APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీలు
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీలు : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీ ని విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి హాజరు కావలెను. 03/06/2023 నుండి 10/06/2023 వరకు (04.06.2023 మినహా) గ్రూప్-I సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం 10 జిల్లా కేంద్రాలలో మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2023 వరకు ప్రతి రోజు (పని రోజులలో) ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనున్నాయి. APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి తమకు షెడ్యూల్ చేయబడిన తేదీన ఈ అడ్రస్ లో ఉన్న (న్యూ HOD’S బిల్డింగ్‌లో, 2వ అంతస్తు, M.G. రోడ్, ఎదురుగా. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, విజయవాడ) ప్రదేశానికి హాజరు కావలెను. APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీ అవలోకనం
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2023 వరకు జరుగుతాయి. ఇంటర్వ్యూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుంది. APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి హాజరు కావలెను. APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీ అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) |
పరీక్షా | APPSC గ్రూప్ 1 |
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ తేదీ | 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2021 వరకు |
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ సమయం | ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు |
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల | 14 జూలై 2023 |
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం | న్యూ HOD’S బిల్డింగ్‌లో, 2వ అంతస్తు, M.G. రోడ్, ఎదురుగా. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, విజయవాడ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ వెబ్ నోట్
03 జూన్ 2023 నుండి 10 జూన్ 2023 (04 జూన్ 2023 మినహా)వరకు జరిగిన వ్రాతపూర్వక మెయిన్స్ పరీక్షలో 259 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) షెడ్యూల్ మరియు తేదీలు అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్లు ద్వారా కూడా పంపబడతాయి. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షాలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధుల ఇంటర్వ్యూ హాజరు కావాలి. ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూ నిర్వహించేందుకు APPSC సిద్ధమవుతోందని APPSC వెబ్ నోట్ లో విడుదల చేసింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేసుకోగలరు
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ వెబ్ నోట్
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్
APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి హాజరు కావలెను. APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2023 వరకు జరుగుతాయి. ఇంటర్వ్యూ ప్రతి రోజు (వర్కింగ్ డేస్) ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనున్నాయి. APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు ఇంటర్వ్యూకి తమకు షెడ్యూల్ చేయబడిన తేదీన న్యూ HOD’S బిల్డింగ్‌లో, 2వ అంతస్తు, M.G. రోడ్, ఎదురుగా. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, విజయవాడ లో ఉన్న ఈ ప్రదేశానికి హాజరు కావలెను. APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్ధులు ఏ రోజున ఇంటర్వ్యూ కి హాజరు కావాలో APPSC షెడ్యూల్ ప్రకటించింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్ తనిఖీ చేయగలరు.
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి తీసుకు వెళ్ళవలసిన పత్రాలు
స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు తాత్కాలికంగా అర్హత పొందిన అభ్యర్థులు 27/07/2023న జరిగే డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్‌లు అంటే SSC, డిగ్రీ మరియు స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)కి తాత్కాలికంగా అర్హత పొందిన అభ్యర్థులు అదే రోజు ఇంటర్వ్యూలో ఒరిజినల్ సర్టిఫికేట్‌లను (SSC, డిగ్రీ) సమర్పించాల్సి ఉంటుంది. ధృవీకరణ సమయంలో వయస్సు సడలింపు రుజువు, అర్హతలు రుజువు చేయడానికి –
- స్టడీ సర్టిఫికేట్/ నివాస ధృవీకరణ పత్రం లేదా సంబంధిత పత్రాలు
- స్థానిక హోదా ధృవీకరణ పత్రం (వారు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చినట్లయితే)
- రిజర్వ్‌డ్ అభ్యర్థుల విషయంలో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్
- బి.సిల విషయంలో క్రీమీ లేయర్ నుండి మినహాయింపు సర్టిఫికేట్
- వికలాంగ అభ్యర్థుల విషయంలో PH సర్టిఫికేట్,
- స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ( స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసేవారు).
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ ప్రదేశం
APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ 02 ఆగష్టు 2023 నుండి 11 ఆగష్టు 2023 వరకు ప్రతి రోజు (పని రోజులలో) ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్ధులు ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి తమకు షెడ్యూల్ చేయబడిన తేదీన, న్యూ HOD’S బిల్డింగ్‌లో, 2వ అంతస్తు, M.G. రోడ్, ఎదురుగా. ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, విజయవాడ లో జరగనున్న APPSC గ్రూప్ 1 ఇంటర్వ్యూ కి హాజరుకావాలి
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు 2023
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు 2023 విడుదల అయ్యాయి. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్ధుల నిరీక్షణ ముగిసింది. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా జూన్ 3వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడింది. APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు 14 జూలై 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి, అభ్యర్థులు వారి వ్యక్తిగత స్కోర్‌లు మరియు మెరిట్ ర్యాంక్‌లను తనిఖీ చేయగలరు. APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితం 2023 ఫలితాలు తనిఖీ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |