Telugu govt jobs   »   Telangana Socio Economic Survey 2022 Key...   »   Telangana Socio Economic Survey 2022 Key...

Telangana Socio Economic Survey 2022 Key Highlights, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ముఖ్యాంశాలు

Telangana Socio Economic Survey 2022 Key Highlights: The Government of Telangana publishes the Socio Economic Outlook (SEO) annually and tables it in the State Legislature during the budget session. It presents the socio-economic performance of the State across various sectors and recognizes the specific gaps and challenges to initiate appropriate action. It also presents the information on Government policies and flagship programs, and analyses their performance. SEO2022 highlights the major achievements of the State in relevant sections.

Telangana  Socio-Economic Survey 2022
Socio Economic survey year 2022
Useful for  TSPSC  Groups, SI, Constable

Telangana Socio Economic Survey 2022 Key Highlights_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Socio-Economic Survey 2022 in Telugu (Important Points) : ప్రధాన అంశాలు

TSPSC Groups, SI, Police Constable వంటి అన్ని పోటీ పరీక్షలకు తెలంగాణ సామాజిక ఆర్ధిక సర్వే ఎంతో ముఖ్యమైన అంశము. TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో ఈ అంశం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కావున ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొనే Telangana Socio-Economic Survey 2022 కి సంబంధించిన పూర్తి అంశాలను ముఖ్యమైన పాయింట్ల రూపంలో మీకు అందిస్తున్నాము.

 

తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022 ముఖ్యాంశాలు

2021 – 2022లో పన్నేతర రాబడి అంచనాలు చేరుకోకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,557 కోట్ల పన్నేతర రాబడిని అంచనా వేయగా జనవరి వరకు రూ.7 వేల కోట్లలోపు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడి అంచనాలను రూ.25,421 కోట్లుగా పేర్కొంది. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ.15,500 కోట్లను, గనుల శాఖ ద్వారా రూ.6,399 కోట్లను అంచనా వేయగా మిగిలిన మొత్తం ఇతర పన్నేతర రాబడిగా పేర్కొంది.

ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కొని నిలబడగలదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ నిరూపించుకుంది. గత రెండేళ్లలో కోవిడ్‌–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి వృద్ధి రేటులో తెలంగాణ మళ్లీ పూర్వపు దూకుడును అందుకుంది. స్థిర ధరల వద్ద 2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 8.9 శాతం కాగా, తెలంగాణ 11.2 శాతం సాధించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం… ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్రం 19.1 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ సగటు 19.4 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.

GSDP అంటే ఏమిటి?

ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన తుది సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)/ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) అంటారు. ఆర్థికాభివృద్ధికి సూచికలుగా జీడీపీ, జీఎస్‌డీపీలను పరిగణిస్తారు.

జాతీయ వృద్ధి రేటును అధిగమించి రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధి

Telangana Socio Economic Survey 2022 Key Highlights_50.1
TS and National GDP-GSDP Graph

తెలంగాణా తలసరి ఆదాయం

వ్యక్తిగత స్థాయిలో ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు సూచికైన తలసరి ఆదాయం వృద్ధిలో రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. 2021–22లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా, జాతీయ సగటు రూ.1,49,848 మాత్రమే. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు అధికంగా ఉంది. 2020–21లో రాష్ట్రం రూ.2,37,632 తలసరి ఆదాయంతో 14 పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.

జిల్లాల వారీగా తలసరి ఆదాయం
రంగారెడ్డి 6,58,757
హైదరాబాద్ 2,51,331
మేడ్చల్ – మల్కాజ్గిరి 2,40,008
మెదక్ 2,29,833
మహబూబ్ నగర్ 2,23,348
యాదాద్రి 2,22,100
సిద్దిపేట 2,19,292
జయశంకర్ భూపాలపల్లి 2,13,735
సంగారెడ్డి 2,04,692
నల్గొండ 2,01,144
కరీంనగర్ 1,91,205
సూర్యాపేట 1,83,810
భద్రాద్రి 1,83,386
ఖమ్మం 1,83,318
నిర్మల్ 1,79,169
వరంగల్ రూరల్ 1,75,951
ఆదిలాబాద్ 1,75,171
జనగాం 1,74,636
పెద్దపల్లి 1,73,981
ములుగు 1,67,769
నిజామాబాదు 1,66,766
నాగర్ కర్నూల్ 1,63,462
రాజన్న సిరిసిల్ల 1,56,150
కామారెడ్డి 1,55,032
మంచిర్యాల 1,54,955
మహబూబాబాద్ 1,52,577
వనపర్తి 1,51,458
జగిత్యాల 1,50,048
జోగులాంబ గద్వాల 1,49,606
నారాయణపేట 1,43,428
వరంగల్ అర్బన్ 1,38,387
కొమురం భీమ్ 1,37,488
వికారాబాద్ 1,37,479

Also read: Telangana Budget 2022-23 

తెలంగాణా సేవల రంగానికి అత్యధిక వాటా

రాష్ట్రాల జీఎస్డీపీకి మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ఊతమిస్తాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)నకు సేవల రంగమే ప్రధాన చేయూత ఇస్తోంది. తర్వాతి స్థానంలో పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలున్నాయి. 2021–22లో జీఎస్‌వీఏలో 61.3 శాతం వాటా సేవల రంగానిదే కాగా, 20.4 శాతం వాటా పారిశ్రామిక, 18.3 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలది.

2014–15లో 16.3 శాతం ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2021–22లో 18.3 శాతానికి పెరిగింది. 2014–15లో మైనస్‌ 0.66 శాతం రుణాత్మక వృద్ధి రేటు కలిగిన రాష్ట్ర వ్యవసాయ, అనుబంధాల రంగాలు.. 2021–22లో 9.09 శాతం వృద్ధి రేటును సాధించడం దీనికి నిదర్శనమని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ తెలంగాణకు వెన్నుముకగా ఉన్న వ్యవసాయం 48 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్‌ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు సాగు అభివృద్ధికి దోహదపడ్డాయి.

పెరిగిన పురుగు మందుల వినియోగం: తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల వినియోగం భారీగా పెరిగిందని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22 వెల్లడించింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం 2018లో 28లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 2020లో 39లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపింది. సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, పంట రకం, పంట విధానం, పంట తీవ్రత, నేల రకం, దాని పరిస్థితి, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, రైతుల సామర్థ్యం వంటి అనేక కారణాల వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం నిర్ణయిస్తారు. నీటి పారుదల సౌకర్యం గణనీయంగా పెరగడంతో సాగు విస్తీర్ణం అధికమైంది. దీంతో ఎరువుల వినియోగం పెరిగిందని తెలిపింది.

తెలంగాణా రైతు బంధు పధకం

2021–22 యాసంగిలో దాదాపు 63 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందారు. వీరిలో 72.58 శాతం మంది సన్నకారు రైతులు. 18.30 శాతం మంది చిన్న రైతులు. మిగిలినవారు పెద్దరైతులు. రైతుబంధు కింద ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో కలిపి రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 2021–22 యాసంగిలో మొత్తం 63 లక్షల మంది లబ్ధిదారులలో 53 శాతం మంది బీసీలున్నారు. 13 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారున్నారు. రైతుబంధు మొత్తం సొమ్ములో 48 శాతం బీసీలకు, 30 శాతం ఇతరులకు, 13 శాతం ఎస్టీలకు, 9 శాతం ఎస్సీలకు పంపిణీ చేశారు.

తెలంగాణా రైతు భీమా

2018 నుండి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు ప్రాణాలు కోల్పోతే సంబంధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక ఉపశమనంగా రూ.5 లక్షల బీమా మొత్తం అందజేస్తుంది. ఈ ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018–19 నుండి ప్రభుత్వం రూ.3,763.80 కోట్ల మేరకు క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఆ మొత్తాన్ని 75,276 పేద కుటుంబాలకు బదిలీ చేసింది. 2020–21సంవత్సరంలో రైతు బీమా కింద 32.7లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.

49 శాతం సాగు భూమి: తెలంగాణ రాష్ట్రం 276.96లక్షల ఎకరాలకు పైగా భౌగోళిక విస్తీర్ణంతో భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. మొత్తం విస్తీర్ణంలో 49.07 శాతం విస్తీర్ణం నికర సాగు ప్రాంతం. 24.07 శాతం అటవీ విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయేతర ఉపయోగాలకు కింద భూమి దాదాపు 7.46 శాతం, బీడు భూములు 9.02 శాతం, బంజరు, సాగుకు యోగ్యత లేని భూమి 5.42 శాతం ఉంది. ఇతరత్రా సాధారణ భూములున్నాయి.

ముఖ్యమైన కేటాయింపులు (రూ. కోట్లలో)

అంశం 2021-2022 2022-2023
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిల అభివృద్ధికి 2.00 250. 00
జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిల్లో శస్త్ర చికిత్స వస్తువులకు 13.57 75.00
వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల్లో నిర్ధారణ పరీక్షలకు 1.00 100.00
టీవీవీపీ ఆసుపత్రిల్లో పరికరాల కొనుగోలుకు 1.00 200.00
బోధనఆసుపత్రిల్లో నిర్ధారణ పరీక్షల పరికరాలకు .- 250. 00
బోధనఆస్పత్త్రుల్లో డిస్పోసబుల్స్ 150.00
ఔషధాలకు 253.80 377.43
ప్రాధమిక వైద్యంలో నిర్ధారణ పరీక్షలకు 50.00
పీహెచ్ సీ ల్లో పరికరాలకు 50.00
104 వాహనాలకు 36.82 15.00
108 వాహన సేవలకు 52.94 30.00
102 వాహనాలకు(అమ్మఒడి ) 15.00 5.00

Download Telangana Socio Economic Survey 2022 Key Highlights

********************************************************************************************

Telangana Socio Economic Survey 2022 Key Highlights_60.1

Also check: CUET 2022 Exam Pattern

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Telangana Socio Economic Survey 2022 Key Highlights_70.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana Socio Economic Survey 2022 Key Highlights_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Socio Economic Survey 2022 Key Highlights_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.