Telugu govt jobs   »   State GK   »   Andhra Pradesh History Reddy, Nayaka Rajulu

Andhra Pradesh History – Reddy, Nayaka Rajulu, APPSC Groups | ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – రెడ్డి, నాయక రాజులు

Table of Contents

Andhra Pradesh History – Reddy and Nayaka Rajulu | ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – రెడ్డి, నాయక రాజులు

రెడి రాజులు మరియు నాయక రాజులు

ముసునూరి నాయకరాజుల చరిత్రకు ప్రధాన ఆధారాలు, ప్రోలయ నాయకుడి విలస తామ్ర శాసనం, కాపషయనాయకుడి పోలవరం శాసనం, ఛోడ భక్తిరాజు పెంటపాడు శాసనం, అనితల్లి కలువచేరు శాసనం క్రీ.శ.1325లో ముసునూరి రాజ్యాన్ని ప్రోలయ నాయకుడు స్థాపించాడు. ఇతడు నేటి ఖమ్మం జిల్లాలోని రేకపల్లిని రాజధానిగా చేసుకుని పాలించాడు. వెన్నయ అనే వ్యక్తికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని విలసగ్రామాన్ని దానం చేసి విలస తామ్ర శాసనాన్ని వేయించాడు.

ప్రోలయ తర్వాత ముసునూరి కాషయనాయకుడు రాజయ్యాడు. ఇతడు ఓరుగల్లుపై దండెత్తి మాలిక్‌ మక్బూల్‌ (గన్నమనాయుడు)ను ఓడించి ఆంధ్రసురత్రాణ, ఆంధ్రదేశాధీశ్వర బిరుదులను పొందాడు.

ముసునూరి నాయక రాజులు (క్రీ.శ. 1325-1368)

రేచర్ల పద్మనాయకులు (వెలమ దొరలు క్రీ.శ. 1325-1475)

  • రేచర్ల పద్మనాయక వంశ మూలపురుషుడు బేతాళనాయకుడు.
  • కానీ వెలుగోటి వంశావళి ప్రకారం చెవ్విరెడ్డిని మూలపురుషుడిగా చెబుతారు.
  • రుద్రమదేవి కాలంలో పని చేసిన రేచర్ల ప్రసాదిత్యుడికి కాకతీయ రాజ్యస్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులున్నాయి.
  • స్వతంత్ర రేచర్ల పద్మనాయక రాజ్యాన్ని 1325లో మొదటి సింగమ నాయకుడు/ మొదటి సింగమ స్థాపించాడు.
  • ఇతడు పిల్లలమర్రిని రాజధానిగా చేసుకుని పాలించాడు.
  • సర్వజ్ఞ సింగభూపాలుడు అనే బిరుదు ఉంది.
  • వీరి కాలంలో రాజభాష సంస్కృతం.
  • ఉదార రాఘవం, నిరోష్ట్య రామాయణం అనే గ్రంథాలను రచించిన కవి శాకల్యభట్టు ఈయన ఆస్టానంలో ఉన్నాడు. శాకల్యభట్టుకు చతుర్భాష కవితా పితామహుడు అనే బిరుదు ఉంది.

అనవోతానాయకుడు / మొదటి అనవోతానాయకుడు (క్రీ.శ.1361 – క్రీ.శ.1384)

  • అనవోతా నాయకుడికి సోమకుల పరశురామ, ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదులున్నాయి.
  • అనవోతా నాయకుడు తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. దేవరకొండను రాజధానిగా చేసి, సోదరుడు మాదా నాయకుడిని అక్కడ నియమించాడు. తను రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. మాదానాయకుడి మంత్రి పోతరాజు.
  • అతడి భార్య నాగాంబిక నాగ సముద్రం అనే తటాకాన్ని తవ్వించింది.
  • రామాయణంపై మాదానాయకుడు రాఘవీయం అనే వ్యాఖ్యానాన్ని రచించాడు.

కుమార సింగమ నాయకుడు / రెండో సింగముడు (క్రీ.శ.1384-13909)

  • యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణ దుగ్గాన్ని జయించి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు.
  • మొదటి బుక్కరాయలను ఓడించి పానగల్లును జయించాడు. సర్వజ్ఞ చక్రవర్తి బిరుదు పొందాడు.
  • ఇతడి ఆస్టాన కవి విశ్వేశ్వరుడుచమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని రచించాడు.
  • ఇతడికి సాహిత్య శిల్పావధి అనే బిరుదు ఉంది.

రెండో అనవోతుడు (క్రీ.శ.13099-1421)

  • రెండో అనవోతా నాయకుడు బహమనీ సుల్తాన్‌ ఫిరోడీషాకు సహాయం చేసి మొదటి దేవరాయల ఓటమికి కారకుడయ్యాడు.
  • ఇతడి తర్వాత మాదానాయకుడు క్రీ.శ.1421 నుంచి 1430 వరకు పరిపాలించాడు.

Andhra Pradesh History – Satavahans Chapter

సర్వజ్ఞసింగ/ మూడో సింగమ (క్రీ.శ. 1430-1475)

  • రేచర్ల పద్మనాయక రాజుల్లో మూడో సింగమ చివరివాడు.
  • కొన్ని ఆధారాల ప్రకారం సర్వజ్ఞసింగముడిని నాలుగో సింగముడిగా ప్రస్తావించారు.
  • ఇతడు రసార్థవ సుధాకరం, సంగీత సుధాకరం అనే గ్రంథాలు; రత్న పాంచాలిక అనే నాటకాన్నీ రచించాడు.
  • ప్రసిద్ధకవి బమ్మెర పోతన ఇతడి ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు.
  • పోతన భోగినీ దండకం, వీరభద్ర విజయం, గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, ఆంధ్ర భాగవతం గ్రంథాలు రచించాడు.

Andhra Pradesh History – Kakathiyas Study material in Telugu |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

Reddy Rajulu | రెడ్డి రాజులు

కాకతీయుల పతనానంతరం సింహాచలం – విక్రమ సింహపురం (నెల్లూరు) మధ్య ఉండే తీరాంధ్ర దేశాన్ని రెడ్డిరాజులు పాలించారు. వీరిలో కొండవీటి రెడ్డిరాజులు, రాజమండ్రి రెడ్డి రాజులు అనే రెండు వంశాలు ఉన్నాయి. రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి. వంశ మూలపురుషుడు మాత్రం కోమటి ప్రోలారెడ్డి.

రాజకీయ చరిత్ర

రెడ్డిరాజుల నాట్య కళారాధన - వికీపీడియా

ప్రోలయ వేమారెడ్డి(1325 – 1353)

  • ఇతడు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఒక నాయంకరుడిగా ఉండేవాడు.
  •  అద్దంకిని రాజధానిగా చేసుకుని కొండవీటి రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు.
  • మ్లేచోబ్ది కుంభోద్భవ, ధర్మ ప్రతిష్టాన గరుడు అనేవి ప్రోలయ వేమారెడ్డి బిరుదులు.
  • ఇతడు శ్రీశైలంలో పాతాళ గంగకు, అహోబిలం కొండకు మెట్లు కట్టించాడు.
  • ఎర్రాప్రగడ, శ్రీగిరి ప్రథమ కవులను పోషించాడు.
  •  ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు, భవ్య చారితుడు బిరుదులు పొందిన ఎర్రన హరివంశం, నృసింహపురాణం గ్రంథాలు రచించాడు.
  • శ్రీగిరి కవి నవనాద చరిత్రము అనే గ్రంథాన్ని రచించాడు.
  • ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలంలో పాతాళగంగకు మెట్లు కట్టించడం 1346లో పూర్తయినట్లు ముట్లూరి శాసనం తెలుపుతోంది.

అనపోతారెడ్డి (క్రీ.శ. 1353-1364)

  • అనవోతారెడ్డిగా కూడా పిలిచే ఇతడు ద్రాకారామ శాసనం వేయించాడు.
  • అందులో ఇతడి బిరుదు ద్వీపజేత.
  • రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు.
  • అనవోతుడి శాసనాలను రచించింది బాలసరస్వతి అనే కవి. ఇతడికి జగనొబ్బగండ అనే బిరుదు కూడా ఉంది.
  • మంత్రి సోమయ్య మోటుపల్లిలో శాసనం వేయించాడు.

అనవేమారెడ్డి (క్రీ.శ.1364-1386)

  • రెడ్డి రాజుల్లో సుప్రసిద్ధుడు అనవేమారెడ్డి.
  • ఇతడికి దివిదుర్గ విశాల సకల జలదుర్గసాధన, ఛురికాసహాయ, ప్రజాపరిచిత చతుర్విధోపాయ అనే బిరుదులు ఉన్నాయి.
  • అనవేముని కళింగ దండయాత్రను నిర్వహించింది అతడి బ్రాహ్మణ సేనాని – చెన్నమ నాయకుడు (సింహాచలం శాసనం). చెన్నమ వడ్డాది పాలకుడు.
  • అనవేముడి మంత్రులు – మామిడి పెద్దనామాత్యుడు, ఇమ్మడేంద్రుడు.
  • అనవేముడు శ్రీశైలంలో వీరశిరోమండపాన్ని, సింహాచలంలో అనవేమపురి మండపాన్ని నిర్మించాడు.
  • ప్రతి సంవత్సరం వసంతోత్సవాలను జరిపి వసంత రాయలు అనే బిరుదు కూడా పొందాడు.

కుమారగిరి రెడ్డి (1386-1402)

  • ఇతడు అనపోతారెడ్డి కుమారుడు.
  • విజయనగర రాజులు శ్రీశైలం, త్రిపురాంతకాలను ఇతడి కాలంలోనే ఆక్రమించారు.
  • కుమారగిరిరెడ్డి వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
  • కర్పూర వసంతరాయల అనే బిరుదు పొందాడు.

పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ.1402-1420)

  • ఇతడు కుమారగిరిరెడ్డిని తరిమివేసి కొండవీడుకు పాలకుడయ్యాడు.
  • పెదకోమటి వేమారెడ్డి తన తమ్ముడు మాచారెడ్డిని కొండపల్లి పాలకుడిగా నియమించాడు.
  • పెదకోమటి వేమారెడ్డి మంత్రి మామిడి సింగన. ఫిరోజ్‌షా, పెదకోమటి వేమారెడ్డిల సంయుక్త సైన్యాన్ని అల్లాడరెడ్డి రామేశ్వరం (తూర్పు గోదావరి) యుద్ధంలో ఓడించినట్లు శివలీలా విలాసం (శివలెంక కొమ్మన) గ్రంథం తెలుపుతోంది.
  • 1416లో మొదటి దేవరాయలు మోటుపల్లిలో అభయశాసనాన్ని వేయించాడు.
  • పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవి వామనభట్టబాణుడు. అతడి ఆస్టానంలో విద్యాధికారి శ్రీనాథుడు. ఇతడు శృంగార నైషథం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, పలనాటి వీరచరితం, శివరాత్రి మహాత్మ్యం గ్రంథాలు రచించాడు. ఇంకా హరవిలాసం, మరుత్తరాట్‌ చరిత్ర గ్రంథాలు కూడా రాశాడు.
  • రాయలు గండపెండేరం తొడిగి కవిసార్వభౌమ బిరుదు ఇచ్చాడు. పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక, సప్తశతి చరితిక అనే గ్రంథాలు రచించి సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు పొందాడు.
  • పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక ఫిరంగిపురం వద్ద సంతాన సాగరం చెరువు తవ్వించింది.

Andhra Pradesh History – Ikshvakulu

రాచవేమారెడ్డి (క్రీశ.1420 – క్రీశ.1424)

  • కొండవీటిరెడ్డి రాజుల్లో చివరి పాలకుడు రాచవేమారెడ్డి.
  • ఇతడు సూరాంబిక, పెదకోమటిల కుమారుడు. సూరాంబిక తవ్వించిన సంతాన సాగరం చెరువుకు జగనొబ్బగండ అనే కాలువను తవ్వించాడని అమీనాబాద్‌ శాసనం తెలుపుతోంది.
  • పురిటి సుంకాన్ని విధించడంతో కోపోద్రేకుడైన సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేమారెడ్డిని అద్దంకి వీధిలో వధించాడు.

Rajahmundry Reddy Rajulu | రాజమండ్రి రెడ్డి రాజులు

కాటయ వేమారెడ్డి (1402-1414)

  • కొండవీటి రెడ్డిరాజైన కుమారగిరిరెడ్డి బావ కాటయ వేమారెడ్డి. కుమారగిరి రెడ్డి మరణానంతరం రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని కాటయ వేమారెడ్డి స్థాపించాడు.
  • కాటయ వేముడు కుమారగిరి రాజీయం అనే గ్రంథాన్ని రచించాడు.

రెండో కుమారగిరిరెడ్డి

  • కాటయవేమారెడ్డి రెండో కుమారుడు.
  • ఇతడి కాలంలోనే అన్నదేవఛోడుడు పట్టిసం (పట్టిసీమ -పశ్చిమగోదావరి) ను ఆక్రమించాడు. రెందో కుమారగిరిరెడ్డి 1416లో మరణించాడు.

అల్లాడరెడ్డి

  • రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని పటిష్టం చేశాడు.
  • ఇతడు పలివెల, వేమవరం శాసనాలువేయించాడు.
  • ఇతడి సేనాని నరహరినీడు ‘పాలకొల్లు’ శాసనం (1416) వేయించాడు.
  • అల్లాడరెడ్డి 1420 ప్రాంతంలో మరణించాడు. తర్వాత మూడో కుమారగిరిరెడ్డి, మూడో అనవో తారెడ్డి పాలించారు.
  • కొమ్ము చిక్కాల శాసనం (1422) ప్రకారం మూడో అనవోతారెడ్డిరాజధాని రాజమండ్రి.

వీరభద్రారెడ్డి (1423-1448)

  • వీరభద్రారెడ్డి, అతడి అన్న వేమారెడ్డి రాజ్యపాలన చేశారు.
  • రెండో దేవరాయలతో స్నేహం చేసి గజపతుల, పద్మనాయకుల దండయాత్రలను ఎదుర్కొన్నారు.

కందుకూరు రెడ్డిరాజ్యం

  • ప్రోాలయ వేమారెడ్డి సోదరుడు ప్రోలయ మల్లారెడ్డి. ఇతడు అద్దంకి రాజ్యానికి (కొండవీడుకు) సర్వసైన్యాధ్యక్షుడు.
  • మోటుపల్లిని జయించాడు. ధరణికోట యుద్ధంలో బహమనీ సుల్తాన్‌ హసన్‌ గంగూను ఓడించాడు.
  • ఫలితంగా ప్రోలయ వేమారెడ్డి ఇతడిని బోయ విహారదేశంపై ప్రతినిధిగా నియమించాడు.
  • శ్రీగిరి వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చెరువులు తవ్వించాడు. తర్వాత ఈ రాజ్యాన్ని రెండో కోమటిరెడ్డి మూడో కోమటిరెడ్డి (శ్రీగిరి కుమారుడు) పాలించారు.
  • ఆ తర్వాత ఈ రాజ్యం విజయనగర రాజుల సామంత రాజ్యంగా మారిపోయింది

రెడ్డి రాజ్య యుగవిశేషాలు

  • రెడ్డి రాజ్య యుగాన్ని కాకతీయ యుగానికి అనుబంధ యుగంగా చెప్పవచ్చు.
  • సాంప్రదాయక పాలనవిధానం ఉండేది. రాజు సర్వాధికారి. ప్రధాని, సేనాపతి, పురోహితుడు తోడ్పడేవారు.
  • అతడికి యంత్రాంగంలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజ్యం సీమలు – నాయంకరాలు – గ్రామాలుగా విభజన చెంది ఉండేది.
  • గ్రామపాలన ఆయగాండ్రు (12 మంది) చేసేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు. తలారినే ఆరెకుడు అనేవారు.
  • న్యాయనిర్వహణలో దివ్యపరీక్షల ద్వారా నేర నిరూపణ జరిగేది.
  • పంటలో 1/6వ వంతు పన్ను వసూలు చేసినట్లు విలస తామ్రశాసనం తెలుపుతోంది.
  • దేవబ్రాహ్మణ మాన్యాలపై పన్ను మినహాయింపు ఉండేది.
  • దశబంధమాన్యాలను అనుభవించేవారు 1/10వ వంతు నీటిసుంకం చెల్లించేవారు.
  • రణముకుడుపు అనే ఆచారం పాటించేవారు. అంటే యుద్దంలోచనిపోయినవారి రక్త మాంసాలతో అన్నం వండి యుద్ధదేవతలకు నివేదనం చేసేవారు.

Andhra Pradesh History – East Chalukyas

రెడ్డి రాజ్య ఆర్థిక పరిస్థితులు

  • వ్యవసాయం ప్రధానవృత్తి. ప్రధాన ఆహారధాన్యం జొన్నలు.
  • రెడ్డిరాజులు సంతాన సాగరం చెరువును తవ్విస్తే, వెలమలు అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగసముద్రం చెరువులను తవ్వించారు.
  • నాటి పరిశ్రమల్లో అగ్రస్థానం వస్త్ర పరిశ్రమది.
  • పలనాడు,వినుకొండ ప్రధాన కేంద్రాలు.
  • నాడు విదేశీ వాణిజ్యంలో అత్యంత ప్రముఖుడు అవచితిప్పయ్య శెట్టి(కొండవీడు). కప్పలి, జోంగు,వల్లి, వలికా అనేవి నాటి నాకా రకాలని శ్రీనాథుడి హరవిలాసంపేర్కొంటుంది.
  • జోంగు అనేది చైనా నౌక. ప్రధాన వాణిజ్య పంట ద్రాక్ష. నాణెం – దీనార్‌.

రెడ్డి రాజ్య సమాజం

  • రెడ్డిరాజులు మొదట్లో శైవమతాన్ని అనుసరించారు.
  • ప్రాలయ వేమారెడ్డి శైవుడే. కానీ కుమారగిరిరెడ్డి, కాటయవేమారెడ్డి వైష్ణవ మతాభిమానులు.
  • రెడ్డిరాజుల కుల దేవత మూలగూరమ్మ. స్మార్తవిధానం అగ్రవర్ణాల్లో ఉండేది.
  • పద్మనాయక రాజైన సర్వజ్ఞసింగముని ఆస్థానంలో నైనాచార్యులు (వరదాచార్యులు)వైష్ణవాన్ని స్థాపించారు.
  • సర్వజ్ఞసింగముని కోరిక మేరకు నైనాచార్యుడి తండ్రి అయిన వేదాంత దేశికుడు సుభాషిత నీతి, తత్త్వసందేశృరహస్య సందేశ అనే గ్రంథాలు రచించాడు.

సమాజం:

  • చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ ఆధిక్యత, వర్ణవ్యవస్థ కఠినం, జూదం సర్వ సాధారణ వినోదం, బ్రాహ్మణుల్లో కూడా వేశ్యాలంపటత్వం మితిమీరినట్లు శివరాత్రి మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
  • వడ్డీ వ్యాపారులు అధిక మోసాలు చేసేవారు. శకునాలను ఎక్కువగా నమ్మేవారు.

విద్యా-సారసత్వాలు:

  • సంస్కృతం రాజభాష. లలితకళలను కూడా పోషించారు. వసంతోత్సవాలు నిర్వహించేవారు. నటులు, గాయకులకు ప్రోత్సాహం లభించేది.
  • గొండ్లి, జిక్కిణి, పేరిణి, చిందు లాంటి దేశీ నాట్యరీతులే కాకుండా పారశీక మత్తల్లి అనే విదేశీ నాట్యరీతులు అమల్లో ఉండేవి.

Andhra Pradesh History – Kakathiyas

సంస్కృత భాష:

  • ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి మహాదేవుడు సంస్కృత విద్వాంసుడు.
  • అనవోత కాలంలో బాలసరస్వతి, అనవేమ కాలంలో త్రిలోచనాచార్యులు గొప్ప పండితులు. కుమారగిరి-వసంతరాజీయం, కాటయ వేమారెడ్డి- కుమారగిరి రాజీయం అనే గ్రంథాలు రచించారు.
  • పెదకోమటి వేమారెడ్డి సంగీత చింతామణి, సాహిత్య చింతామణి రచించారు.
  • పెదకోమటి వేముడి ఆస్టాన కవి వామనభట్ట బాణుడు. ఇతడు ఉషా పరిణయం, పార్వతీ పరిణయం, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం, వేమ భూపాల చరిత్ర శబ్ద రత్నాకరం, చంబ్ద చంద్రిక అనే రచనలు చేశారు.
  • అనవోతుని ఆస్థానంలో ఉన్న నాగనాథకవి-మదన విలాసబాణం గ్రంథం రచించారు.
  • రెండో సింగభూపాలుడు- రసార్జవ సుధాకరం, రత్న పాంచాలిక, సంగీత సుధాకరం, అనే రచనలు చేశారు.
  • రేచర్ల సింగముని ఆస్థానంలో ఉన్నశాకల్యమల్లు భట్టు- నిరోష్ట్య రామాయణం, ఉదార రాఘవం, అవ్యయ సంగ్రహ నిఘంటువు అనే రచనలు చేశాడు.

తెలుగు భాష:

  • దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన తొలి వ్యక్తి వినుకొండ వల్లభామాత్యుడు (క్రీడాభిరామం గ్రంథంలో). దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది శ్రీకృష్ణదేవరాయలే.
  • కాంచీ మహాత్మ్యంగ్రంథాన్ని దగ్గుపల్లి దుగ్గన్న రచించారు.
  • ఎర్రన- ఉత్తర హరివంశం గ్రంథాన్ని రచించిప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఎర్రన తన చివరి రచన నృసింహపురాణంలో ప్రబంధ శైలికి బీజం వేశాడు.
  • శ్రీగిరికవి- నవనాథ చరిత్ర, విన్నకోటపెద్దన- కావ్యాలంకార చూడామణి రచించారు. విన్నకోట పెద్దనకావ్యాలంకార చూడామణి గ్రంథాన్ని చాళుక్య విశ్వేశ్వరుడికి అంకితం ఇచ్చాడు. శివలీలా విలాసం (విన్నకోట) దొడ్డారెడ్డి(అల్లాడరెడ్డి కుమారుద్దుుకి అంకితం చేశారు.
  • ఇంకా ఇతను వాశిష్ట రామాయణం, ‘సకల నీటి సమ్మతం’గ్రంథాలను రచించాడు.
  • ఇతడు రావిపాటిత్రిపురాంత కవిసంస్కృత రచన ‘ప్రేమాభిరామం’ను తెలుగులో క్రీడాభిరామంగాఅనువదించాడు.
  • అనంతామాత్యుడనే కవి ‘భోజ రాజీయం’ గ్రంథాన్ని రచించారు.
  • శ్రినాథుడి తాత కమలనాభుడు కూడా ‘పద్మపురాణం’ గ్రంథాన్ని రచించాడు .
  • దేవరకొండ పద్మనాయకరాజు పెదవేదగిరి ఆస్టానం లో కవి అయ్యలార్యుడు రామాయణ ఆంధ్రీకరణ పూర్తిచేశాడు.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఆర్టికల్స్ 

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – యూరోపియన్ల రాక ఆంగ్ల పాలన
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర – సాంస్కృతిక పునరుజ్జీవనం
ఆంధ్రప్రదేశ్ – చరిత్ర, భౌగోళిక మరియు ఆసక్తికరమైన విషయాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రాచీన చరిత్ర

 

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

Who were the Reddys and Nayaka Rajulu?

The Reddys were a powerful dynasty that ruled Andhra Pradesh from the 14th to the 17th century. The Nayaka Rajulu were a group of rulers who emerged as prominent leaders in the 16th and 17th centuries.

What were the major contributions of the Reddys and Nayaka Rajulu?

The Reddys focused on defence, agriculture, and trade, constructing irrigation systems and promoting economic growth. The Nayaka Rajulu excelled in administration, infrastructure development, and patronage of art and culture.

How did the Reddys and Nayaka Rajulu impact agriculture?

The Reddys encouraged agriculture and built irrigation systems, which led to increased agricultural productivity and economic prosperity. The Nayaka Rajulu continued these efforts, promoting further agricultural development.

What was the cultural significance of the Reddys and Nayaka Rajulu?

Both dynasties played a crucial role in the promotion of art, architecture, and literature. They constructed magnificent temples, fortresses, and irrigation works, leaving behind a rich cultural heritage.