Telugu govt jobs   »   Nagoba Jatara   »   Nagoba Jatara

Nagoba Jaathara-Telangana Culture, తెలంగాణ సంస్కృతి – నాగోబా జాతర

Nagoba Jatara : Nagoba Jatara is a tribal festival held in Keslapur village, Indervelli Mandal Adilabad district, Telangana, thus the festival is also known as Keslapur Jatara. It is a huge religious and cultural event of the Boigutta branch of Mesram clan of the aboriginal Raj Gond and Pradhan tribes

Festival  Nagoba Jaathara
Section Telangana- Art and Culture

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర: 

  • జనవరి 30 రాత్రి పవిత్ర గోదావరి నదీ జలాభిషేకం అనంతరం జాతర మొదలయింది.
  • తొలినుంచి వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు!
  • వాటితో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది.
  • రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా మూడురోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది.
  • వేడుకల అనంతరం(ఫిబ్రవరి 3న) ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.
  • దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు.
  • ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది.

 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_50.1

 

తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 

తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర-పవిత్ర జలం యొక్క ప్రాముఖ్యత: 

  • పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు.
  • దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు.
  • కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు.
  • తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు.
  • 3 సంవత్సరాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.

also read: తెలంగాణ జాతీయ రహదారులు

 

తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర-నైవేద్య ప్రాముఖ్యత-పుట్టలు మెత్తడం : 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_60.1

  • జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు.
  • ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి.
  • ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు.
  • జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి.
  • 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు.
  • గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది.
  • ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు.

Also read: తెలంగాణా SI పరీక్షా విధానం 

  • ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన.
  • దీన్ని ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించాడు.
  • స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు.
  • జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.
  • నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు.
  • అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు.
  • అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం.
  • ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_70.1

History of Nagoba Festival-నాగోబా జాతర- చరిత్ర

  • క్రీ.శ 740.. కేస్లాపూర్‌లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు.
  • నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు.
  • నిరుత్సాహానికిగురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు! ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకొని..
  • తనకు తెలిసిన పురోహితుడు (పధాన్ పడమార్)ని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు.
  • ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి, 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరినీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకంచేశాడు.
  • ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు.
  • ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు!

also read:  తెలంగాణ జిల్లాల సమాచారం 

 

తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర-కుండల తయారీ: 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_80.1

ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేస్తారు. ఇదికూడా ఆచారంలో భాగమే! గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.

 

 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర: 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_90.1

గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంవూతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్షికమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్షికమంలో పాట్లాల్, గయిక్ వాడి, హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు.

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_100.1

తెలంగాణ సంస్కృతి- నాగోబా జాతర-భేటింగ్ కీయ్‌వాల్: 

  • మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు.
  • దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం.
  • వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాక్షిగిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు.
  • కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు.
  • వధువులు ఇద్దరు చొప్పున జతలు గా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్షికమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు.
  • అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

Also read: APPSC AE 2022 Application modification link Activated

 

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_110.1

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_130.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Nagoba Jatara,తెలంగాణ సంస్కృతి - నాగోబా జాతర_140.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.