Telugu govt jobs   »   Article   »   Computer Awareness Pdf in Telugu |...

Computer Awareness Pdf in Telugu | DBMS | For Banking,SSC, & EMRS Exams | కంప్యూటర్ అవేర్నెస్ DBMS

Computer Awareness Pdf in Telugu : Overview

Banking పరీక్షలు మొదలుకొని, SSC, APPSC, TSPSC మరియు Group-1, 2, 3 మరియు SI, Constable మరియు త్వరలో జరగబోయే EMRS పరీక్షలలో కంప్యూటర్ అవేర్నెస్ చాల ముఖ్యమైన అంశాలలో ఒకటి. అభ్యర్ధులు కంప్యూటర్ యొక్క చరిత్ర మొదలుకొని, ప్రస్తుత కంప్యూటర్ శఖంలో జరిగిన వినూత్న మార్పుల వరకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం చాల అవసరం. వీటిని దృష్టిలో ఉంచుకొని మీకు Banking మాత్రమే కాకుండా మిగిలిన అన్ని పోటీ పరీక్షలలో భాగంగా Adda247 Telugu మీకు Computer Awareness PDF రూపంలో అందిస్తోంది .

Computer Awareness విభాగానికి సంబంధించి Banking, APPSC Groups, TSPSC Groups, SSC, EMRS వంటి అన్ని పరీక్షలలో ఇది ఒక ప్రత్యేక విభాగంగా లేదా స్టాటిక్ అవేర్నెస్ లో ఈ అంశం పై ప్రశ్నలు రావడం అనివార్యం కావడం కారణంగా దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచడం చాలా అవసరం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చాప్టర్ ప్రకారం పూర్తి వివరణతో మీకు మెటీరియల్ ఉచితంగా (free study material) అందించే ప్రయత్నం చేస్తున్నాము. 

ఇటివల కాలంలో అన్ని పోటీ పరీక్షలలో తప్పకుండా అడిగే ముఖ్యమైన అంశం Computer Awareness. ఇటివల కాలంలో ప్రతి పని దాదాపు కంప్యూటర్ మీద ఆధారపడి చెయ్యాల్సి వస్తుంది. నిజానికి ఇది మానవ మనుగడలో ఒక భాగంగా చెప్పవచ్చు. 20 శతాబ్దంలో ప్రాధమికంగా కంప్యూటర్ ఆవిష్కరించిన దగ్గర నుండి మొదలుకొని, ఇప్పటి కంప్యూటర్ తరం వరకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మనం ఇప్పటివరకు దీనిలో వచ్చిన మార్పులు, అభివృద్ధి, దాని యొక్క అనువర్తనాలు వంటి పూర్తి సమాచారం ఈ క్రింది విధంగా పొందవచ్చు. 

 

Computer Awareness Pdf in Telugu : DBMS(దత్తాంశ నిర్వహణ వ్యవస్థ) 

  1. దత్తాంశ నిర్వహణ వ్యవస్థ(Database Management System)ఒక క్రమ పద్ధతిలో పుస్తకాలని అమర్చినప్పుడు దానిని గ్రంథాలయం లేదా  పుస్తక భాండాగారం అన్నట్లే దత్తాంశాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చినప్పుడు దానిని దత్తాంశ భాండాగారం అనో, దత్తాంశాలయం అనో దత్తాంశనిధి అనో అంటాము.
  2. గ్రంథాలయంలో పుస్తకాలని ఒకే విధంగా అమర్చాలని నిబంధనలు అంటూ  ఏమీ లేదు. పిల్లల పుస్తకాలు వేరు గానూ, పెద్దల పుస్తకాలు వేరుగానూ అమర్చవచ్చు. లేదా, ఇంగ్లీషు పుస్తకాలు ఒక చోటులోనూ, తెలుగు పుస్తకాలు మరొక చోటులోనూ, భాషలవారీగా అమర్చవచ్చు. లేదా, లెక్కల పుస్తకాలు ఒక చోట, తెలుగు పుస్తకాలు మరొక చోట, అంశాలని విడగొట్టి ఒకే చోటలో అమర్చవచ్చు.
  3. ఇదే విధంగా దత్తాంశాలని రకరకాలుగా అమర్చి దాచవచ్చు. ఇలా అమర్చే  పద్ధతిని పరిభాషలో స్కీమా (schema) అంటారు. ఈ స్కీమాని “వంశవృక్షం” మాదిరి అమర్చవచ్చు, లేదా పట్టికల రూపంలో అమర్చవచ్చు.
  4. దత్తాంశాలని పట్టికల రూపంలో అమర్చినప్పుడు దానిని “రిలేషనల్ డేటాబేస్” (relational database) అంటారు. దత్తాంశాలని భద్రపరచటం మాత్రమే కాకుండా ఇప్పుడు భద్రపరచిన సమాచారాన్ని వెతికి వెలికి తీయవచ్చు. “ఫలానా వ్యక్తి జీతం ఎంత?” “ఆ వ్యక్తి ఏమి చదువుకున్నాడు?” “మన కంపెనీలో 5 అడుగుల 6 అంగుళాలు కంటె ఎక్కువ పొడుగున్న ఉద్యోగుల పేర్లు ఏమిటి?” వగైరా ప్రశ్నలని “ప్రశ్నలు” అని కాని క్వెరీలు(Queries) అని కాని అంటారు. మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం “రిపోర్ట్” అవుతుంది. మనం నిక్షిప్తం చేసిన దత్తాంశ భాండాగారాన్ని రకరకాల కోణాలలో “చూసి” నప్పుడు, అలా చూడడాన్ని దృష్టి (లేదా వ్యూ) అంటారు.
  5. దత్తాంశ నిర్వహణ వ్యవస్థ(DBMS) లేదా దత్తాంశ ప్రవిద్య అనేది ఒక అనువర్తన తంత్రాంశ నిధి (application software suite). ఇది అంతిమ వినియోగదారులతో (end user) కాని, ఇతర అనువర్తనాలతో కాని ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకోడానికి వెసులుబాటు కల్పిస్తుంది.
  6. దత్తాంశ నిర్వహణ వ్యవస్థలలో రకాలు ఉన్నాయి; ఒకొక్క రకం ఒకొక్క దత్తాంశ నమూనాని దన్నుగా వాడుకుంటుంది. ఎక్కువ ప్రచారంలో ఉన్న దత్తాంశ నమూనా (data model) లేదా దత్తాంశనిధి నమూనా (database model) పేరు Relational Data Model.
  7. ఈ రిలేషనల్(Relational Data Mode) నమూనాలో దత్తాంశాలు పట్టికల (tables) రూపంలో అమర్చబడి ఉంటాయి. ఈ పట్టీకలలో నిక్షిప్తం అయి ఉన్న దత్తాంశాలని ప్రశ్నించి (క్వెరీ చేసి) సమాధానాలు రాబట్టడానికి SQL(Structured Query language) (సీక్వెల్ అని ఉచ్చరిస్తారు) అనే భాషని ఎక్కువగా వాడతారు.
  8. ఇటీవలి కాలంలో పట్టికల రూపంలో కాకుండా ఇతర రూపాలలో కూడ దత్తాంశాలని దాచుతున్నారు (ఉదా: వచనం రూపంలో). అటువంటి సందర్భాలలో ప్రశ్నించడానికి NoSQL (నో సీక్వెల్) అనే భాషని ఎక్కువగా వాడుతున్నారు.
  9. డేటాబేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్(Database Management System) : DBMS అనేది డేటాబేస్ ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్. డేటాబేస్ నుంచి డేటాను సృష్టించడం, నిల్వ చేయడం, తిరిగి పొందడం, డిలీట్ చేయడం వంటి కార్యకలాపాలను అమలు చేయడానికి ఇది ఒక క్రమబద్ధమైన మార్గాన్ని అందిస్తుంది. ఇది డేటాబేస్ మరియు అంతిమ వినియోగదారుల మధ్య పరస్పర చర్య గా పనిచేస్తుంది. ఇది డేటాబేస్ లకు రక్షణ మరియు భద్రతను కూడా అందిస్తుంది. MySQL, Oracle, SQL Server, IBM DB2, PostgreSQL, Amazon Simple DB (cloud-based) అనేవి కొన్ని ప్రజాదరణ పొందిన DBMS.

డేటాబేస్ మోడల్ రకాలు: 

  • నెట్ వర్క్ డేటాబేస్ మోడల్, 
  • హైరార్కికల్ డేటాబేస్ మోడల్, 
  • రిలేషనల్ డేటాబేస్ మోడల్ మరియు 
  • ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ డేటాబేస్ మోడల్.

Computer Awareness Pdf in Telugu : DBMS-Achitecture

డేటాబేస్ వ్యవస్థల్లో సంక్లిష్ట డేటా నిర్మాణాలు ఉంటాయి. వినియోగదారుల నుండి అసంబద్ధమైన సమాచారాన్ని కప్పిపుచ్చే ప్రక్రియను డేటా అబ్స్ట్రాక్షన్ అని అంటారు. వినియోగదారులకై డేటా అబ్స్ట్రాక్షన్ డేటాబేస్ తో సంక్లిష్టతను తగ్గిస్తుంది. డేటా అబ్స్ట్రాక్షన్ యొక్క మూడు స్థాయిలు భౌతిక స్థాయి(Physical Level), తార్కిక స్థాయి(Logical Level) మరియు వీక్షణ స్థాయి(View level). వాణిజ్య DBMS యొక్క ఆర్కిటెక్చర్(నిర్మాణం) ANSI-SPARC డేటాబేస్ ఆర్కిటెక్చర్(నిర్మాణం) ఆధారంగా రూపొందించబడింది.

భౌతిక స్థాయి/అంతర్గత స్థాయి(Physical Level/Internal Level) – ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క అత్యల్ప స్థాయి. డేటా భౌతికంగా ఎలా నిల్వ చేయబడుతుందో ఇది వివరిస్తుంది. B + ట్రీ, హాష్ ఫైల్ పద్ధతులు ఈ ఇందులో ఉపయోగించబడతాయి.

తార్కిక స్థాయి(Logical Level/Conceptual Level) – ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క తదుపరి స్థాయి మరియు ఏ డేటా నిల్వ చేయబడుతుందో మరియు ఆ డేటా మధ్య సంబంధం ఏమిటో వివరిస్తుంది. తార్కిక స్థాయిలో, ప్రతి రికార్డ్ వివరించబడుతుంది. డేటాబేస్ నిర్వాహకులు ఈ స్థాయి లో పనిచేస్తారు. ఈ స్థాయిలో చేసిన మార్పులు డేటా యొక్క బాహ్య లేదా భౌతిక స్థాయిలను ప్రభావితం చేయవు.

వీక్షణ స్థాయి / బాహ్య స్థాయి(View Level/External Level)– ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క అత్యున్నత స్థాయి మరియు పట్టికలు మరియు రిలేషన్స్  పరంగా వినియోగదారు వీటిని చూస్తారు. ఇది మొత్తం డేటాబేస్ యొక్క కొంత భాగాన్ని మాత్రమే వివరిస్తుంది మరియు తార్కిక స్థాయి వివరాలను దాచిపెడుతుంది.

డేటామోడల్: డేటా మోడల్ అనేది డేటాబేస్ నిర్మించే ఒక ప్రణాళిక. మోడల్ డేటాను కంప్యూటర్లలో  నిల్వ చేసే పద్ధతి లో కాకుండా వినియోగదారు సమాచారాన్ని చూసే విధంగా రూపొందించడానికి ఇది ఉపకరిస్తుంది . డేటా మోడల్స్  అవసరమైన డేటా ఎలిమెంట్స్ పై మాత్రమే దృష్టి పెడతాయి.

To download ChapterWise ComputerAwareness PDF in Telugu-Click Here

Computer Awareness Pdf in Telugu : Conclusion

APPSC, TSPSC మరియు Group-1, 2, 3 మరియు SI, Constable పరీక్షలలో కంప్యూటర్ అవేర్నెస్ చాల ముఖ్యమైన అంశాలలో ఒకటి. దీనిని  దృష్టిలో ఉంచుకొని మీకు Banking మాత్రమే కాకుండా మిగిలిన అన్ని పోటీ పరీక్షలలో ఉపయోగపడే విధంగా మేము పై విధంగా సమాచారం అందించడం జరిగింది. దీనితో పాటు Banking Awareness, Static Awareness మరియు General Awareness కు సంబంధించిన PDF లు కూడా పొందగలరు. 

 

Computer Awareness Pdf in Telugu : FAQs

Q 1. Computer Awareness కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?

జ. Adda247 అందించే computer Awareness PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.

Q 2. Computer Awareness విభాగం కోసం ఎలా సిద్ధం కావాలి?

. ప్రతి రోజు మేము అందించే PDF లను క్రమం తప్పకుండా అనుసరించడం ద్వారా మరియు Adda247 తెలుగు youtube ఛానల్ అనుసరించడం ద్వారా మీరు సిద్ధం కావచ్చు. 

Q 3. Computer Awareness  మరియు computer Knowledge రెండు ఒకటేనా?

. రెండూ ఒక్కటే, పరీక్ష కోణంలో సిలబస్ ఏదైనా కావచ్చు కాని కంటెంట్ ఒకటే ఉంటుంది.

Q 4. Computer Awareness కు  సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

. సాధారణంగా దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉంటుంది. కంప్యూటర్లు-చరిత్ర ,కంప్యూటర్ల జనరేషన్(తరాలు) & రకాలు, కంప్యూటర్-ప్రాథమిక అంశాలు,డేటా ప్రాసెసింగ్ సైకిల్,ప్రాథమిక & సెకండరీ మెమరీ, ఇన్‌పుట్ & అవుట్పుట్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు విధులు, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రకాలు, ఇతర నిబంధనలు, సాఫ్ట్‌వేర్- సిస్టమ్ సాఫ్ట్వేర్,అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ భాషలు- ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, మెమరీ స్టోరేజీ యూనిట్, నెంబర్ సిస్టమ్,లాజిక్ గేట్స్, DBMS, Microsoft Office, కంప్యూటర్ నెట్‌వర్క్, OSIమోడల్ మరియు దాని పొరలు, అంతర్జాలం(ఇంటర్నెట్), కంప్యూటర్ హ్యాకింగ్ , సంక్షిప్తీకరణల జాబిత.

 

[sso_enhancement_lead_form_manual title=”కంప్యూటర్ అవగాహన | DBMS Part-1″ button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/07/28131737/DBMS-PART-1-1.pdf”]

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Sharing is caring!

FAQs

EMRS కి ప్రత్యేకంగా కంప్యూటర్ అవరేనేసస్ ఎక్కడ లభిస్తుంది?

EMRS మరియు SSC, బ్యాంకింగ్ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ADDA 247 తెలుగు కంప్యూటరు అవేర్నెస్ PDFని ఈ కధనం లో అందిస్తోంది.

DBMS స్టడీ మెటీరీయల్ PDF ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

ఈ కధనంలో అభ్యర్ధుల కోసం కంప్యూటరు అవేర్నెస్ DBMS అంశాన్ని PDF రూపం లో అందించాము, పై లింకు ద్వారా PDF ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు