రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా రాజేష్ బన్సాల్ నియామకం
రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్ బిఐహెచ్) 2021 మే 17 నుంచి అమల్లోకి ఆర్ బిఐహెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా రాజేష్ బన్సాల్ ను నియమించినట్లు ఆర్ బిఐహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఫిన్ టెక్ పరిశోధనను ప్రోత్సహించడానికి మరియు ఆవిష్కర్తలు మరియు స్టార్ట్-అప్ లతో నిమగ్నతను సులభతరం చేయడానికి అంతర్గత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.
బన్సాల్ గురుంచి :
- డిజైనింగ్ టెక్నాలజీ ని ఆధారంగా చేసుకొని చెల్లింపు ఆధారిత ఉత్పత్తుల విషయంలో,ఎలక్ట్రానిక్ నగదు బదిలీలు, డిజిటల్ ఆర్థిక సేవలు మరియు డిజిటల్ ఐడిలను రూపకల్పన చేయడంలో భారతదేశంతో పాటు బహుళ ఆసియా మరియు ఆఫ్రికన్ మార్కెట్లలో సమ్మిళిత అభివృద్ధిని పొందటానికి బన్సల్ కు 25 సం” పైగా అనుభవం ఉన్నది
- టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ మరియు పేమెంట్ సిస్టమ్ రంగాలలో ఆయన ఆర్ బిఐలో వివిధ హోదాల్లో పనిచేశారు.
- అతను ఆధార్ వ్యవస్థాపక బృందంలో సభ్యుడిగా ఉన్నాడు, అక్కడ అతను భారతదేశం యొక్క ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ వ్యవస్థ మరియు ఎలక్ట్రానిక్ కెవైసి (ఇకెవైసి) రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఆర్ బిఐ మరియు భారత ప్రభుత్వం యొక్క వివిధ కమిటీలలో ఆయన సభ్యుడిగా ఉన్నారు అని ప్రకటన తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి