Telugu govt jobs   »   appsc-group-1   »   APPSC Group 1 Interview Tips

Top 10 Tips To Succeed in APPSC Group 1 Interview | APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి టాప్ 10 టిప్స్

Top 10 Tips To Succeed in APPSC Group-1 Interview: APPSC గ్రూప్-1 మెయిన్స్ 2023 ఫలితాలు విడుదల కాగా, ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూలో విజయం సాదిస్తే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో  గ్రూప్-1 ఆఫీసర్ గా మీకు ఉద్యోగం పొందవచ్చు. చాలా మంది అభ్యర్థులకీ ఇంటర్వ్యూ ను ఎలా ఎదుర్కోవాలి అనే భయం ఉంటుంది. అందుకే మీ కోసం మేము  ఇంటర్వ్యూలో విజయం సాధించడం కొరకు కొన్ని చిట్కాలను దిగువన పేర్కొన్నాము. ఇంటర్వ్యూను సులభంగా ఎదుర్కోవడానికి కొన్ని చివరి నిమిషం చిట్కాలు క్రింద ఉన్నాయి. ఈ టిప్స్ ని అనుసరించి APPSC గ్రూప్-1 ఇంటర్వ్యూ లో విజయం సాదించవచ్చు.

APPSC Group 1 interview Schedule

APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి టాప్ 10 టిప్స్

 • ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం “ఎల్లప్పుడూ నమ్మకం” అనేది అత్యంత సాధారణ సలహా, కానీ నిజ జీవితంలో విశ్వాసాన్ని పెంచుకోవడం చాలా కష్టం.
  • చిట్కా: ఈ చివరి కొన్ని రోజుల వ్యవధిలో మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన చిట్కా ఏమిటంటే, ‘అపరిచితులతో మాట్లాడండి’, అవును! మీరు దానిని సరిగ్గా అర్థం చేసుకున్నారు, సమీపంలోని కార్యాలయాలకు (బ్యాంకులు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి) వెళ్లి వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న కొత్త వాతావరణం మీ ఆత్మవిశ్వాస స్థాయిలను పెంచుతుంది.
 • ఇంటర్వ్యూలో మీకు కఠినమైన ప్రశ్న వచ్చినప్పుడు ప్రశాంతంగా గా ఉండండి మరియు ఆందోళన పడకండి.
  • చిట్కా: యాదృచ్ఛిక ప్రశ్నలకు సమయస్ఫూర్తి తో పరిష్కరించేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి మరియు వాటిని పరిష్కరించడానికి అవసరమైన కళను నేర్చుకోండి. యాదృచ్ఛిక ప్రశ్నలను  మిమ్మల్ని అడగమని  మీ స్నేహితులను అడగండి మరియు వాటికి సులభంగా సమాధానాలను సున్నితంగా తిరస్కరించడం నేర్చుకోండి
 • ఇంటర్వ్యూలో సమాధానం చెప్పేటప్పుడు సరళమైన భాషను వాడుతూ తప్పులు దొర్లకుండా, సమాధానాల మధ్యలో తడపడకుండా సమాధానం చెప్పడం నేర్చుకోవాలి.
  • చిట్కా: అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ సమాధానాలలో “హమ్స్ మరియు ఆహ్స్” వంటి పదాలను నివారించవచ్చు. ప్రతిరోజూ అద్దం ముందు 30 నిమిషాలు మాట్లాడం సాదన చేయండి మరియు మీరు ఏమి మాట్లాడుతున్నారో ఒక అవగాహనకు రండి

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

 • ప్రసంగంలో స్పష్టత కోసం కొన్ని స్వర వ్యాయామాలు చేయండి.
  • చిట్కా: ప్రసంగం యొక్క స్పష్టతను సాధించడానికి ప్రతిరోజూ ఒక నిమిషం పాటు నిరంతరంగా “బాబాబాబా/దాదాదాదా’ అక్షరాలను పునరావృతం చేయండి.
 • రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • చిట్కా: ముఖ్యమైన వర్తమాన అంశాలను చదువుకుని వాటిపై మీ సొంత అభిప్రాయాలను పెంపొందించుకోండి..
 • ఇంటర్వ్యూ వెళ్ళేప్పుడు మంచి వస్త్రాదరణ ఏంతో ముఖ్యమైన అంశం, కాబట్టి ఫార్మల్ దుస్తులు ధరించండి మరియు అవి మీకు సౌకర్యంగా ఉండేలా చూస్కోండి.
  • చిట్కా: ఒక రోజు లేదా రెండు రోజుల ముందు అదే దుస్తులను ధరించడం ప్రాక్టీస్ చేయండి, దాని ద్వారా ఫార్మల్ దుస్తులు మీకు గతంలో అలవాటు లేకపోతే, అలవాటు అవుతుంది.
 • ఇంటర్వ్యూకు చివరి వారంలో చదవడం మరియు సాదన చేయడం రెండు ముఖ్యమైన అంశాలు. కాబట్టి చదవడం మరియు సాదన చేయడం కొరకు సమానమైన సమయాన్ని వెచ్చించండి.
  • చిట్కా: ప్రతిరోజూ 70% సమయాన్ని ప్రిపేర్ అవడానికి మరియు 30% సమయాన్ని బిగ్గరగా మాట్లాడటం ద్వారా సాధన చేయడానికి వెచ్చించండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చర్చించడం లేదా మాక్ ఇంటర్వ్యూ లు ఇవ్వడం (వివిధ సంస్థలలో అనేక ఉచిత మాక్ ఇంటర్వ్యూలు అందుబాటులో ఉన్నాయి) మంచిది.
 • ఇంటర్వ్యూ అనేది వ్యక్తిత్వానికి పరీక్షే తప్ప మీ జ్ఞానానికి కాదు. ఇప్పటికే మీ పరిజ్ఞానాన్ని మునుపటి రెండు దశలలో పరీక్షించబడింది.
  • చిట్కా: ఇంటర్వ్యూ అనేది ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి ఓ లిట్మస్ పరీక్ష లాంటిది. “ఒక ప్యానెల్ వ్యక్తులతో మాట్లాడటాన్ని ఎలా ఎదుర్కోగలరు, కఠినమైన ప్రశ్నలు ఎదురైతే ఎలా ఎదుర్కోగలరు, చిరాకుగా మరియు ఉద్రిక్తంగా ఉంటారా లేదా దానిని ఎదుర్కోవడంపై దృష్టి పెడతారా?” అనేదానికి ఇది ఒక పరీక్ష.
  • “ఒక చిన్న సమస్యపై వాదనకు దిగుతారా లేదా చట్టం ప్రకారం చట్టబద్ధంగా వ్యవహరించగలరా?”
  • ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నుంచి ఒక్క ప్రతికూల వ్యాఖ్య తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోతారా?
  • మొత్తంమీద, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఎలా చూపగలుగుతున్నారు మరియు సంబంధిత ఉద్యోగ స్థాయికి అనుబంధంగా ఎలా ఉండగలరు అనేదానిపై దృష్టిసారిస్తారు.
 • కమిషన్ విడుదల చేసిన DAF (ఇన్ఫర్మేషన్ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్) ను ఎటువంటి తప్పులు లేకుండా అన్ని ఖాళీలను జాగ్రతగా పూరించండి
 • మీ ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు, మిమ్మల్ని మీరు విజేతగా ఊహించుకోండి.సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి మరియు ప్రతికూల వార్తలకు ప్రభావితులు కాకండి
  • చిట్కా: ఇంటర్వ్యూకు ముందు రోజు బాగా నిద్రపోండి మరియు ఆరోగ్యకరమైన తేలికైన ఆహారం తీసుకోండి. ఇంటర్వ్యూ ప్రదేశానికి ఒక గంట ముందుగా చేరుకోండి, మీ సర్టిఫికేట్‌లు పరిశీలించబడతాయి కాబట్టి అన్ని సర్టిఫికేట్‌లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేసుకోండి.

👍All The Best For Your interview👍

Note: ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు_50.1

 Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీలు ఏమిటి?

APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2023 వరకు ప్రతి రోజు (పని రోజులలో)  ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనున్నాయి.