TSPSC GROUP-1 Preparation Plan 2024
TSPSC has released a new notification with 563 vacancies for Group 1 Jobs. TSPSC Group 1 Preliminary Exam will be conducted on 9 June 2024, and TSPSC Group 1 Mains will be conducted from 21 October. But let’s know how to plan for TSPSC Group 1 Preliminary Exam.
Candidates writing civils for state-level groups as well as senior candidates are more likely to compete. As the maximum age limit for all jobs except uniform jobs that have been mentioned in the notification is 46 years, it has become possible for all the candidates. Competition is likely to be fierce as fresh candidates are also open to new jobs. Read in this article what kind of plan candidates should follow in such a background.
Adda247 APP
TSPSC 563 ఖాళీలతో గ్రూప్ 1 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను 9 జూన్ 2024 న నిర్వహించబడుతుంది, TSPSC గ్రూప్ 1 మెయిన్స్ 21 అక్టోబర్ నుండి నిర్వహించబడుతుంది. అయితే TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ప్రణాళిక ఎలా వేసుకోవాలి తెలుసుకుందాం.
రాష్ట్ర స్థాయి గ్రూప్స్ కు సివిల్స్ రాసే అభ్యర్థులతో పాటు సీనియర్ అభ్యర్థులు ఎక్కువగా పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ లో యూనిఫాం ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలు అన్నిటికీ గరిష్ఠ వయసు 46 సంవత్సరాలుగా పేర్కొనడంతో అభ్యర్థులందరికీ అవకాశాలు ఏర్పడినట్లు అయింది. కొత్త ఉద్యోగాలపై తాజా అభ్యర్థులకు కూడా అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధమైన ప్రణాళిక అనుసరించాలో ఈ కథనంలో చదవండి.
Decoding TSPSC Group I 2024, Download PDF
కొత్త అభ్యర్థులుTSPSC గ్రూప్-1 పరీక్షకు ఎలా సాధన చెయ్యాలి?
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ 19 ఫిబ్రవరి 2024 నాటికి డిగ్రీ పాసైన అందరూ అర్హులే అని నిర్ణయించడంతో ఇటీవల పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా గ్రూప్-1 పరీక్షను రాయవచ్చు. గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి గానీ ఫస్ట్ క్లాస్ లాంటి నిబంధనలు ఏమీ లేవు తెలియజేసింది. అందువల్ల గ్రాడ్యుయేషన్ అర్హత 19-02-2024 నాటికి పొందిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష రాయవచ్చు.
ప్రిలిమినరీ పరీక్షపై పట్టు:
- కొత్తగా పరీక్షకు సాధన చేస్తున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్షపై పట్టు సాదించాలి. జూన్ నాటికి పరీక్ష జరిగే అవకాశం ఉన్నందున పూర్తి సమయాన్ని సాధనకు వినియోగించడం ద్వారా మెయిన్స్ కు అర్హత సాధించవచ్చు.
- అందువల్ల ప్రిలిమ్స్ లోని అన్ని విభాగాలను ఉదవాల్సి ఉంటుంది. పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, చరిత్ర మొదలైన అధిక స్కోరింగ్ అంశాల్ని లోతుగా చదవాలి. మిగతా విషయాలపై కూడా స్థూల అవగాహన ఏర్పరచుకోవాలి.
- పరీక్షకు ముఖ్యమైన అంశాలను గుర్తించి తయారవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. అదే సందర్భంలో ప్రిలిమ్స్ లో చదివే అనేక అంశాలు మెయిన్స్ పరిక్షలో సమాధానం రాసేందుకు కావలసిన ప్రాధమిక భావననూ, విషయ అవగాహననూ ఏర్పరుస్తాయి. ఇది గమనించి ప్రిలిమ్స్ నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువ సమయం కేటాయిస్తే అది తెలివైన నిర్ణయం అవుతుంది.
ప్రిలిమ్స్ సాధనలో మెయిన్స్ పాత్ర కీలకం:
- తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సమాజం సంస్కృతి, వారసత్వం, కళలు, తెలంగాణ పాలసీలు మొదలైనవి ప్రిలిమినరీలో స్కోరును పెంచుకునేందుకూ, మెయిన్స్లో బాగా రాణించేందుకూ తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అంశాలు.
- వీటిని ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ దృష్టిలో ఉంచుకొని అనుసంధానం చేసుకునే విధంగా అధ్యయన ప్రణాళిక వేసుకొని చదవాలి.
- ఒక పేపర్లో ఉండే మొత్తం సిలబస్ని పరిశీలించుకుని అందులో ఏ అంశాలు ప్రిలిమినరీతో ముడిపడి ఉన్నాయో వాటిని ప్రిలిమ్స్, మెయిన్స్ కోణంలో ప్రిపేర్ అవటం ద్వారా మెయిన్స్ పేపర్ల వారీగా సాధన చేయడంలో ఉపయోగపడుతుంది.
- దీనిపై అభ్యర్ధులు కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మధ్య మూడు నెలల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది.
- ఇలాంటి అతి తక్కువ సమయంలో 6 పేపర్లను మెయిన్స్ దృష్టి కోణంలో చదవడం నిజంగా కష్టమైన విషయమే. మెయిన్స్లో ఆన్సర్ రాసే విధానంపై పట్టు దొరకాలంటే ఇప్పటినుంచి ప్రిలిమ్స్ తో సంబంధమున్న మెయిన్స్ అంశాలను, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవటం మంచిది.
- అదేవిధంగా పాత ప్రశ్నపత్రాలు తీసుకుని ప్రిలిమినరీ బిట్స్ మరియు మెయిన్స్ ప్రశ్నలు సాధన చెయ్యడం ద్వారా పరీక్ష మీద పూర్తి అవగాహనా మరియు సామర్ధ్యాల అంచనా వస్తుంది.
సీనియర్లు TSPSC గ్రూప్-1 పరీక్షకు ఎలా సిద్దం కావాలి?
- ప్రిలిమ్స్, మెయిన్స్ గత కొన్ని సంవత్సరాలుగా చదువుతూ విపరీతమైన పట్టు కలిగిన అభ్యర్థులు ఒక రకం. ఇలాంటి అభ్యర్థులు విషయ అవగాహన పరంగా చాలా బలంగా ఉంటారు.
- కాబట్టి ప్రిలిమినరీ 45 రోజుల ముందు వరకు మెయిన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ సరైన రీతిలో సమాధానాలు ఉన్నాయా లేవా అని మరింతగా సాధన చెయ్యడం అవసరం.
- అనేక సబ్జెక్టుల్లో గత సంవత్సర కాలంలో వచ్చిన మార్పులను కూడా అర్థం చేసుకుని సమాధానాల్లో ఇంటిగ్రేట్ చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. అందువల్ల సరైన గైడెన్స్ పొందుతూ సమాధానాన్ని మూల్యాంకనం చేయించుకుని లోపాలను సరిదిద్దుకోవాలి. ఇలా చేయగలిగితే రాష్ట్రస్థాయి ఉన్నత ఉద్యోగాల్లో చేరటం ఖాయమైనట్లే.
- గత ఒకటిన్నర సంవత్సరాలుగా సిద్ధమవుతున్న అభ్యర్థులు మరొక రకం. వీరికి కూడా మెయిన్స్పై మంచి పట్టే ఉంటుంది కానీ పూర్తి పరిపక్వత స్థాయి పట్టు ఉండదు.
- అందువల్ల ఈ తరహా అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష 45 రోజులు ముందు వరకు మెయిన్స్ కంటెంట్పై అధిక దృష్టి నిలుపుతూ టెస్టులు ప్రాక్టీన్ చేయటం మంచిది. అంటే కంటెంట్ మెరుగుదల ఉండాలి. వివరణాత్మక ప్రశ్నలకు సమాధాన నిపుణత కలిగి ఉండాలి.
సివిల్స్ మరియు గ్రూప్-1 రెండూ చదివేవారు ఏం చెయ్యాలి?
- సీనియర్లలో మరొక రకం అటు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఇటు గ్రూప్-1 రాయాలనుకునే వర్గం. వీరు సివిల్స్ రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ సివిల్స్కి ప్రత్యామ్నాయంగా గ్రూప్-1 పరీక్ష ఎంచుకుంటారు.
- ఇలాంటి వారు ఈ సంవత్సరం అక్టోబర్ లోపుగా ప్రిలిమినరీ, మెయిన్స్ పూర్తి అవుతాయి. కాబట్టి ఆటు సివిల్స్పై దృష్టి పెట్టాలా.. ఇటు గ్రూప్-1పై దృష్టి పెట్టాలా అనే సందిగ్ధంలో ఉంటారు. ఇలాంటి అభ్యర్థులు నిష్పక్షపాతంగా సివిల్స్ విజయావకాశాలను ఒకసారి ధ్రువీకరించుకుని ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం మంచిది.
- వాళ్లకి మిగిలిన ప్రయత్నాలు, గతంలో రాసిన మెయిన్స్ అనుభవాలు ఈ సందర్భంగా సమీక్షించుకుని రాష్ట్ర గ్రూప్-1పై దృష్టి నిలపటం హేతుబద్ధమైన విషయం.
- ఒకవేళ సివిల్స్ని తాజాగా ప్రయత్నిద్దామనుకునే అభ్యర్థులు ఈ సంవత్సరానికి గ్రూప్-1కే పరిమితమై ప్రిపేర్ అవ్వటం మంచి నిర్ణయమే! సమాధానాలు రాసేటప్పుడు సివిల్స్ సమాధానాలు కొంత స్థానికీకరణం చెందాల్సి ఉంటుంది. ఇది కంటెంట్లో కావచ్చు, రాసే సమాధాన పద్ధతిలో కావచ్చు. సివిల్స్ పరీక్షలకూ, గ్రూప్-1 పరీక్షలకూ మెయిన్స్లో రాసే విధానంలో కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వీటిని అర్ధం చేసుకొని సాధన చెయ్యాలి.