ఆంధ్రలోని ప్రసిద్ధ గోళకీ మఠ కేంద్రం మందడం. వైష్ణవం కూడా ఆదరణకు నోచుకుంది. శ్రీకూర్మం, శ్రీకాకుళం, తిరుపతి, మంగళగిరి, సింహాచలం నాటి ప్రసిద్ద వైష్ణవ క్షేత్రాలు.
- రామానుజాచార్యులు శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చినట్లు శ్రీపతి భాష్యం తెలుపుతోంది.
- విశ్వేశ్వర శివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పాడు.
- రుద్రదేవుడి కాలం నుంచే కాకతీయులు వైదిక మతాభిమానులు అయ్యారు.
- అరిగాపులు అంటే పన్ను కట్టాల్సిన రైతులు. కొలగాండ్రు అంటే పన్ను వసూలు చేసేవారు.
- పట్టప హుండీ – ధన రూపంలో విధించే పన్ను, పట్టు కొలచు – ధాన్య రూపంలో విధించే పన్ను.
Taxes | పన్నులు
- దర్శనం – రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అప్పణం – రాజు అకారణంగా వేసేది.ఉపకృతి – యువరాజు ఖర్చుల కోసం చెల్లించే పన్ను. అడ్డు సుంకం – యాదవ వర్గాలపై పన్ను. కాకతీయుల కాలంలో పన్ను 1/6 వ వంతు. రాజన్నశాలి అనేది ఒక వరి వంగడం.
- మాడ అనే బంగారు నాణేన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.
Language – Literature | భాష – సాహిత్యాలు
- కాకతీయుల అధికార భాష సంస్కృతం. విద్యామంటపాలను ఏర్పాటు చేశారు.
- మందడం వేద పాఠశాలను విశ్వేశ్వర శివుడు నిర్మించాడు.
- పాకాల శాసన రచయిత కవి చక్రవర్తి గణపతిదేవుడి ఆస్టాన కవి.
- రుద్రదేవుడు నీతిసారంను రచించాడు.
- ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని అగస్తుడు నలకీర్తి కౌముది, బాలభారత మహాకావ్యం, కృష్ణచరిత మొదలైన గ్రంథాలు రాశాడు.
- మరో కవి శాకల్య మల్లుభట్లు ఉత్తర రాఘవకావ్య, నిరోష్ట్య రామాయణం లాంటి కావ్యాలు రాశాడు.
- విద్దనాచార్యులు ప్రమేయచర్చామృతం గ్రంథాన్ని రాశాడు.
- గంగయభట్టు శ్రీహర్షుడి ఖండన ఖండ ఖాద్య గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు.
- ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యకోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
- అప్పయార్యుడుజైనేంద్ర కళ్యాణాభ్యుదయం కావ్యాన్ని రాశాడు.
- మల్లికార్జున పండితుడు శివతత్వసారం రచించాడు.
- యధాహక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు.
- శివదేవయ్య శివదేవధీమణి మకుటంతో శతకాన్ని రచించాడు.
- పాల్కురికి సోమనాథుడు (పాలకుర్తి ) పండితారాధ్య చరిత్ర, బసవపురాణం గ్రంథాలను రాశాడు. అనుభవసారం అనే పద్య కావ్యాన్నివృషాధిప శతకాన్ని కూడా రచించాడు. సంస్కృతంలో రుద్రభాష్యం రచించాడు.
- హుళక్కి భాస్కరుడు భాస్కర రామాయణం రచించాడు.
- మూలఘటిక కేతన దశకుమార చరిత్రను తెనిగించాడు.
- అభినవ దండిగా పేరొందిన కేతన రచనయే తెలుగులో మొదటి కథాకావ్యంగా ప్రసిద్ది.
- తిక్కన సోమయాజి కృష్ణ శతకాన్ని, బద్దెన నీతి శతకాన్ని (సుమతీ శతకం) రచించారు.
- యాజ్ఞవల్కుుడి ధర్మశాస్త్రాన్ని కేతన విజ్ఞానేశ్వరీయం పేరుతో అనువదించాడు.
- ఆంధ్రభాషా భూషణం గ్రంథం ద్వారా తెలుగు భాషా శాస్త్రానికి పునాదులు వేశాడు.
- క్షేమేంద్రుడు ముద్రామాత్యం, శివదేవయ్య పురుషార్ధసారం, ఆంధ్రభోజుడు (అప్పనమంత్రి) నితిభూషణం గ్రంథాలను రచించారు.
- భోజకవి (భోజుడు) చారుచర్య అనే వైద్య గ్రంథాన్ని రచించాడు.
- గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణం రచించాడు.
Architectural structures | వాస్తు నిర్మాణాలు
- దేశ రక్షణలో దుర్గాలకు ప్రాముఖ్యం ఉంది.
- మూడు రక్షణ శ్రేణులతో (పుట్టకోట, మట్టికోట, అగడ్త రాతికోట) ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించారు.
- ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రాతికోటలో 77 బురుజులు ఉండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో మెట్లను నిర్మించారు.
- ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్దేశ్వర, పద్మాక్షి ఆలయాలు; ఓరుగల్లులో స్వయంభూ, కేశవ ఆలయాలను నిర్మించారు.
- 1162లో కాకతి రుద్రుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడి (త్రికూటాలయం)ని నిర్మించాడు. రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవులే త్రికూటాధిపతులు.
- గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమర్రి, కొండపర్తి, నాగులపాడు మొదలైన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించారు.
- పాలంపేట రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు.
- ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల గృహాలు ఉన్నాయి.
- మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వయంభూ దేవుడి విగ్రహం దిల్లీ మ్యూజియంలో ఉంది. హనుమకొండలో నంది విగ్రహం ప్రసిద్ధి చెందింది.
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – కాకతీయులు PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |