Telugu govt jobs   »   TSPSC   »   TSPSC Recruitment 2022
Top Performing

TSPSC Groups: TSPSC Group 2 & 3 Notifications 2022 is going to Release on December 2022 | TSPSC గ్రూప్ 2 & 3 నోటిఫికేషన్‌లు త్వరలో విడుదల

TSPSC Recruitment 2022 Notification: Telangana State Public Servie Commission (TSPSC) is going to Release TSPSC Group 2 Notification 3rd week of december 2022 and TSPSC Group 3 Notification also released in next week to two weeks on its official website tspsc.gov.in. TSPSC Group-2 and 3 categories Posts will increase in Telangana state. As part of Group 2, 726 jobs will be filled and 1,373 jobs will be filled in Group 3. Earlier, the finance department had given permission for 663 jobs in Group 2. After the latest additions, the number has reached 726. Read for More Details.

TSPSC Recruitment 2022 Notification | TSPSC రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్

TSPSC Group Recruitment 2022: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 3వ వారంలో వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చే వారం నుంచి రెండు వారాల్లో విడుదల కానుందని సమాచారం. గ్రూప్ 2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గతంలో గ్రూప్ 2లో 663 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. తాజా చేర్పుల తర్వాత వాటి సంఖ్య 726కు చేరింది.   గ్రూప్ 2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖల ASO, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే మరో 6 రకాల పోస్టులు. అలాగే  గిరిజన సంక్షేమ శాఖ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను గ్రూప్ 3లో చేర్చారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులతో పాటు కొత్తగా మంజూరైన పోస్టులతోపాటు కమిషన్ ప్రకటనలు విడుదల చేయనుంది. కొత్తగా మంజూరైన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి కమిషన్ కు ప్రతిపాదనలు అందాయి. చేర్పులతో పాటు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు TSPSC కసరత్తు చేస్తోంది.

TSPSC Groups Recruitment 2022 Increased Vacancies | TSPSC గ్రూప్స్ లో అదనంగా మరిన్ని పోస్టులు..

గ్రూప్-2 కింద 726 పోస్టులు, గ్రూప్-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్-2, గ్రూప్-3 స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఇలా అదనంగా చేర్చిన పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కన్నా.. తత్సమాన హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. సహాయ సంక్షేమాధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. ఈ పోస్టులు తహసీల్దారు కన్నా ఎక్కువ హోదా కలిగినవి. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్-2 కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్-2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్సీకి అందించాయి. ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు పెరగనున్నాయి. సంక్షేమశాఖల్లో ఎస్సీ(17), ఎస్టీ(9), బీసీ (17) సహాయ సంక్షేమాధికారి పోస్టులు కలిపి 43 ఉన్నట్లు సమాచారం. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జువైనల్ సర్వీసు విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్-2 తో పాటే కమీషన్ భర్తీ చేయనుంది.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC Group 2 Recruitment Increased Vacancies | గ్రూప్-2లో మరో 6 కేటగిరీలు

TSPSC Group 2 : గ్రూప్-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు), సహాయ సెక్షన్ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు (జువైనల్ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి.

TSPSC Group 3 Recruitment Increased Vacancies | గ్రూప్ -3లో మరో రెండు సర్వీసులు

TSPSC Group 3: గ్రూప్-3లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరీల ఉద్యోగాలున్నాయి. కొత్తగా మరో రెండు సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య పదికి చేరింది. కొత్తగా అకౌంటెంట్ (గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతులు కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్-3 పరిధిలో ఉంటాయి.

 

Telangana Study Note:

Telangana History (తెలంగాణ చరిత్ర) Telangana State Formation – Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర -తెలంగాణ రాష్ట్ర అవతరణ)
Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Telangana Government Schemes (తెలంగాణ ప్రభుత్వ పధకాలు)
Telangana Current Affairs (తెలంగాణ కరెంటు అఫైర్స్) Other Study Materials

TSPSC Selection Process | TSPSC ఎంపిక ప్రక్రియ

TSPSC Selection Process : TSPSC ఎంపిక ప్రక్రియ అనేక దశలను కలిగి ఉంటుంది. అయితే, TSPSC నిర్వహించే వివిధ పరీక్షలకు ఈ దశలు మారుతూ ఉంటాయి. TSPSC ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌ల ద్వారా పరీక్షలను నిర్వహిస్తుంది మరియు వ్రాత పరీక్షల తర్వాత, అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు ఏదైనా అధికారిక ప్రకటన కోసం TSPSC అధికారిక పోర్టల్‌లో ట్యాబ్‌ను ఉంచుకోవచ్చు. TSPSC నోటిఫికేషన్‌లు మరియు ఇతర కొత్త అప్‌డేట్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. ఏదైనా కొత్త సమాచారం కోసం మీరు మా పేజీని కూడా అనుసరించవచ్చు.

TSPSC Group 4 Recruitment 2022

adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC Group 2 & 3 Notifications Released on December 2022, Increased Vacancies_5.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!