Telugu govt jobs   »   Study Material   »   Andhra Pradesh History Ikshvakulu

Andhra Pradesh History Study Notes – Ikshvakulu, Download PDF For APPSC Group 2 Mains | ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – ఇక్ష్వాకులు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర- ఇక్ష్వాకులు

ఇక్ష్వాకులు : ఇక్ష్వాకులను విజయపురిలోని ఆంధ్ర ఇక్ష్వాకులు లేదా ఇక్ష్వాకులు అని కూడా సూచిస్తారు. ఇక్ష్వాకు రాజవంశం భారతదేశంలోని తూర్పు కృష్ణ నది లోయలో, వారి రాజధాని నుండి విజయపురి వద్ద (ఆంధ్రప్రదేశ్‌లోని ఆధునిక నాగర్జునకోండ) పరిపాలించింది. ఇక్ష్వాకులు  శాతవాహనుల తర్వాత వచ్చారు మరియు 3వ మరియు 4వ శతాబ్దాలలో ఒక శతాబ్దానికి పైగా పాలించారు. ఈ వ్యాసంలో మేము ఇక్ష్వాకులకు  పూర్తి వివరాలను అందిస్తున్నాము. ఇక్ష్వాకు వంశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

ఇక్ష్వాకులు

శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, విష్ణుకుండినుల రాజవంశాలు పాలించాయి. వీరి కాలంలో ఆంధ్రదేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఎంతో అభివృద్ది చెందింది.

ఇక్వాకులు (క్రీ.శ. 225 – ౩00)

  • ఆంధ్ర దేశాన్ని పాలించిన తొలి క్షత్రియులు ఇక్వాకులు. మొదటి శాంతమూలుడు (వాళిష్టీ శ్రీ డాంతామూలుడు) ఇక్వాక రాజ్యస్థాపకుడు. వీరి రాజధాని విజయపురి.
  • అధికార భాష ప్రాకృతం. అధికార చిహ్నం సింహం
  • పురాణాల్లో ఇక్వాకులను శ్రీపర్వతీయులు, ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నారు.
  • వాయుపురాణం ప్రకారం అయోధ్యను పాలించిన ఇక్వాకుడి కుమారుడు వికుక్షి, తండ్రి తర్వాత పాలకుడయ్యాడు. విష్ణుపురాణంలో ఇక్వాకులను బుద్ధుడి వారసులుగా పేర్కొన్నారు.
స్థాపకుడు  వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
చిహ్నం సింహం
రాజలాంఛనం హారతీ పుత్రులు / శ్రీ పర్వతీయులుగా ప్రసిద్ధి
రాజధాని విజయపురి
 రాజభాష ప్రాకృతం
మతం వైష్ణవం, బౌద్ధమతం
 శాసనాలు నా గార్జున కొండ ,అమరావతి
శిల్పకళ ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మందాత శిల్పం  (జగ్గయ్యపేట)
గొప్పవాడు వీరపురుష దత్తుడు
చివరివాడు రుద్రపురుష దత్తుడు

ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు

1.శాసనాధారాలు : 

  • మత్స్యపురాణం ప్రకారం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పరిపాలించారు
  • జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనాల ప్రకారం నలుగురు ఇక్ష్వాకు రాజులు మాత్రమే పాలించారు.
  • నాగార్జునకొండ శాసనం ప్రకారం వాశిష్టపుత్ర శాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు.
  • శాతవాహనులకు సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని వీరపురుషదత్తుని యొక్క అల్లూరి శాసనం పేర్కొంటుంది.
  •  ఇక్ష్వాకు వంశ చివరి రాజు రుద్రపురుషదత్తున్ని పల్లవ వంశస్థాపకుడు సింహవర్మ ఓడించాడు అని మంచికల్లు శాసనం పేర్కొంటుంది.
  • ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొంటున్న శాసనాలు
  1. మైదవోలు శాసనం
  2. మంచికల్లు శాసనం

2. పురాణాలు :

  •  మత్స్యపురాణం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పాలించారని పేర్కొంటుంది.
  • ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని, ఆంధ్రభృత్యులు అని మత్స్యపురాణం పేర్కొంది.
  • ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారని విష్ణుపురాణం పేర్కొంటుంది.

3.సాహిత్య ఆధారాలు:

  • ధర్మామృతం (జైనకావ్యం, కన్నడ గ్రంథం) .
  • దీనిని న్యాయసేనుడు 11వ శతాబ్దంలో రచించాడు.

4. వంశం: 

  • ఇక్ష్వాకులు తాము బుద్దుని (శాక్యముని) వంశానికి చెందిన వారమని నాగార్జునకొండ శాసనంలో ప్రకటించుకున్నారు.
  • విష్ణుపురాణం, జైనధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారు.

ఇక్ష్వాకు పాలకులు

1) వాశిష్టపుత్ర శ్రీశాంతమూలుడు

  • శాతవాహన చివరి పాలకుడైన 3వ పులోమావిని పారద్రోలి ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు.
  • ఇతడు మహారాజ బిరుదు ధరించాడు
  • లక్ష నాగళ్లతో భూమిని దున్ని శతసహస్ర హాలక బిరుదును కూడా పొందాడు
  • ఇతను వ్యవసాయాభివృద్ధికి గోవులను, నాగళ్ళను, భూమిని దానం చేశాడు.
  • ఇతను వైదిక మతం, పౌరాణిక మతాలను ఆదరించాడు.
  • ఇతను కార్తికేయుని (మహాసేన విరుపాక్షకుని) భక్తుడు.
  • ఈయన అశ్వమేథ, వాజపేయ యాగాలు నిర్వహించాడని ఇతని కుమారుడు వీరపురుషదత్తుని శాసనాల వలన తెలుస్తుంది.
  • నాగార్జున కొండ వద్ద ‘అశ్వమేధ యాగ’ వేదిక బయటపడింది.

 2) వీరపురుషదత్తుడు

  • ఇతను శైవమతంను ద్వేషించినట్లు,శివలింగాన్ని తొక్కుతున్నట్లుగా ఉన్న మాంథాత శిల్పం (పుణ్యశిల) కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేటలో బయల్పడింది
  •  ఇతను బౌద్ధమును ఆదరించాడు. ఇతని కాలంను ఆంధ్రలో ”  బౌద్ధ మత స్వర్ణయుగంగా ” పేర్కొంటారు.
  • ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు.
  • ఇతని కాలంలో శ్రీపర్వతం (నాగార్జున కొండ) మహాయానంకు గొప్ప పుణ్య క్షేత్రమైంది.
  • ఇతని కాలంలోనే శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

 నోట్ :  1. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం – శ్రీపర్వత విశ్వవిద్యాలయం.

2. భారత్ లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం – తక్షశిల.

3. మేనత్త  కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం వీరి కాలంలోనే ప్రారంభమైంది.

3) శ్రీ ఎహుబల శాంతమూలుడు / రెందో శాంతామూలుడు

  •  శాంతమూలుడి సోదరి కొండ, నాగార్జున కొండపై బౌద్ధవిహారాన్ని నిర్మించింది.
  • ఇతని  కాలం నుండే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది.
  • ఆంధ్రదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన పాలకుడు ఇతడే (భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించింది రుద్రదాముడు).
  • నాగార్జునకొండ వద్ద సంస్కృత శాసనం వేయించాడు. (దక్షిణ భారత్ లో తొలి సంస్కృత శాసనం )
  • ఇతని కాలం నాటి ప్రాకృత శాసనం – గుమ్మడి గుర్రు శాసనం.
  • దక్షిణ భారత్ లో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు.
  • నాగార్జున కొండలో ఇతని కాలంలో నిర్మించిన దేవాలయాలు:

                 1. కార్తికేయుని ఆలయం.

                 2. నందికేశ్వర ఆలయం.

                 3. నవగ్రహ ఆలయం.

                4.  హరీతి దేవాలయం : హరీతి దేవాలయంలోని సప్తమాత్రుకల వద్ద ఆ కాలం నాటి 

  • స్త్రీలు సంతానం  కోసం గాజులను సమర్పించేవారు.
  • ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి దేవాలయం నిర్మించాడు. *
  • అభిరరాజు శక సేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణస్వామి దేవాలయం నిర్మించాడు. ఇది ఆంధ్రదేశంలో నిర్మించిన తొలి వైష్ణవాలయం.

4) రుద్ర పురుషదత్తుడు:

  • చివరి ఇక్వాక పాలకుడు రుద్రపురుషదత్తుడు. పల్లవ రాజు సింహవర్మ చేతిలో ఓడినఇక్వాక రాజు ఇతడే.
  • తనను తాను శివభక్తుడిగా ప్రకటించుకున్నాడు
  • ఇతను పుష్పభద్ర స్వామి ఆలయంను నిర్మించాడు.
  • మంచికల్లు శాసనం ప్రకారం పల్లవ వంశస్థాపకుడైన సింహవర్మచే ఇతను ఓడించబడ్డాడు.
  • ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొన్న శాసనాలు- మైదవోలు శాసనం (శివస్కంధవర్మ), మంచుకల్లు శాసనం (సింహవర్మ)

Andhra Pradesh History – Ikshvakulu Download PDF

Andhra Pradesh History Related Articles:
Satavahans   kakatiyas
East Chalukyas  Vijaya Nagara Empire
Reddy and Nayaka Rajulu The Vishnukundins

 

AP History for all APPSC Groups and other Exams eBooks by Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is the architecture of Ikshvakus?

fourth to third century BCE) and characterised by ornate temples and a rich assemblage of pillars, copings, railings, casings and sculptures portraying various themes from Buddhist texts and cosmology. Specimens of Ikshvaku architecture were found in excavations from Nagarjunakonda in Guntur district, Andhra Pradesh.

What was the ruling period of Ikshvakus?

The Ikshvaku (IAST: Ikṣvāku) dynasty ruled in the eastern Krishna River valley of India, from their capital at Vijayapuri (modern Nagarjunakonda in Andhra Pradesh) during approximately 3rd and 4th centuries CE.

What is the symbol of Ikshvakus?

Vijayapuri is the capital of Ikshvakus. The royal emblem of Ikshvakus is Lion. Prakrit is the official language Ikshvakus. Their region is Shaiva.

What is the another name of Ikshvaku?

He is also called Satyavrata (always truthful). Ikshvaku (Sanskrit; ikṣvāku, from Sanskrit ikṣu; Pali: Okkāka), is one of the ten sons of Shraddhadeva Manu, and is credited to be the founder of the Ikshvaku Dynasty.

Who started Ikshvaku dynasty?

Rishabhanatha (son of King Nabhi), the founder of Jainism in the present Avasarpani era (descending half time cycle as per Jain cosmology and Manvantara in hindu cosmology) is said to have founded the Ikshvaku dynasty.